విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 15: పంక్తి 15:
ఖురాన్‌లోనే శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం కోసం దుస్తులు భగవంతుడు సృష్టించాడని చెప్పడంతో శరీరావయవాల సౌష్టవాన్ని కనిపించనివ్వకుండా వదులైన బట్టలతో శరీరాన్ని కప్పుకోవడం ముస్లింలకు ఒక ధార్మికమైన కర్తవ్యమైంది. శరీరాన్ని అనాచ్ఛాదితంగా ఉంచడం సిగ్గుచేటనీ, సౌష్టవం కూడా తెలియని విధమైన బట్టలతో కప్పుకోవడం మర్యాదకరమనీ ముస్లిం సంప్రదాయం.

=== విజయనగర వస్త్రధారణ సాంస్కృతిక ప్రభావం ===
=== విజయనగర వస్త్రధారణ సాంస్కృతిక ప్రభావం ===
13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది. సిసిలీ మొదలుకొని ఇటువైపు భారతదేశం వరకూ విస్తృతమైన భూభాగం పర్షియా, టర్కీ దేశాల సాంస్కృతిక పరిధిలోకి వచ్చాయనీ చెప్తూ ఫిలిప్ బి వాగనర్ ఇస్లామీయకరణగా ప్రతిపాదించాడు. మతపరంగా స్వతంత్రంగా ఉంటూనే రాజకీయ, దౌత్య అవసరాల వల్ల, ఇస్లామీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించడం ద్వారా పర్షియా, టర్కీలు కేంద్రంగా ఉన్న విస్తృతమైన రాజకీయ అల్లికలో భాగం కాగలగడం దీనికి పునాదిగా నిలిచింది. మతరహితమైన సాంస్కృతిక ప్రభావం మెల్లమెల్లగా బలపడడంతో విజయనగర రాజాస్థానాల్లోకి తోటి హిందూ రాజాస్థానాల్లో లేని కుల్లాయిలు, అంగీలు వచ్చిచేరాయి.
13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది. సిసిలీ మొదలుకొని ఇటువైపు భారతదేశం వరకూ విస్తృతమైన భూభాగం పర్షియా, టర్కీ దేశాల సాంస్కృతిక పరిధిలోకి వచ్చాయనీ చెప్తూ ఫిలిప్ బి వాగనర్ ఇస్లామీయకరణగా ప్రతిపాదించాడు. మతపరంగా స్వతంత్రంగా ఉంటూనే రాజకీయ, దౌత్య అవసరాల వల్ల, ఇస్లామీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించడం ద్వారా పర్షియా, టర్కీలు కేంద్రంగా ఉన్న విస్తృతమైన రాజకీయ అల్లికలో భాగం కాగలగడం దీనికి పునాదిగా నిలిచింది. మతరహితమైన సాంస్కృతిక ప్రభావం మెల్లమెల్లగా బలపడడంతో విజయనగర రాజాస్థానాల్లోకి తోటి హిందూ రాజాస్థానాల్లో లేని కుల్లాయిలు, అంగీలు వచ్చిచేరాయి. పర్షియన్, టర్కీ తదితర ఇస్లాం ప్రపంచంలోని కీలక స్థానాల రాయబారులతోనూ, వ్యాపారులతోనూ విజయనగర చక్రవర్తులు సాగించిన దౌత్య, వ్యాపారాలు ఈ మార్పుకు దోహదం చేశాయి.

==మూలాలు==
==మూలాలు==

23:15, 2 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్రధారణ పర్షియన్, దక్షిణ భారతీయ వస్త్రధారణ పద్ధతుల సమ్మేళనంగా నిలిచింది.

