జగ్గయ్యపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 12: పంక్తి 12:
1818 లో జరిగిన తవ్వకాల్లో కొన్ని కట్టడాలు బయల్పడ్డాయి, అవి ఇక్కడ స్తూపాల సమూహం ఉందనటానికి ఋజువులు. మొత్తం తవ్వకం అయ్యాక 9 మీటర్ల వ్యాసం గల ఒక స్తూపం వెలుగులోకి వచ్చింది, అది తయారు చేయటానికి వాడిన పదార్థాలు, అలంకరణలు, అమరావతిలోవిలా ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కొండ వద్ద ఒక చైత్యానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ కొండని ధనంబొదు లేదా ధనం కొండ అంటారు. <br />
1818 లో జరిగిన తవ్వకాల్లో కొన్ని కట్టడాలు బయల్పడ్డాయి, అవి ఇక్కడ స్తూపాల సమూహం ఉందనటానికి ఋజువులు. మొత్తం తవ్వకం అయ్యాక 9 మీటర్ల వ్యాసం గల ఒక స్తూపం వెలుగులోకి వచ్చింది, అది తయారు చేయటానికి వాడిన పదార్థాలు, అలంకరణలు, అమరావతిలోవిలా ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కొండ వద్ద ఒక చైత్యానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ కొండని ధనంబొదు లేదా ధనం కొండ అంటారు. <br />
ఇక్కడ వెలికితీసిన విగ్రహాలు [[మద్రాస్ మ్యూజియం]]లో ఉన్నాయి. అందులో చాలా వరకూ తునకలైపోయి ఉన్నవే. అందులో ఒక విభిన్నమయిన బుద్ధుని విగ్రహం ఉంది. అది నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం. 6వ శతాబ్దం నాటి లిపి ఆ విగ్రహం కింద ఉన్న తామరపువ్వు పై చెక్కబడి ఉంది. మిగితా అన్ని అవశేషాలు ఇంకా పురాతనమయినవిగా ఆ ఒక్క విగ్రహం 200 క్రీపూ దిగా గుర్తించారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. ఆ విగ్రహం నాగార్జునాచార్యుని శిష్యుడయిన జయప్రభాచార్య ఆదేశాల మేరకు చెక్కబడిందిగా తెలుస్తోంది. <br />
ఇక్కడ వెలికితీసిన విగ్రహాలు [[మద్రాస్ మ్యూజియం]]లో ఉన్నాయి. అందులో చాలా వరకూ తునకలైపోయి ఉన్నవే. అందులో ఒక విభిన్నమయిన బుద్ధుని విగ్రహం ఉంది. అది నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం. 6వ శతాబ్దం నాటి లిపి ఆ విగ్రహం కింద ఉన్న తామరపువ్వు పై చెక్కబడి ఉంది. మిగితా అన్ని అవశేషాలు ఇంకా పురాతనమయినవిగా ఆ ఒక్క విగ్రహం 200 క్రీపూ దిగా గుర్తించారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. ఆ విగ్రహం నాగార్జునాచార్యుని శిష్యుడయిన జయప్రభాచార్య ఆదేశాల మేరకు చెక్కబడిందిగా తెలుస్తోంది. <br />
అన్నిటికంటే ముఖ్యమయిన విషయం ఇక్కడి ఒక పాలరాతి శిల. అందులో ఒక చక్రవర్తి, అతని చుట్టూ [[రాణి]], రాకుమారుడు, [[మంత్రి]], [[ఏనుగు]], [[గుర్రం]], [[చక్రం]] మరియు [[మాణిక్యాలు]] అతడ్ని రాజాధిరాజుగా చూపటం. ఆ చక్రవర్తిపై చతురస్రాకారంలోని నాణాలు ఆకాశం నుండి కనకవర్షంలా కురవటం, ఇంకా అన్ని విగ్రహాలకు అద్భుతమయిన నగలు ఉండటం, అప్పటి స్థపతి శిల్పకళకు దూరంగా ఉండటం విశేషాలు.ఇది కాక పుణ్యశాల అనే రెండంతస్తుల [[గుహాలయం]] ఇక్కడి విశేషాలు.jaggayya peta lo statue of liberty january 15,1999 lo nirminchabadindhi.
అన్నిటికంటే ముఖ్యమయిన విషయం ఇక్కడి ఒక పాలరాతి శిల. అందులో ఒక చక్రవర్తి, అతని చుట్టూ [[రాణి]], రాకుమారుడు, [[మంత్రి]], [[ఏనుగు]], [[గుర్రం]], [[చక్రం]] మరియు మాణిక్యాలు అతడ్ని రాజాధిరాజుగా చూపటం. ఆ చక్రవర్తిపై చతురస్రాకారంలోని నాణాలు ఆకాశం నుండి కనకవర్షంలా కురవటం, ఇంకా అన్ని విగ్రహాలకు అద్భుతమయిన నగలు ఉండటం, అప్పటి స్థపతి శిల్పకళకు దూరంగా ఉండటం విశేషాలు.ఇది కాక పుణ్యశాల అనే రెండంతస్తుల [[గుహాలయం]] ఇక్కడి విశేషాలు.jaggayya peta lo statue of liberty january 15,1999 lo nirminchabadindhi.


