శ్రీరామోజు హరగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు వికీపీడియనులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు వికీపీడియనులు తొలగించబడింది; వర్గం:తెలుగు వికీపీడియా సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 61: పంక్తి 61:
[[వర్గం:1957 జననాలు]]
[[వర్గం:1957 జననాలు]]
[[వర్గం:నల్లగొండ జిల్లా కవులు]]
[[వర్గం:నల్లగొండ జిల్లా కవులు]]
[[వర్గం:తెలుగు వికీపీడియనులు]]
[[వర్గం:తెలుగు వికీపీడియా సభ్యులు]]

01:34, 22 అక్టోబరు 2018 నాటి కూర్పు

శ్రీరామోజు హరగోపాల్
శ్రీరామోజు హరగోపాల్
జననంహరగోపాల్
(1957-03-25) 1957 మార్చి 25 (వయసు 67)
ఆలేరు, నల్గొండ జిల్లా, తెలంగాణ భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్ , తెలంగాణ
వృత్తిఅధ్యాపకుడు
రచయిత, చరిత్ర పరిశోధకుడు
మతంమానవత్వం
భార్య / భర్తపద్మావతి
పిల్లలునీలిమ, సుధీర్ కుమార్, శ్రీహర్ష, శరత్ భాను
తండ్రివిశ్వనాధం
తల్లివరలక్ష్మి

శ్రీరామోజు హరగోపాల్ ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు మరియు చరిత్ర పరిశోధకుడు[1].[2]

జననం

శ్రీరామోజు హరగోపాల్ 1957, మార్చి 25నల్గొండ జిల్లా ఆలేరు గ్రామంలో వరలక్ష్మి, విశ్వనాధం దంపతులకు లో జన్మించాడు. ఎం.ఏ.తెలుగు, ఎం.ఇడి. చదివాడు. ఉన్నత పాఠశాలలో గజిటెడ్ హెడ్మాష్టరుగా పనిచేసి 2013లో పదవీవిరమణ చేసాడు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసాడు. అనేక సాహిత్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. అతను రాసిన కవిత్వాన్ని 1991లో మట్టిపొత్తిళ్ళు, 2006లో మూలకం కవితా సంపుటులుగా ప్రచురించాడు. 1987లో ఆలేరులో రచనసాహితీకళావేదిక అనే సాహిత్యసంస్థను స్థాపించి అనేక సాహిత్యకార్యక్రమాలను నిర్వహించాడు. అనేక పుస్తకాలను సంస్థ తరపున ప్రచురించాడు. నెలా నెలా రచన కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలపాటు నిర్వహించాడు. 1994లో బాలచంద్రిక అనే పిల్లలసంస్థను ఏర్పాటుచేసి ప్రతిసంవత్సరం పిల్లలకు సాహిత్య,సాంస్కృతిక,క్రీడా,బౌద్ధిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. పుస్తకసమీక్షలు, సాహిత్యవ్యాసాలు, గల్పికలు, నాటికలు, కథలు, పాటలు రాసాడు. అతని పాటల్ని గాలి అలలమీద నీ నవ్వులు అనే పాటల ఆల్బంగా తెచ్చాడు. ప్రస్తుతం చరిత్రమీద ఆసక్తితో తెలంగాణ చరిత్రను పరిశోధన చేస్తున్నాడు. అతనితో కలిసివచ్చిన మిత్రులు, మార్గదర్శకులతో కలసి కొత్త తెలంగాణ చరిత్ర బృందంగా ఏర్పడి ప్రస్తుతం తెలంగాణా అంతట పర్యటిస్తున్నాడు. ఆదిమానవ సంస్కృతి, నాగరికతలు, గ్రామాల చరిత్ర,శాసన పరిష్కరణ, స్థానిక చరిత్రల గురించి అన్వేషణ చేస్తున్నాడు. అతను రాసిన మొదటి కవిత దానిమ్మపూవు ఉజ్జీవనలో ప్రచురితం అయింది.

వ్యక్తిగత జీవితం

అతని భార్య పద్మావతి. వారికి నీలిమ, సుధీర్ కుమార్, శ్రీహర్ష, శరత్ భాను పిల్లలు ఉన్నారు.

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

  1. మట్టిపొత్తిళ్ళు (కవితాసంకలనం) 1991[3]
  2. మూలకం (కవితాసంకలనం) 2006
  3. రెండుదోసిళ్ళకాలం (కవితాసంకలనం) 2015 [4]

మూలాలు

  1. https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/new-big-stones-at-kanchanapally-1-2-518053.html
  2. http://www.andhrajyothy.com/artical?SID=119821&SupID=20
  3. http://www.navatelangana.com/article/state/147851
  4. నమస్తే తెలంగాణ, సండే న్యూస్,sun,April 17,2016. "కవి హరగోపాల్ - రెండు దోసిళ్ళ ప్రేమ".{{cite news}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)