వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 29: పంక్తి 29:


వికీపీడియా ఏ వాదాలకు వేదిక కాకూడదు. అది భాషా వాదాలకు కూడా వర్తిస్తుంది. పూర్వపు భాషా వాదాలు కావచ్చు (గ్రాంథిక, సరళ గ్రాంథిక ఉద్యమాలు), ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న భాషా వాదాలు కానీ (మహాప్రాణాలు తొలగించాలనీ, ఆంగ్ల, సంస్కృత మూలాలు ఉన్న పదాలను వదిలి ద్రావిడ మూలాలున్న పదాలనే వాడాలనీ) - ఇలా ఇంకా ప్రామాణిక భాషా వ్యవహారంలోకి రాని ఏ వాదాన్నైనా వికీపీడియా ద్వారా తలకెత్తుకోలేం.
వికీపీడియా ఏ వాదాలకు వేదిక కాకూడదు. అది భాషా వాదాలకు కూడా వర్తిస్తుంది. పూర్వపు భాషా వాదాలు కావచ్చు (గ్రాంథిక, సరళ గ్రాంథిక ఉద్యమాలు), ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న భాషా వాదాలు కానీ (మహాప్రాణాలు తొలగించాలనీ, ఆంగ్ల, సంస్కృత మూలాలు ఉన్న పదాలను వదిలి ద్రావిడ మూలాలున్న పదాలనే వాడాలనీ) - ఇలా ఇంకా ప్రామాణిక భాషా వ్యవహారంలోకి రాని ఏ వాదాన్నైనా వికీపీడియా ద్వారా తలకెత్తుకోలేం.
== ఏక వచనం ==
{{Main|వికీపీడియా:ఏకవచన ప్రయోగం}}
వికీపీడియాలో ఒక్కరిని ఉద్దేశించి రాసినప్పుడు ఏక వచనమే వాడాలి తప్ప ప్రత్యేక గౌరవాన్ని ఆపాదించేలా బహువచనం వాడకూడదు. ఉదాహరణకు: అతను వచ్చాడు, ఆమె వచ్చింది అని రాయాలి తప్ప ఆయన వచ్చారు, ఆవిడ వచ్చారు అని రాయకూడదు. దీని ప్రాతిపదిక కోసం [[వికీపీడియా:ఏకవచన ప్రయోగం]] చూడండి.


[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]

07:21, 23 మార్చి 2019 నాటి కూర్పు

మందార మకరంద మాధుర్యమును బోలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి. తెలుగు వికీపీడియాలోని వ్యాసాలు తెలుగు భాషలోనే రాయాలి. ఇంగ్లీషులోగాని, మరే ఇతర భాషలోగానీ రాయకూడదు.

వ్యావహారిక భాష

వికీపీడియాలో సరళ వ్యావహారిక భాషలో రాయాలి. వివిధ మాండలికాలతో తెలుగు భాష సుసంపన్నమైంది. అయితే వికీపీడియాలో వ్యాసాలు ఇలా మాండలికాలతో రాస్తే సర్వామోదంగా ఉండదు కాబట్టి పత్రికల్లో రాసే భాషను అనుసరించాలి. ఇది ప్రధాన పేరుబరిలో ఉండే విజ్ఞానసర్వస్వ వ్యాసాలకే కాక ఇతర పేరుబరులలోని పేజీలన్నిటికీ ఇది తప్పనిసరి. వాడుకరి, వాడుకరి చర్చ పేజీల్లో కొంత వెసులుబాటుకు అవకాశముంది. ఉదాహరణకు.. "వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి. మొదటి రెండు ప్రయోగాలు గతకాలపు రచనల్లో కనిపిస్తాయిగానీ, ఇప్పటి రచనల్లో వాడుకలో లేదు. వికీపీడియా వ్యాసాల్లో కూడా అలాంటి ప్రయోగాలు ఉండకూడదు.

అనుస్వారం

ము తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. విధానం అనే పదం యొక్క బహువచనరూపం విధానాలు అవుతుంది.

