జూనియర్ ఎన్.టి.ఆర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2001:424F:C4DD:9986:7E0A:4FBD (చర్చ) చేసిన మార్పులను Murali Krishna Nistala చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 2: పంక్తి 2:
| name =నందమూరి తారక రామారావు
| name =నందమూరి తారక రామారావు
| residence =[[హైదరాబాదు]],[[తెలంగాణ]]
| residence =[[హైదరాబాదు]],[[తెలంగాణ]]
| other_names =జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్,
| other_names =జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, జమాలత్ పాషా
| image =Jr-ntr-latest-photos.jpg‎
| image =Jr-ntr-latest-photos.jpg‎
| imagesize =200px
| imagesize =200px
పంక్తి 25: పంక్తి 25:
}}
}}


'''తారక్'' లేదా '''ఎన్.టి.ఆర్. (జూనియర్)'''గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినీమా [[నటుడు]] మరియు రాజకీయ నాయకుడు అయిన [[నందమూరి తారక రామారావు]] మనుమడు. ఇతడు [[మే 20]], [[1983]] న జన్మించాడు. ఇతని తండ్రి [[నందమూరి హరికృష్ణ]], తల్లి షాలిని.[[ఎన్.టి.ఆర్. (తారక్)|వ్యాసం]]
'''తారక్, జమాలత్ పాషా''' లేదా '''ఎన్.టి.ఆర్. (జూనియర్)'''గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినీమా [[నటుడు]] మరియు రాజకీయ నాయకుడు అయిన [[నందమూరి తారక రామారావు]] మనుమడు. ఇతడు [[మే 20]], [[1983]] న జన్మించాడు. ఇతని తండ్రి [[నందమూరి హరికృష్ణ]], తల్లి షాలిని.[[ఎన్.టి.ఆర్. (తారక్)|వ్యాసం]]


చిన్నతనములో [[కూచిపూడి నాట్యం]] నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు.
చిన్నతనములో [[కూచిపూడి నాట్యం]] నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు.

01:16, 29 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

మొదటి పేజీ

నందమూరి తారక రామారావు
దస్త్రం:Jr-ntr-latest-photos.jpg
2010 లో జూనియర్ ఎన్టీఆర్
జననంనందమూరి తారక రామారావు
(1983-05-20)1983 మే 20
India హైదరాబాదు, తెలంగాణ, ఇండియా
నివాస ప్రాంతంహైదరాబాదు,తెలంగాణ
ఇతర పేర్లుజూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, జమాలత్ పాషా
వృత్తిసినిమా నటుడు
తండ్రినందమూరి హరికృష్ణ
తల్లిషాలిని భాస్కర్ రావు

తారక్, జమాలత్ పాషా లేదా ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినీమా నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు మనుమడు. ఇతడు మే 20, 1983 న జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని.వ్యాసం

చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను "తారక్" లేదా "ఎన్.టి.ఆర్."గా పిలువబడాలని కోరుకుంటాడు. మనదేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.

చిత్ర రంగంలో

ఇతని తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పొందింది . ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు . ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు.

ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగా ఆడలేదు . బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి . రాఖీ చిత్రం ఒకమాదిరిగా ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది.


2007 లో గత చిత్రాలు "స్టూడెంట్ నెం.1", "సింహాద్రి"ల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి, లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు.

2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో నటించిన "కంత్రి" అనే చిత్రం పరాజయం పొందింది.

2010 లో "వి.వి.వినాయక్" దర్శకత్వంలో వచ్చిన "అదుర్స్" మంచి విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం "వంశీ పైడిపల్లి" దర్శకత్వంలో వచ్చిన "బృందావనం" ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని "దిల్ రాజు" నిర్మించాడు.