దుస్తుల శైలి

రాజాస్థానీకుల వస్త్రధారణ

బొత్తాలు ఉన్న అంగీ, తలపైన కుళ్ళాయి (టోపీ లాంటిది), నడుము కింది భాగంలో పంచె అన్నవి విజయనగర సామ్రాజ్యకాలంలో పురుషులు, మరీముఖ్యంగా రాజాస్థాన పురుషుల దుస్తులు. అంగీ చేతులు కొంచెం బిగువుగా ఉండేవి. కొందరి అంగీలు పొడుగ్గా కింద మోకాళ్ళ వరకూ, మరికొందరివి నడుము వరకు మాత్రమే ఉండేది. చరిత్రకారుడు ఫిలిప్ బి. వాగనర్ దీన్ని పరిశీలిస్తూ ఆ పొడుగు, పొట్టి అంగీలు వారి వారి సామాజిక స్థాయిని సూచిస్తూ ఉండవచ్చనీ, పొట్టి అంగీలవారు సేవకులు కావచ్చనీ అభిప్రాయపడ్డాడు. అంగీ మెడ వెడల్పుగా, కప్పడానికి మడతపెట్టిన ఒక పట్టీతో ఉండేది. అంగీ ముందుభాగం తొడుక్కోవడానికి వీలుగా చీలివుండి, బొత్తాలతో ఉండేది. విజయనగర చక్రవర్తి ధరించే అంగీ పల్చగా ఉండేది. దాన్ని నూలు, పట్టు, జరీ ముడిగుడ్డలుగా వినియోగించి పనితనంతో నేసినదిగా విదేశీ యాత్రికులు గుర్తించారు. రాజు ధరించే అంగీ మేలైన రకం పట్టుతో ఉండడమే కాక జరీలో బంగారాన్ని విస్తారంగా వాడి వివిధ రూపాలను చిత్రించేవారని న్యూనిజ్ పేర్కొన్నాడు. ఇక మిగిలిన ఆస్థానీకులు, సాధారణ సేవకులు ధరించే అంగీలు వారి వారి స్థాయిలను బట్టి వివిధ నాణ్యతలు కలిగిన బట్టతో కుట్టేవారు.[1]

తలపై కిరీటాలు కాక అందరూ కుళ్ళాయి అని పిలిచే గుడ్డ టోపీ ధరించేవారు. వారి వారి స్థాయిని బట్టి దానికి జరీ పని ఉండేది. కింది స్థాయి ఆస్థానీకులు, సేవకులు తదితరులు ఏ జరీ లేని సామాన్యమైన కుళ్ళాయి ధరించేవారు.[1] కృష్ణదేవయరాయల కుళ్ళాయి రెండు అడుగుల పొడవు ఉండేదనీ, రాణివాసాల్లో మసిలే మహిళలు ముత్యాలతో చేసిన దండలు అలంకరించిన కుళ్ళాయిలు ధరించేవారనీ విదేశీయాత్రికులు పేర్కొన్నారు.[2]

ఇతరుల వస్త్రధారణ

పైన కబాయి లేక అంగీ ధరించడం, మొలధట్టి కట్టుకోవడం వంటివాటి వాడుక పరిమితమని ఆనాటి విదేశీ యాత్రికులంతా నమోదుచేశారు. ఇటాలియన్ యాత్రికుడు లుడోవికో డి వర్తెమా తన రచనలో ఈ అంగీధారణ అన్నది రాజాస్తానీకులను మినహాయించి ఇతరుల్లో కనిపించదని రాశాడు. సామాన్య పురుషులు పై భాగం ఏ ఆచ్ఛాదనా లేకుండా, మొల కింద నుంచి మాత్రం పంచె, మొలగుడ్డ వంటివి కట్టుకునేవారు.[1]