వ్యాకరణ దోషాలు

  • విభక్తులు లేకుండా పదాలు రాయకూడదు. వీటికి "కి", "కు", "ని", "ను" వంటి విభక్తులను చేర్చి పదానికి, తద్వారా వాక్యానికీ అర్థాన్ని కలిగించాలి. కాబట్టి వాక్యానికి ఇవి ప్రాణం అనుకోవచ్చు.
    • ఉదాహరణకు చివరకు రోమన్ సామ్రాజ్యం మధ్యధరా బేసిన్‌లో ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది. పురాతన ప్రపంచాన్ని జయించి పాశ్చాత్య నాగరికత ప్రముఖ సాంస్కృతిక రాజకీయ మరియు మత కేంద్రంగా మారింది. అన్న వాక్యం చూడండి పాశ్చాత్య నాగరికత పురాతన ప్రపంచాన్ని జయించిందనీ, సాంస్కృతిక, రాజకీయ, మత కేంద్రమైందనీ అనిపిస్తోంది కదూ. కానీ అసలు అర్థం అది కాదు. పాశ్చాత్య నాగరికత అన్నదాని పక్కన "కి" లేదా "కు" అన్న విభక్తి మిస్సయింది. చివరకు రోమన్ సామ్రాజ్యం మధ్యధరా బేసిన్‌లో ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది. పురాతన ప్రపంచాన్ని జయించి పాశ్చాత్య నాగరికతకు ప్రముఖ సాంస్కృతిక రాజకీయ మరియు మత కేంద్రంగా మారింది. అన్న వాక్యాలు "కు" అన్న విభక్తి చేర్చాక చదివితే రోమన్ సామ్రాజ్యం పాశ్చాత్య నాగరికతకు కేంద్రమైందన్న అర్థాన్ని ఇస్తాయి.
  • భూతకాలాన్ని వర్తమాన కాలంలో రాయడం ఒకటి బాగా కనిపిస్తోంది. దీన్ని సరిజేయాలి. చరిత్రను రాసేప్పుడు గుర్తుపెట్టుకుని మరీ భూతకాలంలోనే రాయాలి.
    • ఉదాహరణకు పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా ఉన్నాయి. అని రాశారు కదా. ఐతే ఉన్నాయి అన్న క్రియ ప్రస్తుతం ఉన్నాయన్న అర్థాన్ని, వర్తమాన కాలాన్ని సూచిస్తూంది. మనం చెప్పే విషయం వందల ఏళ్ళ క్రితానిది కాబట్టి భూతకాల క్రియ వాడాలి. అంటే పునరుజ్జీవనం సమయంలో సరికొత్త ఇటలీ సంస్కృతి ప్రారంభానికి వాణిజ్యనగరాలలో కేంద్రీకృతమైన సంపద మరియు కళాపోషకులైన ఉన్నత కుటుంబాలు ఆధారంగా ఉండేవి అని రాయాలి.
  • "యొక్క" అనే పదాన్ని తరచు వాడుతున్నారు. యొక్క అన్న పదం వాడుక భాషలోనూ, పూర్వపు గ్రాంథిక భాషలోనూ కూడా లేదు, సరికాదు. సాధారణంగా సమాసంలోకి వెళ్ళిపోతుంది. నా యొక్క భార్య, అతని యొక్క ఆస్తి అని మనం అంటామా? నా భార్య, అతని ఆస్తి అన్నది సరైన ప్రయోగం.

అనువాదాలు చేసేటపుడు సమస్యలు

ఇంగ్లీషు నుండి వ్యాసాలను అనువదించేటపుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ:

