"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎తిరుగుబాటు తదనంతర పరిణామాలు: ++బీహార్, ఇండోర్ విభాగాలు
(→‎కాన్పూరు: ++లక్నో, ఝాన్సీ విభాగాలు)
(→‎తిరుగుబాటు తదనంతర పరిణామాలు: ++బీహార్, ఇండోర్ విభాగాలు)
 
=== లక్నో ===
[[File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|ఎడమ|thumb|Theరెండవ interiorలక్నో ofవిముక్తి theయుద్ధంలో Secundraదెబ్బతిన్న Bagh,సికంద్రా several months after its storming during the second relief of Lucknow. Albumen silver print by [./https://en.wikipedia.org/wiki/Felice_Beato Felice Beato], 1858బాగ్]]
మీరట్ సంఘటనల తర్వాత వెంటనే అవధ్ (ఔధ్) లో తిరుగుబాటు తలెత్తింది. బ్రిటిషు వారు దాన్ని ఆక్రమించుకుని అప్పటికి ఒక్క సంవత్సరమే అయింది. తిరుగుబాటుదార్లు రెసిడెన్సీ ఆవరణను ముట్టడించారు. లోపల సిపాయీలతో కలిపి మొత్తం 1700 మంది ఉన్నారు. తిరుగుబాటుదార్లు శతఘ్ని దాడులు, తుపాకి కాల్పులు జరిపారు. బ్రిటిషు కమిషానరు సర్ హెన్రీ లారెన్స్ మొదటగా మరణించిన వారిలో ఉన్నాడు. బాంబులతో గోడలను పేల్చి, సొరంగం తవ్వీ లోపలికి వెళ్ళేందుకు తిరుగుబాటుదార్లు ప్రయత్నించారు.<ref name="HCRE2">{{cite book|last=Porter|first=Maj Gen Whitworth|title=History of the Corps of Royal Engineers Vol I|year=1889|publisher=The Institution of Royal Engineers|location=Chatham}}</ref>{{rp|486}} 90 రోజుల ముట్టడి తరువాత, రెసిడెన్సీ లోపల 300 మంది సిపాయీలు, 350 మంది బ్రిటిషు సైనికులు, 550 మంది అసైనికులూ మిగిలారు.
 
ముట్టడిలో ఉన్న బ్రిటిషు వారికి సహాయకంగా ఉండేందుకు సెప్టెంబరు 25 న సర్ హెన్రీ హావెలాక్ నాయకత్వాన ఒక సైనిక దళం కాన్పూరు నుండి లక్నోకు బయలుదేరింది. దారి పొడుగునా వాళ్ళు అనేక మంది తిరుగుబాటుదార్లను ఎదుర్కొని పోరాడుతూ కాన్పూరు చేరుకున్నారు. ఈ చిన్న దళానికి తిరుగుబాటుదార్లను ఎదుర్కొనే శక్తి లేకపోవడం చేత వాళ్ళు కోట లోని ద్ళంతో చేరిపోయారు. అక్టోబరులో మరొక పెద్ద సైన్యం సర్ కోలిన్ క్యాంప్‌బెల్ నాయకత్వాన వచ్చి ముట్టడిని ఎదుర్కొని తిరుగుబాటుదార్లను ఓడించింది. ఆ తరువాత రెసిడెన్సీని ఖాళీ చేయించి బ్రిటిషు వారందరినీ ముందు ఆలంబాగ్‌కు, ఆ తరువాత కాన్పూరుకూ తరలించారు. ఈ క్రమంలో ఆలంబాగ్‌లో కోట కట్టించేందుకు కొంత సైన్యాన్ని ఉంచారు.
 
అవధ్‌లో తిరుగుబాటును అణచేందుకు 1858 మార్చిలో క్యాంప్‌బెల్ మళ్ళీ భారీ సైన్యంతో లక్నో బయలుదేరాడు. ఆలంబాగ్‌లో ఉంచిన సైన్యాన్ని కలుపుకున్నాడు. అతడికి సహయంగా జంగ్ బహదూర్ రాణా నేతృత్వంలో పెద్ద నేపాలీ దళం కూడా ఒకటుంది.<ref>{{Harvnb|Hibbert|1980|pp=358, 428}}</ref> మార్చి 21 న జరిగిన చివరి యుద్ధంతో క్యాంప్‌బెల్ తిరుగుబాటుదార్లను పారదోలాడు.<ref name="HCRE2" />{{rp|491}} దీన్ని రెండవ
 
