"పువ్వుల సూరిబాబు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB)
1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని [[పెళ్ళి|వివాహం]] చేసుకొని ఆమె పేరుమీద [[రాజరాజేశ్వరి నాట్యమండలి]]ని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో "తారా శశాంకం" నాటకాన్ని వ్రాయించి తానే [[దర్శకత్వం]] వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక [[భూకైలాస్]], [[కురుక్షేత్రం]], [[విప్రనారాయణ]], [[తులాభారం]] మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు.
 
[[File:Veligimpuma naalo jyothi - jevanmukthi.ogg|thumb|జెమినీ వారి [[జీవన్ముక్తి]] సినిమాలో పి.సూరిబాబు పాడిన వెలిగింపుమా నాలో జ్యోతి పాట]]
వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో [[నారదుడు]], [[కంసుడు]], [[ధర్మరాజు]], [[విప్రనారాయణ]], బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2478461" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