  • మరియు: అనువాదాల్లో తలెత్తే అతిపెద్ద సమస్య "మరియు" పదాన్ని వాడటం. ఇంగ్లీషులో అండ్ (and) అన్న పదానికి అనువాదంగా దీన్ని ప్రయోగిస్తున్నారని అర్థమవుతోంది. కాకపోతే ఈ పదం తెలుగులో ప్రయోగాన్ని కోల్పోతోంది. ఇప్పటికే ఆధునిక వచనంలోంచి తప్పుకుంటోంది. దీనికి బదులుగా "," (కామా) హాయిగా వాడుకోవచ్చు. అవసరమైతే రెండు పదాలకు చివర్లో "నీ" వంటి విభక్తులు చేర్చుకోవచ్చు. రెండు పదాలను కలిపేందుకు "మరియు" వాడడమే కాస్త అసహజంగా ఉంటుందంటే ఇక రెండు వాక్యాలను కలపడానికి అయితే మరీ కృత్రిమంగా ఉంటుంది. and అనే పదంతో కలిసే వాక్యాలను రెండు వాక్యాలుగా విడదీసుకోవడం బావుంటుంది.
    • ఉదాహరణకు ఇది అధిక కాలానుగుణ ఉష్ణోగ్రత మరియు మధ్యధరా వాతావరణం కలిగి ఉంది.>> ఇది అధిక కాలానుగుణ ఉష్ణోగ్రతనీ, మధ్యధరా వాతావరణాన్నీ కలిగి ఉంది.
    • మరో ఉదాహరణ - కార్తిజియన్లు మరియు గ్రీకులు >> కార్తిజియన్లూ, గ్రీకులూ (రెండూ దీర్ఘాలతో ముగించేసి, కామా పెడితే మరియు తీసేయొచ్చు).
    • ఇంకో ఉదాహరణ - సెల్ట్స్ ఇటలీ కేంద్రంలో నివసిస్తున్నారు మరియు ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు. >> సెల్ట్స్ ఇటలీ కేంద్రంలోనూ, ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు అని వాక్యాలు రెండూ కలపవచ్చు, లేదంటే సెల్ట్స్ ఇటలీ కేంద్రంలో నివసిస్తున్నారు. ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు. అని విడదీయనూవచ్చు.
  • సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలను విడదీయడం మేలు. ఎంత చిన్న వాక్యాలైతే అంత తేటగా అర్థాన్ని ఇస్తాయి.
    • ఉదాహరణకు: ప్రధానంగా ఇటలీ ఉత్తర మరియు మధ్య ప్రాంతాలలో షిప్పింగ్, వాణిజ్యం మరియు బ్యాంకింగ్ జరగడం ద్వారా గొప్ప సంపదకు, ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి పునాది వేసింది.. ఈ వాక్యాన్ని ప్రధానంగా ఉత్తర, మధ్య ఇటలీలో షిప్పింగ్, వాణిజ్యం, బ్యాంకింగ్ జరిగేది. ఇది ఇటలీలో గొప్ప సంపదకు, ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి పునాది వేసింది.
  • పొరపాటు అనువాదాలు ఒక సమస్యగా ఉంది. దీన్ని నివారించడానికి పదానికి అర్థం తెలియనప్పుడు, ఏదైనా సాంకేతికమైన పదం తగిలినపప్పుడు ఆంధ్రభారతి నిఘంటువు సాయంతో గట్టెక్కవచ్చు. ఇందులో సాంకేతిక పద నిఘంటువులు కూడా ఉన్నాయి కాబట్టి సహాయకారిగా ఉంటుంది. అలానే వారిచ్చే ప్రతిపదార్థాల్లో సందర్భానికి తగినది ఎంచుకుని వాడుకోవచ్చు.
    • ఉదాహరణకు Law and order అన్న పదాన్ని "చట్టం మరియు ఆర్డర్" అని కాకుండా "శాంతి భద్రతలు" అనేది సరైన అనువాదం. ఆంధ్రభారతి నిఘంటుశోధనలో చూస్తే బూదరాజు రాధాకృష్ణ ఆధునిక వ్యవహారకోశంలోనూ ఈ అర్థం దొరుకుతోంది. అలా వెతుక్కుని వాడుకోవచ్చు.

కొత్త పదాలను సృష్టించవద్దు

అనువాదాలు చేసేటపుడు మూల భాషలోని పదానికి తెలుగు అర్థం తెలియకపోతే నిఘంటువులను సంప్రదించండి. నిఘంటువుల్లో మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం చాలా ఉంది. అయితే ఇంగ్లీషులో కొత్తగా వెలుగు చూసే సాంకేతిక పదాలకు తెలుగు సమానార్థకాలు నిఘంటువుల్లో దొరక్క పోవచ్చు. ఆ సందర్భాల్లో తెలుగు వార్తా పత్రికలు మంచి వనరు కాగలవు. ఎక్కడా సరైన తెలుగు సమానార్థకం దొరక్కపోతే, ఇంగ్లీషు పదాన్ని అలాగే, తెలుగు లిపిలో వాడండి. కానీ మీరే స్వయంగా కొత్త తెలుగు పదాన్ని సృష్టించ వద్దు. వికీపీడియా కొత్త పదాలను సృష్టించే ప్రదేశం కాదు.

వికీపీడియా ఏ వాదాలకు వేదిక కాకూడదు. అది భాషా వాదాలకు కూడా వర్తిస్తుంది. పూర్వపు భాషా వాదాలు కావచ్చు (గ్రాంథిక, సరళ గ్రాంథిక ఉద్యమాలు), ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న భాషా వాదాలు కానీ (మహాప్రాణాలు తొలగించాలనీ, ఆంగ్ల, సంస్కృత మూలాలు ఉన్న పదాలను వదిలి ద్రావిడ మూలాలున్న పదాలనే వాడాలనీ) - ఇలా ఇంకా ప్రామాణిక భాషా వ్యవహారంలోకి రాని ఏ వాదాన్నైనా వికీపీడియా ద్వారా తలకెత్తుకోలేం.

ఏక వచనం

వికీపీడియాలో ఒక్కరిని ఉద్దేశించి రాసినప్పుడు ఏక వచనమే వాడాలి తప్ప ప్రత్యేక గౌరవాన్ని ఆపాదించేలా బహువచనం వాడకూడదు. ఉదాహరణకు: అతను వచ్చాడు, ఆమె వచ్చింది అని రాయాలి తప్ప ఆయన వచ్చారు, ఆవిడ వచ్చారు అని రాయకూడదు. దీని ప్రాతిపదిక కోసం వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.