అక్కినేని నాగార్జున: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి +{{Authority control}}, typos fixed: కు → కు , → |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 636: | పంక్తి 636: | ||
*[http://oniondosa.blogspot.com/2006/05/nagarjuna-ki-20-years.html తెలుగు సినీరంగంలో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నాగార్జున] |
*[http://oniondosa.blogspot.com/2006/05/nagarjuna-ki-20-years.html తెలుగు సినీరంగంలో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నాగార్జున] |
||
* {{imdb name|id=0015459|name=అక్కినేని నాగార్జున చిత్రాల సమాచారం ఐఎమ్‌డిబి}} |
* {{imdb name|id=0015459|name=అక్కినేని నాగార్జున చిత్రాల సమాచారం ఐఎమ్‌డిబి}} |
||
⚫ | |||
{{Authority control}} |
{{Authority control}} |
||
⚫ | |||
[[వర్గం:1959 జననాలు|అక్కినేని నాగార్జున]] |
[[వర్గం:1959 జననాలు|అక్కినేని నాగార్జున]] |
11:49, 2 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
అక్కినేని నాగార్జున | |
---|---|
జననం | అక్కినేని నాగార్జున రావు 1959 ఆగస్టు 29 |
ఇతర పేర్లు | నాగ్, యువసామ్రాట్ King |
విద్యాసంస్థ | అన్నా విశ్వవిద్యాలయం |
వృత్తి | నటుడు, సినీ నిర్మాత, |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | లక్ష్మీ రామానాయుడు దగ్గుపాటి (1984–1990 divorced) అమల అక్కినేని (1992–present) |
పిల్లలు | అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ |
తల్లిదండ్రులు | అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ |
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటులు మరియు నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటులైన అక్కినేని నాగేశ్వర రావు యొక్క కుమారుడు.
వ్యక్తిగతం
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 [1] నాడు లక్ష్మితో [2] జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్‌కు సోదరి [3]. వీరిరువురు విడాకులు తీసుకున్నారు[4]. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) [1] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994)[1] రెండవ భార్య కొడుకు.
సినిమా జీవితము
నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.
పురస్కారములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
- జాతీయ చిత్ర పురస్కారాలు
- 1997 - నిన్నే పెళ్ళాడతా సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1998 - అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- నంది పురస్కారాలు
- నటుడిగా
- 2011 - రాజన్న సినిమాకి గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- 2006 - శ్రీరామదాసులో నంది ఉత్తమ నటుడు
- 2002 - సంతోషంలో నంది ఉత్తమ నటుడు[5]
- 1997 - అన్నమయ్యలో నంది ఉత్తమ నటుడు [5]
- నిర్మాతగా
- 1996 - నిన్నే పెళ్ళాడుతా కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం (అక్కినేని పురస్కారం)
- 1999 - ప్రేమకథ నంది మూడో అత్యుత్తమ చిత్రం
- 2000 - యువకుడు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం[6]
- 2002 - మన్మధుడు నంది ఉత్తమ చిత్రం
- 2011 - రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం [7]
- 1990 - శివ సినిమాలో ఉత్తమ నటుడు.
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఉత్తమ చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు.
- దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం
- సినీ'మా' పురస్కారాలు
- 2012 - రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు[9]
- 2013 - శిర్డీసాయి ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం [10]
- ఇతర పురస్కారాలు
- 1990 - శివ సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఆకృతి చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం
- 2000 - ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టు పురస్కారం
- 2011- టీ. సుబ్బరామిరెడ్డి కళారత్న పురస్కారం
- భరతముని పురస్కారాలప
- వంశీ బర్కిలీ పురస్కారాలు
- ఏపీ సినీ గోయర్స్ పురస్కారం
- 1989 - గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడు.
అవీ-ఇవీ
- ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు. భరణికి ఇతను మంచి మిత్రుదు.