===వాడుకలోని మరికొన్ని కథలు===
===వాడుకలోని మరికొన్ని కథలు===

01:20, 10 డిసెంబరు 2018 నాటి కూర్పు

జగ్గయ్యపేట పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు జగ్గయ్యపేట (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

జగ్గయ్యపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 521 175., ఎస్.ట్.డి.కోడ్ = 08654.

గ్రామ చరిత్ర

జగ్గయ్యపేటకు తూర్పున ఉన్న శిథిలాలు, ఇక్కడ బౌద్ధ నివాసాలు ఉన్నట్టు తెలుపుతున్నాయి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల పురాతనమయినవని నమ్ముతున్నారు.

కట్టడాలు

జగ్గయ్యపేట స్తూపమ్లోని ఒక భాగం
జగ్గయ్యపేట వద్ద బౌద్ధ మహా స్తూపం
ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము
జగ్గయ్యపేట బౌద్ధ స్తూపం వద్ద బౌద్ధ విగ్రహ అవశేషం

1818 లో జరిగిన తవ్వకాల్లో కొన్ని కట్టడాలు బయల్పడ్డాయి, అవి ఇక్కడ స్తూపాల సమూహం ఉందనటానికి ఋజువులు. మొత్తం తవ్వకం అయ్యాక 9 మీటర్ల వ్యాసం గల ఒక స్తూపం వెలుగులోకి వచ్చింది, అది తయారు చేయటానికి వాడిన పదార్థాలు, అలంకరణలు, అమరావతిలోవిలా ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కొండ వద్ద ఒక చైత్యానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ కొండని ధనంబొదు లేదా ధనం కొండ అంటారు.
ఇక్కడ వెలికితీసిన విగ్రహాలు మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి. అందులో చాలా వరకూ తునకలైపోయి ఉన్నవే. అందులో ఒక విభిన్నమయిన బుద్ధుని విగ్రహం ఉంది. అది నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం. 6వ శతాబ్దం నాటి లిపి ఆ విగ్రహం కింద ఉన్న తామరపువ్వు పై చెక్కబడి ఉంది. మిగితా అన్ని అవశేషాలు ఇంకా పురాతనమయినవిగా ఆ ఒక్క విగ్రహం 200 క్రీపూ దిగా గుర్తించారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. ఆ విగ్రహం నాగార్జునాచార్యుని శిష్యుడయిన జయప్రభాచార్య ఆదేశాల మేరకు చెక్కబడిందిగా తెలుస్తోంది.
అన్నిటికంటే ముఖ్యమయిన విషయం ఇక్కడి ఒక పాలరాతి శిల. అందులో ఒక చక్రవర్తి, అతని చుట్టూ రాణి, రాకుమారుడు, మంత్రి, ఏనుగు, గుర్రం, చక్రం మరియు మాణిక్యాలు అతడ్ని రాజాధిరాజుగా చూపటం. ఆ చక్రవర్తిపై చతురస్రాకారంలోని నాణాలు ఆకాశం నుండి కనకవర్షంలా కురవటం, ఇంకా అన్ని విగ్రహాలకు అద్భుతమయిన నగలు ఉండటం, అప్పటి స్థపతి శిల్పకళకు దూరంగా ఉండటం విశేషాలు.ఇది కాక పుణ్యశాల అనే రెండంతస్తుల గుహాలయం ఇక్కడి విశేషాలు.jaggayya peta lo statue of liberty january 15,1999 lo nirminchabadindhi.

