ధర్మ దేవత (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
264 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
 
== కథా సారాంశం ==
వీరసేనుడు (లింగమూర్తి) ఉజ్జయిని రాజ్యాధినేత. అతని కూతురు స్వర్ణ(బేబి సరస్వతి) తల్లి లేని పిల్ల. ఆమెను అపురూపంగా పెంచుతుంటాడు వీరసేనుడు. చంపాదేవి (లక్ష్మీప్రభ) అనే వేశ్యతో కలిసి రాజమందిరంలో జీవిస్తూ ప్రజలను దయాదాక్షిణ్యాలు లేకుండా, హింసిస్తూ, పాలిస్తుంటాడు. రాజ్యానికి పొరుగునవున్న గ్రామంలో రఘునాథశర్మ (ముక్కామల), అక్క కాత్యాయిని (శాంతకుమారి), ఆమె కొడుకు గోపాల్ (కందామోహన్) నివసిస్తూ వుంటారు. బావ వైద్యంకోసం, ఉజ్జయినికి, మేనల్లుడుతో వచ్చిన రఘునాథ్, ఓ వీధి నర్తకి బిజిలి (లలిత) తల్లి, మహారాజు రథచక్రం కిందపడి మరణించగా, మహారాజును ఎదిరిస్తాడు. బాలుడు గోపాల్ విసిరిన రాయి, మహారాజుకు తగలటంతో మహారాజు బాలుని సింహాలకు వేయమని సర్వాధికారి (దొరస్వామి)కి ఆజ్ఞ ఇస్తాడు. రఘు, అతని బావల ప్రార్థన మహారాజు మన్నించడు. రఘునాథ్ మహారాజు సైన్యంతో పోరాడి మేనల్లుడు మరణించినందుకు ప్రతీకారంగా రాకుమార్తె స్వర్ణను అపహరించి, అక్కవద్దకు తెచ్చి బావ, మేనల్లుడుకోసం, ఈమెను హతమారుస్తానంటాడు. రాజభటులు వచ్చి, రఘుపై ఇంటివద్ద దాడి చేయగా, కాత్యాయిని పాపతో తప్పించుకునిపోయి రత్నగిరి అనే పల్లెలో తల దాచుకుంటుంది. సంజీవి తాత (బి.నరసింహారావు) వైద్యంతో గతం మరచిన పాపను తన పాపగా పెంచి పెద్ద చేస్తుంది. వాసంతి (గిరిజ)గా ఎదిగిన రాకుమారిని ఒకనాడు శూరసేనుడు(కౌశిక్) అనే యువకుడు రక్షిస్తాడు. వారిరువురూ ప్రేమించుకోవటం, ఉద్యోగంకోసం ఉజ్జయిని వెళ్ళిన శూరసేనుడు, వీరసేనుని సేనానిగా నియమించబడి, రఘునాథశర్మను పట్టుకోవాలన్న మహారాజు ఆదేశంపై, అతని రహస్య స్థావరాన్ని ముట్టడించి, రఘునాథ్‌ను బందీగాతెస్తాడు. రాకుమారి స్వర్ణ గురించి అడుగగా, తనకి తెలియదని చెప్పటంతో వీరసేనుడు అతన్ని చంపబోగా, కాత్యాయిని వచ్చి, వాసంతియే స్వర్ణ అని తెలియచేస్తుంది. ఆమె కుమారుడు గోపాల్‌ను తాను కాపాడి, కాశి నగరంలో పెంచి పెద్దచేశానని, అతడే శూరసేనుడు అని ఒక సైనికుడు మహారాజుకు అందరికి తెలియచేస్తాడు. వీరసేనుడు పశ్చాత్తాపంతో రఘునాథశర్మను క్షమించమని కోరి, శూరసేనుడు, వాసంతిల వివాహం జరిపి వారికి రాజ్యభారం అప్పగిస్తాడు<ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-14 ధర్మదేవత -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 07-07-2018]</ref>.
 
==విశేషాలు==
మొదట ఈ చిత్రానికి హీరోగా అక్కినేని నాగేశ్వరరావును నిర్ణయించి, కారణాంతరాల వలన ఆయన విరమించుకోవటం, అందుచేత నిర్మాతలు, నూతన నటుడు కౌశిక్‌ను హీరోగా నిర్ణయించారు. కౌశిక్ పొద్దుటూరు ప్రాంతానికి చెందినవాడు కావటం, తొలిసారే హీరోగా ఛాన్స్ పొందటం విశేషం. కె.వి.రెడ్డిగారి సూచనతో హీరోయిన్‌గా గిరిజను ఎన్నుకున్నారు.
77,804

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2477991" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