=== ఝాన్సీ ===
 
ఝాన్సీ, కల్పీ ల నుండి పారిపోయిన లక్ష్మీబాయి, కొందరు మరాఠా వీరులూ కలిసి, సిందియాలను ఓడించి గ్వాలియరును స్వాధీనం చేసుకున్నారు. సింధియాలు బ్రిటిషు వారికి సన్నిహితులు. ఇది తిరుగుబాటును ప్రజ్వలింపజేసేదేమో గానీ, సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని సైన్యం గ్వాలియరుపై దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో రెండవ రోజున, జూన్ 17 న, రాణి లక్ష్మీబాయి మారణించింది. తరువాతి మూడు రోజుల్లో కంపెనీ సిన్యం గ్వాలియరును తిరిగి వశపరచుకుంది. ఈ చివరి యుద్ధంలో ఆమె వర్ణనను గమనించిన కొందరు వ్యాఖ్యాతలు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్‌తో పోల్చారు.<ref>Lachmi Bai Rani of Jhansi, the Jeanne d'Arc of India (1901), White, Michael (Michael Alfred Edwin), 1866, New York: J.F. Taylor & Company, 1901.</ref>
 
==== ఇండోర్ ====
ఇండోర్‌లో ఉన్న నాటి కంపెనీ రెసిడెంటు కల్నల్ హెన్రో మార్లన్ డ్యురండ్ ఇండోర్లో తిరుగుబాటు వస్తుందనడాన్ని కొట్టిపారేసాడు.<ref>{{cite web|url=http://www.hyperhistory.com/online_n2/people_n2/women_n2/holkar1.html|title=Biographies|publisher=}}</ref> అయితే, జూలై 1 న హోల్కారు సైన్యంలోని సిపాయీలు తిరుగుబాటు చేసి, బ్రిటిషు ఆఫీసర్లతో కూడిన భోపాల్ దళంపై కాల్పులు జరిపారు. వాళ్ళను ఎదుర్కొనేందుకు కల్నల్ ట్రావెర్స్ ముందుకు పోగా, అతన్ని అనుసరించేందుకు భోపాల్ పదాఅతి దళం తిరస్కరించింది. భోపాల్ శతఘ్ని దళం కూడా తిరస్కరించి, తమ తుపాకులను యూరపియన్ల మీద ఎక్కుపెట్టింది. ఇక చేసేదేమీ లేక, డ్యురండ్ యూరపియన్లందరినీ సమీకరించి, తప్పించుకున్నాడు. ఈలోగా 39 మంది యూరపియన్లను చంపేసారు.<ref>{{Citation|url=https://books.google.com/?id=AIABAAAAQAAJ&pg=PA346&lpg=PA346#PPA333,M1|title=A history of the Sepoy war in India, 1857–1858 – John William Kaye (sir.) – Google Books|date=1876|accessdate=17 September 2012|last1=Kaye|first1=Sir John William}}</ref>
 
=== బీహార్ ===
బీహారులో తిరుగుబాటు ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతం లోనే ఎక్కువగా జరిగింది. అయితే, గయ జిలాలో కూడా దోపిడీలు, దౌర్జన్యాలూ జరిగాయి.<ref name="Singh1966">{{cite journal|title=Gaya in 1857-58|author=S. B. Singh|journal=Proceedings of the Indian History Congress|volume=28|year=1966|pages=379–387|jstor=44140459}}</ref> తిరుగుబాట్లలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు జగదీష్‌పూర్ జమీందారు, 80ఏళ్ళ కన్వర్ సింగ్. అతడి జమీని బ్రిటిషు వారు జప్తు చేసే పనిలో ఉన్నారు. అతడు తిరుగబాటును ఎగదోసి, దానికి నాయకత్వం వహించాడు.<ref>{{Citation|url=https://books.google.com/?id=hcVGAAAAIAAJ&pg=PA76#PPA76,M1|title=The revolt in Hindustan 1857–59 – Evelyn Wood, Sir Evelyn i. e. Henry Evelyn Wood – Google Boeken|date=1908|accessdate=17 September 2012|last1=Wood|first1=Sir Evelyn}}</ref> అతడి తమ్ముడు, అతడి సేనాధ్యక్షుడూ ఇందుకు సహకరించారు.<ref>{{cite journal|title=Kunwar Singh's Failure in 1857|author=S. Purushottam Kumar|journal=Proceedings of the Indian History Congress|volume=44|year=1983|pages=360–369|jstor=44139859}}</ref>
 