వాడుకలోని మరికొన్ని కథలు

నందిగామ-జగ్గయ్యపేట మధ్య ఉన్న కొంగర మల్లయ్య గట్టు గురించి ఒక కథ చెపుతారు. కొంగర మల్లయ్య ఒక గజదొంగ అని, దారేపోయే వాళ్ళని గట్టిగా అరచి భయపెట్టి "మీ దగ్గర ఉన్న మూటా, ముల్లె అక్కడపెట్టి పారిపొమ్మని" అరచేవాడట. బాటసారులు భయపడి వారి నగానట్రా వదలి పారిపోయేవారుట. చాలా కాలానికి ఎవరో ధైర్యవంతుడు వలన ఆ మల్లయ్య కాళ్ళు లేని వాడని తెలిసిందిట.

గ్రామం పేరు వెనుక చరిత్ర

దీని పూర్వనామము బేతవోలు. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. ఈయన గొప్ప శివ భక్తుడు. నేటికి దాదాపు 180 ఏళ్ళ క్రితం, ఈ ప్రదేశాన్ని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలించేవాడు. అతడు పరమభక్తుడు, ఆ భక్తితోనే ఎన్నో శివాలయాలు, విష్ణ్వాలయాలు కట్టించాడు. అతడి తండ్రి పేరు జగ్గయ్య మీద జగ్గయ్యపేటనూ, తల్లి అచ్చమ్మ పేరు మీద అచ్చంపేటనూ స్థాపించాడని ప్రతీతి. ఆ కాలపు కవులు ఈ విషయాన్ని తమ కవిత్వం ద్వారా తెలిపారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం వాసిరెడ్డికి ముందే ఈ ప్రదేశం జనావాసంగా ఉందనీ, బేతవోలు అనే పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని వాసిరెడ్డి అభివృద్ధి పరచి జగ్గయ్యపేట అనే పట్టణంగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. రాజుకి ముందు ఈ గ్రామములో దొంగలుండేవారనీ, అందువలన ఈ ఊరి పేరు దొంగల బేతవోలుగా పరిగణించబడేదనీ తెలుస్తూంది. కొంత కాలం పాటూ ప్రభుత్వ రికార్డుల్లోనూ కొందరి దస్తావేజుల్లోనూ బేతవోలనే పేరుతోనే వ్యవహరించబడింది.

గ్రామ భౌగోళికం

  1. హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారి మీద జగ్గయ్యపేట ఉంది.
  2. ఈ పట్టణం మచిలీపట్నం నుండి 134.2 కిమీ మరియు రాష్ట్ర రాజధాని అమరావతి నుండి సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది.
  3. జగ్గయ్యపేట పట్టణం పాలేటి నది ఒడ్డున ఉంది.

సమీప గ్రామాలు

[1] అనుమంచిపల్లి 4 కి.మీ, జయంతిపురం 6 కి.మీ, దెచ్చుపాలెం 7 కి.మీ, మంగోలు 7 కి.ఈ, బలుసుపాడు 8 కి.మీ

సమీప మండలాలు

[1] పెనుగంచిప్రోలు, వత్సవాయి,కోదాడ, బోనకల్లు.

