ఇంద్రజ: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
→చిత్రమాలిక: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 43: | పంక్తి 43: | ||
* [[సంప్రదాయం]] |
* [[సంప్రదాయం]] |
||
* [[జగదేకవీరుడు]] |
* [[జగదేకవీరుడు]] |
||
* [[మమ్మీ మీ ఆయనొచ్చాడు]] |
|||
* [[వద్దు బావ తప్పు]] |
|||
* [[దిక్కులు చూడకు రామయ్య]] (2014) |
* [[దిక్కులు చూడకు రామయ్య]] (2014) |
||
06:15, 9 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
ఇంద్రజ | |
---|---|
జననం | రాజాతి |
వృత్తి | సినీ నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1993-2007, 2014- |
ఇంద్రజ తెలుగు మరియు మలయాళ సినిమా నటి.[1] ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.
కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు.[2]
పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత మరియు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.
ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మలయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.
పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథకు యాంకరుగా కూడా పనిచేసింది.[3] ఇటీవలి కాలంలో, ఈమె టీవీ సీరియల్లలో నటించింది. సుందరకాండ అనే తెలుగు సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. భైరవి అనే తమిళ సీరియల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్ టీవి సీరియల్ వల్లిలో నటిస్తుంది.
చిత్రమాలిక
- చిన్ని చిన్ని ఆశ
- ఎర్రోడు
- సొగసు చూడతరమా
- లవ్ గేమ్
- ఒక చిన్నమాట
- జై భజరంగభళీ
- జంతర్ మంతర్
- వన్స్ మోర్
- యమలీల
- పిచ్చోడి చేతిలో రాయి
- పిట్టల దొర
- పెద్దన్నయ్య
- తెలంగాణ
- నల్లపూసలు
- అమ్మదొంగా (ప్రత్యేక నృత్యం)
- సంప్రదాయం
- జగదేకవీరుడు
- మమ్మీ మీ ఆయనొచ్చాడు
- వద్దు బావ తప్పు
- దిక్కులు చూడకు రామయ్య (2014)
మూలాలు
- ↑ "కృష్ణగారి షూటింగ్కు పిలిచి పంపించేశారు!". eenadu.net. Archived from the original on 13 March 2018.
- ↑ http://www.tamilstar.info/profile/actress/indraja/
- ↑ http://www.hindu.com/fr/2005/09/16/stories/2005091602460800.htm
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇంద్రజ పేజీ