నువ్వు నాకు నచ్చావ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎పాటలు: వివరం కొంచెం
ట్యాగు: 2017 source edit
పంక్తి 46: పంక్తి 46:


==పాటలు==
==పాటలు==
ఈ సినిమా ఆడియో విడుదల అయిన కొద్ది రోజులకే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సాధించింది. ''నా చూపే నను వెతికినది'' అనే పాటను [[న్యూజీలాండ్]] లో చిత్రీకరించారు.<ref>{{Cite web|url=https://archive.org/stream/HasamTelugu/Hasam_2001_10_16_068%20P#page/n13/mode/2up|title=ఇష్టపది|publisher=హాసం ప్రచురణలు}}</ref>

#ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ రచన: సిరివెన్నెల
#ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ రచన: సిరివెన్నెల
#ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా - గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: భువనచంద్ర
#ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా - గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: భువనచంద్ర

13:24, 10 డిసెంబరు 2018 నాటి కూర్పు

నువ్వు నాకు నచ్చావ్
(2001 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ భాస్కర్
నిర్మాణం డి.సురేష్ బాబు
రచన త్రివిక్రమ్ శ్రీనివాస్
తారాగణం వెంకటేష్
ఆర్తీ అగర్వాల్
ప్రకాష్ రాజ్
చంద్ర మోహన్
సుధ
ఎమ్మెస్ నారాయణ
సునీల్ (నటుడు)
తనికెళ్ళ భరణి
సిజ్జు
ఆశా సైని
పృథ్వీ రాజ్
కన్నెగంటి బ్రహ్మానందం
సంగీతం కోటి
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ నాయకా నాయికలుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. కోటి స్వరాలు సమకూర్చాడు.

కథ

వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) అనకాపల్లి నుంచి హైదరాబాద్ లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి (ప్రకాష్ రాజ్) ఇంటికి వస్తాడు. సంధర్బం మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.

అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.

తారాగణం

హాస్య సన్నివేశాలు

  • ఏదైనా ఉద్యోగం చూడమని మూర్తి యింటికి వచ్చిన వెంకటేష్ రొజూ సెకండ్ షో సినిమాకి వెళ్ళివస్తుంటాడు. బ్రతకడానికి ఏమివచ్చునంటే సంగీతం, బొమ్మలేయడం, ఈత మొదలైనవి చెబుతాడు.
  • ఆరతియింట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు అమ్మ జ్ఞాపకం వచ్చి తాను రాసిన కవిత చదివే సన్నివేశం.

పాటలు

ఈ సినిమా ఆడియో విడుదల అయిన కొద్ది రోజులకే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సాధించింది. నా చూపే నను వెతికినది అనే పాటను న్యూజీలాండ్ లో చిత్రీకరించారు.[1]

  1. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ రచన: సిరివెన్నెల
  2. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా - గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: భువనచంద్ర
  3. ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు - గాయకులు : టిప్పు, హరిణి రచన: సిరివెన్నెల
  4. నా చెలియ పాదాలు... హంసలకే పాఠాలు - గాయకుడు:శంకర్ మహదేవన్ రచన: సిరివెన్నెల
  5. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని - గాయకులు: కుమార్‌సాను, చిత్ర రచన: సిరివెన్నెల
  6. నా చూపె నిను వెతికినది ని వైపె నను తడిమినది - గాయకులు: చిత్ర, శ్రీరాం ప్రభు రచన:సిరివెన్నెల

మూలాలు

  1. "ఇష్టపది". హాసం ప్రచురణలు.