జగ్గయ్యపేట పట్టణానికి రవాణా సౌకర్యం

జగ్గయ్యపేటలోని లోని విద్యా సౌకర్యాలు

కళాశాలలు

శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్.జి.ఎస్) కళాశాల

ఈ కళాశాల 49వ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-18న నిర్వహించెదరు. [3]

ఈ కళాశాలలో యు.జి.సి నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని, 2017,జులై-6న ప్రారంభించారు. దీనివలన ఈ కళాశాల విద్యార్థినులకు వసతి, భోజన సదుపాయలు ఉచితంగా అంగదలవు. [7]

ఈ కళాశాల ప్రక్కనే రూపొందించిన విశ్వేశ్వరయ్య బొటానికల్ పార్క్ ను, 2017,జులై-11న ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అరుదైన మొక్కలను పెంచేందుకు ఇది దోహదపడుతుంది. [8]

విశ్వభారతి జూనియర్ కళాశాల

ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల

వాగ్దేవి మహిళా జూనియర్ & డిగ్రీ కళాశాలలు

మండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (M.I.E.T)

పాఠశాలలు

  1. శ్రీ గెంటేల వెంకటజోగయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- స్థానిక 20వ వార్డులో ఉన్న ఈ పాఠశాలలో త్వరలో శత సంవత్సర వేడుకలను నిర్వహించెదరు.
  2. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, 1వ వార్డు, జగ్గయ్యపేట
  3. జెడ్పీహెచ్ స్కూల్, 15వ వార్డు, జగ్గయ్యపేట
  4. శ్రీమతి సేతు రామమ్మాళ్ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  5. నారాయణ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  6. కృష్ణవేణీ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  7. విజ్ఞాన్ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  8. రవీంద్రభారతి పాఠశాల, జగ్గయ్యపేట
  9. ఎస్జీ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  10. లిటిల్ ఏంజెల్స్ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  11. ఎస్వీఎస్ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  12. సి.హెచ్.ఆర్ ప్రాథమికోన్నత పాఠశాల, జగ్గయ్యపేట
  13. జెడ్పీహెచ్చెస్, మల్కాపురం
  14. జెడ్పీహెచ్చెస్, పోచంపల్లి
  15. జెడ్పీహెచ్చెస్, బలుసుపాడు
  16. జెడ్పీహెచ్చెస్, షేర్ మొహమ్మద్ పేట
  17. చేగు విద్యాలయం.

జగ్గయ్యపేట పట్టణంలోని మౌలిక సదుపాయాలు

ఉసిరికల హైమావతి, సన్యాసిరాజు వృద్ధవిరామ కేంద్రం, కాకానినగర్.

బ్యాంకులు

సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఫోన్ నం. 08654/222369. సెల్=8886644138.

జగ్గయ్యపేటకు సాగు/త్రాగునీటి సౌకర్యం

ఊరచెరువు:- సుమారు 100 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు సుందరీకరణకొరకు, పర్యావరణశాఖ ద్వారా మూడున్నర కోట్ల రూపాయలతో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకున్నది.

పరిపాలన

జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గం

జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గంలో 74 గ్రామాలు, 1లక్షా 59 వేల డెబ్భై వోటర్లున్నారు.
ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు:
1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ శాసనసభ
1962 - గాలేటి వేంకటేశ్వర్లు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1967 - రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠి, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1972 - వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్, ఇండిపెండెంట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1978 - బొద్దులూరు రామారావు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1983 - అక్కినేని లోకేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1985, 1989 and 1994 - నెట్టెం రఘురాం, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1999 and 2004 - సామినేని ఉదయభాను, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
2009 (ప్రస్తుత) - శ్రీరాం రాజ గోపాల్, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.

జగ్గయ్యపేటలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

జగ్గయ్యపేటలో పర్యాటకులను ఆకర్షించే ఎన్నో దేవాలయాలు, ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయి.