నటించిన చిత్రాలు
సం. | సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | తోటి నటీనటులు | దర్శకులు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
1 | 2017 | ఓం నమో వేంకటేశాయ | హాథిరామ్ బాబా | అనుష్క, ప్రజ్ఞ జైస్వాల్,సాయి కుమార్,రావు రమేష్ | కె. రాఘవేంద్రరావు | |
2 | 2016 | ఊపిరి (సినిమా) | విక్రమాదిత్య | కార్తి, తమన్నా, ప్రకాష్ రాజ్, జయసుధ | వంశీ పైడిపల్లి | |
3 | 2016 | సోగ్గాడే చిన్ని నాయనా | బంగార్రాజు,రాము | లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ | కళ్యాణ్ కృష్ణ | |
4 | 2014 | మనం | నాగేశ్వరరావు | అక్కినేని, నాగ చైతన్య, సమంత, శ్రియా సరన్ | విక్రమ్ కె కుమార్ | |
5 | 2013 | భాయ్ | రిచా గంగోపాధ్యాయ | వీరభద్రం చౌదరి | ||
6 | 2013 | గ్రీకువీరుడు | చందు | నయనతార | దశరథ్ | |
7 | 2012 | ఢమరుకం | మల్లికార్జున | అనుష్క | శ్రీనివాసరెడ్డి | |
8 | 2011 | రాజన్న | రాజన్న | స్నేహ | విజయేంద్రప్రసాద్ | |
9 | 2011 | గగనం | రవి | పూనమ్‌కౌర్ | రాధామోహన్ | |
10 | 2010 | రగడ | సత్య | అనుష్క | వీరూపోట్ల | |
11 | 2010 | కేడి | రమేష్ అలియస్ రమ్మి | మమతా మోహన్ దాస్ | కిరణ్ | |
12 | 2008 | కింగ్ | కింగ్, బొట్టు శీను, శరత్ | త్రిష | శ్రీను వైట్ల | 3 పాత్రలలో వైవిధ్య నటనకు విమర్శకుల ప్రశంసలు. |
13 | 2008 | కృష్ణార్జున | కృష్ణ | మమతా మోహన్ దాస్ మంచు విష్ణు | పి. వాసు | |
14 | 2007 | డాన్ | సూరి | అనుష్క | రాఘవా లారెన్స్ | |
15 | 2006 | బాస్ | గోపాల కృష్ణ | నయనతార, శ్రియా సరన్ | వి.ఎన్. ఆదిత్య | |
16 | 2006 | శ్రీరామదాసు | గోపన్న /శ్రీ రామదాసు | స్నేహ | కె. రాఘవేంద్రరావు | విమర్శకుల ప్రశంసలు నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. |
17 | 2006 | స్టైల్ | మాస్ | రాఘవ లారెన్స్ | అతిథి పాత్రలో | |
18 | 2005 | సూపర్ | అఖిల్ | అనుష్క, అయేషా టాకియా | పూరి జగన్నాథ్ | ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటుడు బహుమతికి ఎంపిక |
19 | 2004 | మాస్ | గణేష్/మాస్ | జ్యోతిక | రాఘవ లారెన్స్ | |
20 | 2004 | నేనున్నాను | వేణు | శ్రియా, ఆర్తి అగర్వాల్ | విఎన్ ఆదిత్య | |
21 | 2003 | యల్ ఓ సి కార్గిల్ | మేజర్ పద్మపాణి ఆచార్య | జె.పి దత్తా | ||
22 | 2003 | శివమణి 9848022338 | శివమణి | ఆసిన్, రక్షిత | పూరి జగన్నాథ్ | |
23 | 2002 | మన్మధుడు (సినిమా) | అభిరామ్ | సొనాలిబింద్రే, అన్షు | కె. విజయభాస్కర్ | నంది పురస్కారాలు - ఉత్తమ నిర్మాత. |
24 | 2002 | సంతోషం) | కార్తీక్ | గ్రేసీ సింగ్, శ్రియా | దశరథ్ | నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. |
25 | 2001 | స్నేహమంటే ఇదేరా | అరవింద్ | భూమిక | బాలశేఖరన్ | |
26 | 2001 | ఆకాశ వీధిలో | చందు | రవీనాటాండన్ | సింగీతం శ్రీనివాసరావు | |
27 | 2001 | బావ నచ్చాడు | అజయ్ | సిమ్రాన్, రీమాసేన్ | కె.ఎస్. రవికుమార్ | |