జూలై 25 న దీనాపూర్ సైనిక స్థావరంలో తిరుగుబాటు రాజుకుంది. తిరుగుబాటుదార్లు అర్రా నగరం వైపు సాగిపోయారు. అక్కడ వారితో కన్వర్ సింగ్, అతడి సైన్యం కలిసింది.<ref name="Boyle1858">{{cite book|last1=Boyle|first1=Robert Vicars|title=Indian Mutiny. Brief Narrative of the Defence of the Arrah Garrison.|date=1858|publisher=W. Thacker & Co.|location=London}}</ref> బోయిల్ అనే బ్రిటిషు రైల్వే ఇంజనీరు అలాంటి దాడుల నుండి రక్షణగా ఉండేందుకు ముందుచూపుతో తన నివాసంలో ఒక భవంతిని నిర్మించుకుని ఉన్నాడు.<ref>''John Sergeant's Tracks of Empire'', BBC4 programme.</ref> తిరుగుబాటుదార్లు అర్రాకు చేరుకునేటప్పటికి యూరపియన్లందరూ బోయిల్ ఇంటిలో తలదాచుకున్నారు.<ref name="Halls1860">{{cite book|last1=Halls|first1=John James|title=Two months in Arrah in 1857|date=1860|publisher=Longman, Green, Longman and Roberts|location=London}}</ref> తిరుగుబాటుదార్లు ఆ ఇంటిని ముట్టడించారు. రెండు మూడు వేల మంది తిరుగుబాటుదార్లు జరిపే ముట్టడి ఎదుర్కునేందుకు వారివద్ద 50 మంది విధేయ సిపాయీలు ఉన్నారు.<ref name="Gazette22050">{{cite news|title=Supplement to The London Gazette, October 13, 1857|url=https://www.thegazette.co.uk/London/issue/22050/page/3422|accessdate=18 July 2016|issue=22050|pages=3418–3422|date=13 October 1857}}</ref>
 
వీళ్ళను రక్షించేందుకు దీనాపూర్ నుండి 400 మందిని అర్రాకు పంపించారు. ఈ దళాన్ని దారిలోనే తిరుగుబాటుదార్లు అడ్డుకుని వెనక్కు పారదోలారు. బక్సార్ వైపు నదిలో ప్రయాణం చేస్తున్న బ్రిటిషు దళం ఒకటి బక్సార్ చేరుకోగానే అర్రా ముట్టడి వార్త తెలిసింది. ఆ దళ నాయకుడు మేజర్ విన్సెంట్ ఐర్ వెంటనే దళాన్ని ఆయుధాలనూ పడవల్లోంచి దింపి అర్రా వైపు సాగిపోయాడు. అటు వెళ్ళవద్దని అతడికి ఆదేశాలు వచ్చినప్పటికీ అతడు పట్టించుకోలేదు.<ref name="Sieveking1910">{{cite book|last1=Sieveking|first1=Isabel Giberne|title=A turning point in the Indian mutiny|date=1910|publisher=David Nutt|location=London}}</ref> ఆగస్టు 2 న అర్రాకు 9.7 కి.మీ. దూరాన ఉండగా తిరుగుబాటుదార్లు వాళ్ళపై మెరుపుదాడి చేసారు. అప్పుడూ జరిగిన పోరులో బ్రిటిషు దళం గెలిచింది.<ref name="Gazette22050" /> ఆగస్టు 3 న మేజర్ ఐర్ తన దళంతో సహా ముట్టడి ఇంటిని చేరుకుని ముట్టడిని తొలగించాడు.<ref>{{Citation|url=https://books.google.com/?id=pryl7f3SZ14C&printsec=frontcover#PPA181,M1|title=The Sepoy Revolt. A Critical Narrative – Google Books|date=|isbn=9781402173066|accessdate=17 September 2012}}</ref><ref>{{Citation|url=https://books.google.com/?id=Ty8OAAAAQAAJ&pg=PA449#PPA450,M1|title=John Cassell's Illustrated history of England – William Howitt, John Cassell – Google Boeken|date=1864|accessdate=17 September 2012|last1=Smith|first1=John Frederick}}</ref>
 
మరికొన్ని దళాలను పొందాక, మేజర్ ఐర్ కన్వర్ సింగ్‌ను వెంబడించి జగదీష్‌పూర్ చేరుకున్నాడు. అప్పటికే కన్వర్ సింగ్ తప్పించుకున్నాడు. ఐర్ సింగ్ ఇంటిని, అతడి సోదరుల ఇళ్ళనూ ధ్వంసం చేసాడు.<ref name="Gazette22050" />
 
గయ, నవాడా, జెహానాబాద్ జిల్లాల్లో కూడా హుసేన్ బక్ష్ ఖాన్, గులామ్ ఆలీ ఖాన్, ఫతే సింగ్ వంటి వారి నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి.<ref>{{cite journal|title=The Revolt of 1857: 'Real Heroes of Bihar Who Have Been Dropped From Memory|author=Sarvesh Kumar|journal=Proceedings of the Indian History Congress|volume=68|year=2007|pages=1454|jstor=44145679}}</ref>
 
==తిరుగుబాటు నాయకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2620224" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