  1. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం జగ్గయ్యపేట పట్టణంలోని బంగారు కొట్ల కూడలి (Centre)లో ఉంది.
  2. శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం (పెద్ద శివాలయం).
  3. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయం, దుర్గాపురం.
  4. శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానము, జగ్గయ్యపేట:- ఈ దేవాలయానికి అనుమంచిపల్లి గ్రామంలో 5.55 ఎకరాల (మెట్టభూమి) మాన్యంభూమి ఉంది. [1]
  5. శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
  6. శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం:- జగ్గయ్యపేట పట్టణంలోని విజయవాడ రహదారిపై ఉన్న ఈ అలయంలో, స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహంత్సవాలు 2017,మార్చి-3వతేదీ శుక్రవారం నుండి 9వతేదీ గురువారం వరకు వైభవంగా నిర్వహించారు. 7వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం రుక్మిణీ సత్యభామా సమేత స్వామివారికి గరుడసేవ, తిరువీధి ఉత్సవం జరిగింది. 8వతేదీ బుధవారం పుష్కరిణి వద్ద, అభిషేకం, చక్రతీర్ధ ఉత్సవం, మంగళా శాసనం నిర్వహించారు 9వతేదీ గురువారంనాడు స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో పవళింపుసేవ ఏర్పాటుచేసారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 9 రకాల ప్రసాదాలను నివేదించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నప్రసాద సమర్పణ ఘనంగా సాగినది. ఈ ఆలయంలో 2017,ఆగస్టు-25న అన్నదాన సత్రాన్ని, ప్రారంభించారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహించెదరు. [4]&[9]
  7. శ్రీ మహాలక్ష్మి వెండి దేవాలయం:- ఈ ఆలయంలో 2017,మార్చి-12వతేదీ ఆదివారం ఫాల్గుణ పౌర్ణమి (హోలీ పండుగ రోజు) న లక్ష్మీ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు, పుష్పయాగం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. [5]
  8. శ్రీ గాయత్రిమాత ఆలయం:- ఈ ఆలయం స్థానిక అయ్యప్పనగర్ లో ఉంది.
  9. శ్రీ ముక్తాలమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక మార్కండేయస్వామి వీధిలో నెలకొన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా ఒక ఆదివారంనాడు బోనాల పండుగను వైభవంగా నిర్వహించెదరు. [2]
  10. శ్రీ నాగసత్యమ్మ అమ్మవారి ఆలయం:- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ శివార్లలలో నెలకొన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా, ఒక ఆదివారంనాడు బోనాల పండుగను వైభవంగా నిర్వహించెదరు. [2]
  11. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.
  12. బుద్ధ విహార్:- జగ్గయ్యపేట పట్టణంలో 100 ఎకరాలలో విస్తరించియున్న చెరువు చుట్టూ రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక రహదారి, మధ్యలో బుద్ధుని విగ్రహం, చెరుచు అంచులచుట్టూ హరితహారం వంటి అనేక హంగులతో ఇది రూపుదిద్దుకుంటున్నది. పట్టణవాసులు సాయంత్రం సమయంలో అక్కడకు వెళ్ళి సేదతీరవచ్చు. [6]

సమీపంలోని ప్రముఖ దేవాలయాలు

  1. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, వేదాద్రి.
  2. శ్రీ భవాని ముక్తేశ్వరస్వామి దేవస్థానం, ముక్త్యాల.
  3. శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం, ముక్త్యాల.
  4. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమలగిరి.
  5. శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం, పెనుగంచిప్రోలు.
  6. గరుడాచలం, నరసింహస్వామి.

ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు

జగ్గయ్యపేట విశేషాలు

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం పూర్తి జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24, 341. 30 గ్రామాలు 18 పంచాయితీలు కలిసినది ఈ మండలం. జగ్గయ్యపేట ఈ మండలంలోని ముఖ్య పట్టణం. ఈ పట్టణం జానాభా 40,373; స్త్రీ-పురుష నిష్పత్తి 49:51 శాతంగా ఉంది. అక్షరాస్యత 67%. పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీల అక్షరాస్యత 60%. 11 శాతం జనాభా 6 సంవత్సరాల లోపు పిల్లలు.

వనరులు

  1. 1.0 1.1 "http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Jaggayyapeta". Retrieved 10 June 2016. {{cite web}}: External link in |ref= and |title= (help)

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2015,ఆగస్టు-17; 3వపేజీ. [3] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఫిబ్రవరి-17; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,మార్చి-10; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2017,మార్చి-13; 13వపేజీ. [6] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జూన్-2; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-8; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-12; 2వపేజీ. [9] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఆగస్టు-27; 2వపేజీ.