28 | 2001 | ఎదురులేని మనిషి | సూర్యమూర్తి/సత్యమూర్తి | సౌందర్య, సేనాజ్ | జొన్నలగడ్డ శ్రీనివాసరావు | ద్విపాత్రాభినయం. |
29 | 2000 | ఆజాద్ | ఆజాద్ | సౌందర్య, శిల్పాశెట్టి | తిరుపతి స్వామి | |
30 | 2000 | నిన్నే ప్రేమిస్తా | శ్రీనివాస్ | సౌందర్య | ఆర్.ఆర్. షిండే | |
31 | 2000 | నువ్వు వస్తావని | చిన్ని | సిమ్రాన్ | వి.ఆర్.ప్రతాప్ | |
32 | 1999 | రావోయి చందమామ | శశి | అంజలా జవేరీ | జయంత్ సి.పరాన్జీ | |
33 | 1999 | సీతారామరాజు | రామరాజు | సంఘవి, సాక్షిశివానంద్ | వై.వి.ఎస్.చౌదరి | |
34 | 1998 | చంద్రలేఖ | సీతా రామారావు | రమ్యకృష్ణ, | కృష్ణవంశీ | |
35 | 1998 | ఆటో డ్రైవర్ | జగన్ | సిమ్రాన్, దీప్తి భట్నాగర్ | సురేష్ కృష్ణ | |
36 | 1998 | ఆవిడా మా ఆవిడే | విక్రాంత్ | టాబు, హీరా | ఇ.వి.వి. సత్యనారాయణ | |
37 | 1998 | అంగారే (హిందీ)[rowdy telugulo dubb ayyindhi] | రాజా | సొనాలిబింద్రే | మహేష్ భట్ | |
38 | 1997 | రచ్చగన్ తమిళం[rakshakudu telugulo dubb ayyindhi] | అజయ్ | సుస్మితాసేన్ | ప్రవీణ్ గాంధీ | |
39 | 1997 | అన్నమయ్య | అన్నమయ్య | రమ్యకృష్ణ, కస్తూరి (నటి) | కె. రాఘవేంద్రరావు | నంది పురస్కారాలు - ఉత్తమ నటుడు. |
40 | 1996 | నిన్నే పెళ్ళాడుతా (1996 సినిమా) | శీను | టాబు | కృష్ణవంశీ | |
41 | 1996 | రాముడొచ్చాడు | రామ్ | సౌందర్య, రవళి (నటి) | ఎ. కోదండరామిరెడ్డి | |
42 | 1996 | వజ్రం (సినిమా) | చక్రి | రోజా సెల్వమణి, ఇంద్రజ | ఎస్. వి. కృష్ణారెడ్డి | |
43 | 1995 | సిసింద్రీ (సినిమా) | రాజా | టాబు | శివనాగేశ్వరరావు | |
44 | 1995 | క్రిమినల్ (సినిమా) | అజయ్ | మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ | మహేష్ భట్ | |
45 | 1995 | ఘరానా బుల్లోడు | కళ్యాణ్ | రమ్యకృష్ణ | కె. రాఘవేంద్రరావు | |
46 | 1994 | హలో బ్రదర్ | దేవ/రవివర్మ | సౌందర్య, రమ్యకృష్ణ | ఇ.వి.వి. సత్యనారాయణ | ద్విపాత్రాభినయం |
47 | 1994 | గోవిందా గోవిందా | శ్రీను | శ్రీదేవి | రాంగోపాల్ వర్మ | |
48 | 1993 | అల్లరి అల్లుడు | కళ్యాణ్ | నగ్మా, మీనా | ఏ.కోదండరామిరెడ్డి | |
49 | 1993 | వారసుడు | వినయ్ | నగ్మా | ఇ.వి.వి. సత్యనారాయణ | |
50 | 1993 | రక్షణ | బోస్ | శోభన, రోజా | ఉప్పలపాటి నారాయణరావు | |
51 | 1992 | ప్రెసిడెంట్ గారి పెళ్ళాం | రాజా | మీనా | ఎ. కోదండరామిరెడ్డి | |
52 | 1992 | ద్రోహి | రాఘవ్/శేఖర్ | ఊర్మిళ (నటి) | రాంగోపాల్ వర్మ | |
53 | 1992 | అంతం (సినిమా) | రాఘవ్ | ఊర్మిళ (నటి) | రాంగోపాల్ వర్మ | |
54 | 1991 | ఖుదా గవా (హిందీ) | రాజా మిర్జా | శిల్పా శిరోద్కర్ | ముకుల్ ఎస్.ఆనంద్ | |
55 | 1991 | కిల్లర్ | ఈశ్వర్/కిల్లర్ | నగ్మా | ఫాజిల్ | |
56 | 1991 | జైత్రయాత్ర | తేజ | విజయశాంతి | ఉప్పలపాటి నారాయణరావు | |
57 | 1991 | శాంతి క్రాంతి | క్రాంతి | జూహిచావ్లా | వి. రవిచంద్రన్ | కన్నడ మూలం |