2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో "శక్తి" చిత్రం కూడా పాటల చిత్రీకరణ బాగున్నా, సినిమా ఘోరపరాజయం పాలయింది. 2011, అక్టోబరు 6న "సురేందర్ రెడ్డి" దర్శకత్వంలో విడుదలైన "ఊసరవెల్లి" మొదటిరోజు 18 కోట్లకు పైగా వసూలు చేసింది. తదుపరి "బోయపాటి శీను" దర్శకత్వంలో వచ్చిన "దమ్ము" చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచినా, ప్రేక్షకుల మరియు అభిమానులను మెప్పించలేకపోయింది . శ్రీనువైట్ల దర్శకత్వంలో "బాద్ షా" చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసుళ్ళు సాధించింది.తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా మరియు రభస అనే చిత్రాలు అభిమానుల మన్ననలు కూడా పొందలేకపోయాయి . 2015 తన పాత చిత్రం ఆంధ్రావాలా దర్శకుడు పురి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నటించి ఎన్నో ఏళ్ళుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు.ఈ చిత్రంలో అధ్బుత నటన కనబరచినందుకుగాను పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాక జెమిని ఛానెల్లో ఈ చిత్రం ప్రసారమై 26.5 టి.ఆర్.పితో అన్ని రికార్డులను చెరిపివేసింది.2015 ఐఐటీ మద్రాస్‌ టాక్‌ సెషన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూ.ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు,తారక రాముని తర్వాత మళ్లీ అంతటి దివ్యరూపం భాష యాస తనకే ఉన్నాయని కితాబిచ్చారు రాజమౌళి, తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక వ్యూస్ మరియు లైక్ లు (60,000) సాధించి రికార్డు సృస్టించింది .ఈ చిత్రంలో గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు,ఫోర్బ్స్ మోస్ట్ డిసైరబుల్ మెన్-2015లో రెండవ స్థానాన్ని సంపాదించాడు. 2016 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధిం చి,50 కోట్ల క్లబ్ లో చేరింది . కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు .2017 దసరాకి జై లవ కుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ మధ్య బుల్లితెరలో కూడా "బిగ్ బాస్"షో ద్వారా తను ఏంటో నిరూపించుకుంటున్నాడు.అదే మాదిరి గా 2010 లో వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు...

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్ర్రం దసరా కు రిలీజ్ కావడానికిి సిద్ధం అవుతోంది. దీని తరువాత ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం నకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సినీ జాబితా

సంవత్సరం చిత్రం పేరు పాత్ర బహుమతులు
2017 జై లవ కుశ 3 roles experimental movie
2016 జనతా గ్యారేజ్ ఆనంద్ Best Actor - IIFA 2017 South Awards...., King Of Box Office 2017 Zee Cinema Award
2016 నాన్నకు ప్రేమతో అభిరామ్
2015 టెంపర్ దయా సిని"మా" అవార్డులలోను తారక్‌కు "ఉత్తమ కథానాయకుడు" అవార్డు లభించింది , Kala sudha best actor award.... IIFA 2016 Best Actor nominee.....Film fare 2016 nominee
2014 రభస కార్తిక్
2013 రామయ్యా వస్తావయ్యా రాము
2013 బాద్‍షా ఎన్.టి.ఆర్ '
2012 దమ్ము రాజా వాసి రెడ్డి విజయ ధ్వజశ్రీ సింహ '
2011 ఊసరవెల్లి టోని '
2011 శక్తి శక్తి స్వరూప్, రుద్ర '
2010 బృందావనం కృష్ణ (క్రిష్) ఫిలింఫేర్ అవార్డులలో తారక్‌ "ఉత్తమ కథానాయకుడు" అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు
2010 అదుర్స్ నరసింహాచారి, నరసింహ ఫిలింఫేర్ అవార్డులలో తారక్‌ "ఉత్తమ కథానాయకుడు" అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు
2008 కంత్రి క్రాంతి ఫి లింఫేర్ అవార్డులలో తారక్‌ "ఉత్తమ కథానాయకుడు" అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు
2007 యమదొంగ రాజా సిని"మా" అవార్డులలోను, ఫిలిమ్ ఫేర్ అవార్డులలోను తారక్‌కు "ఉత్తమ కథానాయకుడు" అవార్డు లభించింది
2006 రాఖీ రామకృష్ణ / రాఖీ
2006 అశోక్ అశోక్
2005 నరసింహుడు (సినిమా) నరసింహుడు
2005 నా అల్లుడు (సినిమా) కార్తీక్, మురుగన్
2004 సాంబ (సినిమా) సాంబ శివనాయుడు
2004 ఆంధ్రావాలా (సినిమా) శంకర్ పహిల్వాన్, మున్న
2003 సింహాద్రి సింహాద్రి సిని"మా" అవార్డులలోను తారక్‌కు "ఉత్తమ కథానాయకుడు" అవార్డు లభించింది
2003 నాగ నాగ
2002 అల్లరి రాముడు (సినిమా) రామకృష్ణ
2001 ఆది ఆది కేశవ రెడ్డి నంది అవార్డులలో తారక్‌కు "నంది స్పెషల్ జ్యూరీ అవార్డు" లభించిందిఫి లింఫేర్ అవార్డులలో తారక్‌ "ఉత్తమ కథానాయకుడు" అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు
2001 సుబ్బు (సినిమా) బాలసుబ్రహ్మణ్యం
2001 స్టూడెంట్ నెం.1 ఆదిత్య
2001 నిన్ను చూడాలని (సినిమా) వేణు
1996 బాల రామాయణము రాముడు నంది అవార్డులలో తారక్‌కు "నంది స్పెషల్ జ్యూరీ అవార్డు" లభించింది
1991 బ్రహ్మర్షి విశ్వామిత్ర బాలనటుడు(భరతుడు)

మూలాలు

బయటి లింకులు