మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన [[రంగారెడ్డి జిల్లా]], [[వికారాబాదు]] వద్ద [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] కొండల్లో పుట్టి [[నల్గొండ]] జిల్లా, [[వాడపల్లి (దామరచర్ల మండలం)|వాడపల్లి]] (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట [[సూర్యాపేట]] వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత [[పాలేరు నది|పాలేరు]] నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం [[కృష్ణా నది|కృష్ణానది]] యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%<ref>http://www.irrigation.ap.gov.in/volume1.pdf</ref> సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర ఉంది.
 
మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు [[వంతెనలు]] ఉన్నాయి. వీటిలో ''పురానా పుల్'' (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]] వంశస్తుడైన [[ఇబ్రాహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] 1578 లో నిర్మించాడు<ref>[https://books.google.co.in/books?id=v4UKJFLZVcEC మొహమ్మద్ కులీ కుతుబ్ షా] - 2 వ పేజీ</ref>. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. ''నయా పుల్'' (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉంది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నాయి. [[విజయవాడ]] వెళ్ళే జాతీయ రహదారి 7, [[వరంగల్]] వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.[[ఫైలు:Musi right2.jpg|thumb|చాదర్‌ఘాట్ వద్ద మూసీనది దృశ్యం. ఈ చిత్రం నిజాం కాలంనాటి ఛాదర్‌ఘాట్ పాతవంతెన నుండి తూర్పు వైపుకు తీయబడింది. నుండి తీయబడింది. చిత్రంలో దగ్గరగా కనిపిస్తున్నది చాదర్‌ఘాట్ ప్రాంతంలో 1990వ దశకంలో కట్టిన వంతెన. దూరంగా కనిపిస్తున్నది మలక్‌పేట నుండి కాచీగూడవైపు వెళ్ళే రైలుమార్గంలో మూసీపై ఉన్న రైలు వంతెన. పాత వంతెనను ఉత్తరంవైపు వెళ్ళే వాహనాలకు, కొత్తవంతెనను దక్షిణం వైపు వెళ్ళే వాహనాలకు ఉపయోగిస్తున్నారు]]
 
[[ఫైలు:Musi right2.jpg|thumb|చాదర్‌ఘాట్ వద్ద మూసీనది దృశ్యం. ఈ చిత్రం నిజాం కాలంనాటి ఛాదర్‌ఘాట్ పాతవంతెన నుండి తూర్పు వైపుకు తీయబడింది. నుండి తీయబడింది. చిత్రంలో దగ్గరగా కనిపిస్తున్నది చాదర్‌ఘాట్ ప్రాంతంలో 1990వ దశకంలో కట్టిన వంతెన. దూరంగా కనిపిస్తున్నది మలక్‌పేట నుండి కాచీగూడవైపు వెళ్ళే రైలుమార్గంలో మూసీపై ఉన్న రైలు వంతెన. పాత వంతెనను ఉత్తరంవైపు వెళ్ళే వాహనాలకు, కొత్తవంతెనను దక్షిణం వైపు వెళ్ళే వాహనాలకు ఉపయోగిస్తున్నారు]]
==వరదలు==
20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. [[1830]]లో యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ ప్రాంతాన్ని సందర్శించి తన [[కాశీయాత్ర చరిత్ర]]లో మూసీ గురించి, దాని వరదల గురించి వ్రాసుకున్నాడు. ఆయన [[1829]]లో మూసీనదికి గొప్ప వరదలు వచ్చాయని వ్రాశారు. ఢిల్లీ దర్వాజా వద్ద ఆంగ్లేయులు నిర్మించిన వారధిని ఆ వరద ప్రవాహం పగలగొట్టి, బేగంబజారులో కొన్ని వీధులను ముంచి పోయిందని వ్రాశాడు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> [[1908]] [[సెప్టెంబరు 28]], మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.
1,89,126

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2447328" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