రాజకీయ, సాంస్కృతిక ప్రభావాలు

హైందవ వస్త్రధారణ పద్ధతులు

హైందవ సంస్కృతిలో వస్త్రధారణ వెనుక నేపథ్యాన్ని వివరిస్తూ ఫిలిప్ బి వాగనర్ - "హైందవ ధర్మం ప్రకారం, శరీరం మానవుని అస్తిత్వంలో ఒక విడదీయరాని భాగం. మనిషి లోపలి గుణ స్వరూపానికి ఒక బాహ్య సంకేతం. ఈ సాంస్కృతిక సందర్భంలో దుస్తుల ప్రయోజనం శరీరాన్ని కప్పడం, అంటే దాచిపెట్టటం కాదు. దుస్తుల ప్రయోజనం శరీరాన్ని ప్రదర్శించడం, శరీరాకృతికి అనుగుణంగా చుట్టుకొని, శరీరాన్ని బహిరంగపరచటం అవుతుంది." అంటాడు.[2] అందుకు అనుగుణంగానే ఆ కాలానికి చెందిన మిగిలిన స్వతంత్ర దక్షిణ భారత హిందూ రాజ్యాలలో రాజాస్థానాలలో పూర్వపు హిందూ పద్ధతుల్లోనే వస్త్రధారణ సంప్రదాయాలు కొనసాగాయి. దాని ప్రకారం ఆస్థానికుల్లో పురుషులు, ఇతర సాధారణ వ్యక్తులు, చివరికి మహారాజు సైతం పైభాగాన్ని ఆచ్ఛాదన లేకుండా వదిలివేసి, నడుము కింది భాగంలో మాత్రం పంచెలు ధరించేవారు. ఆ పంచెల నాణ్యత, నేతలో భేదాలు ఉండేవి. ఈ పద్ధతి కాలికట్, కొచ్చిన్ మొదలుకొని కుయిలోన్, సిలోన్ (శ్రీలంక), మాల్దీవులు వంటి ఇతర దేశాల్లో కూడా ఉన్నట్టు విదేశీ ముస్లిం యాత్రికులు అబ్దుల్ రజాక్, మా హుఆన్ గమనించి రాసుకున్నారు.[1] అనాచ్ఛాదితమైన ఛాతీపై పడేలా అంగవస్త్రాన్ని వేసుకునేవారు. తలపైన రాజులు బంగారంతో చేసి రత్నాలు పొదిగిన కిరీటాలు, రాజాస్థానీకులు తలపాగాలు ధరించేవారు.[2]

ముస్లిం వస్త్రధారణ నేపథ్యం

ఖురాన్‌లోనే శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం కోసం దుస్తులు భగవంతుడు సృష్టించాడని చెప్పడంతో శరీరావయవాల సౌష్టవాన్ని కనిపించనివ్వకుండా వదులైన బట్టలతో శరీరాన్ని కప్పుకోవడం ముస్లింలకు ఒక ధార్మికమైన కర్తవ్యమైంది. శరీరాన్ని అనాచ్ఛాదితంగా ఉంచడం సిగ్గుచేటనీ, సౌష్టవం కూడా తెలియని విధమైన బట్టలతో కప్పుకోవడం మర్యాదకరమనీ ముస్లిం సంప్రదాయం.

విజయనగర వస్త్రధారణ సాంస్కృతిక ప్రభావం

13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది. సిసిలీ మొదలుకొని ఇటువైపు భారతదేశం వరకూ విస్తృతమైన భూభాగం పర్షియా, టర్కీ దేశాల సాంస్కృతిక పరిధిలోకి వచ్చాయనీ చెప్తూ ఫిలిప్ బి వాగనర్ ఇస్లామీయకరణగా ప్రతిపాదించాడు. మతపరంగా స్వతంత్రంగా ఉంటూనే రాజకీయ, దౌత్య అవసరాల వల్ల, ఇస్లామీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించడం ద్వారా పర్షియా, టర్కీలు కేంద్రంగా ఉన్న విస్తృతమైన రాజకీయ అల్లికలో భాగం కాగలగడం దీనికి పునాదిగా నిలిచింది. మతరహితమైన సాంస్కృతిక ప్రభావం మెల్లమెల్లగా బలపడడంతో విజయనగర రాజాస్థానాల్లోకి తోటి హిందూ రాజాస్థానాల్లో లేని కుల్లాయిలు, అంగీలు వచ్చిచేరాయి. పర్షియన్, టర్కీ తదితర ఇస్లాం ప్రపంచంలోని కీలక స్థానాల రాయబారులతోనూ, వ్యాపారులతోనూ విజయనగర చక్రవర్తులు సాగించిన దౌత్య, వ్యాపారాలు ఈ మార్పుకు దోహదం చేశాయి.

మూలాలు

ఆధార రచనలు

  • ఫిలిప్ బి వాగనర్ (1 July 2010). "రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం". ఈమాట. Retrieved 2 April 2019. ఆంగ్లమూలం నుంచి మాధవ్ మాచవరం అనువదించిన వ్యాసం