58 | 1991 | చైతన్య | చైతన్య | గౌతమి (నటి) | ప్రతాప్ వి. పోతన్ | |
59 | 1991 | నిర్ణయం (సినిమా) | వంశీకృష్ణ | అమల | ప్రియదర్శన్ | |
60 | 1990 | శివ (హిందీ) | శివ | అమల | రాంగోపాల్ వర్మ | |
61 | 1990 | ఇద్దరు ఇద్దరే | రమ్యకృష్ణ | ఎ. కోదండరామిరెడ్డి | ||
62 | 1990 | నేటి సిద్దార్థ | సిద్దార్థ | శోభన | క్రాంతికుమార్ | |
63 | 1990 | ప్రేమ యుద్దం | కళ్యాణ్ | అమల | రాజేంద్రసింగ్ | |
64 | 1989 | శివ (1989 సినిమా) | శివ | అమల | రాంగోపాల్ వర్మ | ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటుడు. |
65 | 1989 | అగ్ని (హిందీ) | పవన్ | శాంతిప్రియ | ఇఫ్తేఖర్ చౌదరి | |
66 | 1989 | గీతాంజలి | ప్రకాష్ | (( మణిరత్నం )) | ||
67 | 1989 | విక్కీ దాదా | విక్రం (విక్కీ) | |||
68 | 1989 | విజయ్ | విజయ్ | |||
69 | 1998 | జానకి రాముడు | రాము | |||
70 | 1998 | మురళీ కృష్ణుడు | మురళీ కృష్ణ | |||
71 | 1998 | చినబాబు | చినబాబు | |||
72 | 1998 | ఆఖరి పోరాటం | విహారి | |||
73 | 1987 | కిరాయిదాదా | విజయ్ | |||
74 | 1987 | అగ్నిపుత్రుడు | కాళిదాసు | |||
75 | 1987 | కలెక్టర్ గారి అబ్బాయి | రాజేష్ | |||
76 | 1987 | సంకీర్తన | కాళి | |||
77 | 1987 | మజ్ను | రాజేష్ | |||
78 | 1987 | అరణ్యకాండ | ||||
79 | 1986 | కెప్టెన్ నాగార్జున | నాగార్జున | |||
80 | 1986 | విక్రం | విక్రం |
అక్కినేని వంశ వృక్షం
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html
- ↑ http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store
- ↑ http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms
- ↑ http://www.totaltollywood.com/articles/nag2.html
- ↑ 5.0 5.1 "Many Happy Returns to Nag". IndiaGlitz. 29 August 2007. Retrieved 2 March 2010.
- ↑ "Nandi Awards -2000". 19 September 2002. Retrieved 18 November 2011.
- ↑ "2011 Nandi Awards winners list - The Times of India". The Times of India. Retrieved 2012-10-13.
- ↑ "SIIMA: Nagarjuna and others for Telugu nominations - South Cinema - Telugu News - ibnlive". Ibnlive.in.com. 2012-06-05. Retrieved 2012-10-24.
- ↑ 5.50 PM IST 06.18.2012 (2012-06-18). "Kamal Haasan graces CineMAA awards 2012 - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at". Bollywoodlife.com. Retrieved 2012-10-24.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Nitya, Nag bag awards on star-studded night | The Hindu
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- అక్కినేని కుటుంబం
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- నంది పురస్కారాలు
- 1959 జననాలు
- తెలుగు సినిమా నటులు
- నంది ఉత్తమ నటులు
- తెలుగు సినిమా నిర్మాతలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు కళాకారులు
- సుప్రసిద్ధ ఆంధ్రులు