హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
85 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి (యంత్రము కలుపుతున్నది {{Unreferenced}})
చి (AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను)
| weight =
}}
 
 
 
'''హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి''' అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన సెప్టంబర్ 1914 వ సంవత్సరాన, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట అనే ఊరిలో జన్మించారు. ఈయన పూర్తి పేరు "హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి". తొలుత ఈయన ఒక ప్రముఖ [[హార్మోనియం]] వాద్యకారుడు మరియు రంగస్థల సంగీతదర్శకుడు. ఆయన మొట్టమొదటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. తెలుగులో మొట్టమొదటి టాకీ [[భక్త ప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]] (1931)కు ఈయనే సంగీతదర్శకుడు. తెలుగే కాక ఇతర దక్షిణభారతీయ భాషా చిత్రాలకు కూడా ఈయన పనిచేశారు. ప్రముఖ [[కన్నడ]] రంగస్థల, చలనచిత్ర నటుడు [[ఆర్.నాగేంద్రరావు]] తొలి కన్నడ టాకీ ''సతీ సులోచన'' (1934) కి పద్మనాభశాస్త్రిని సంగీతం సమకూర్చడానికి కుదుర్చుకున్నారు, కానీ తర్వాత నాగేంద్రరావే ఆ పనిని చేశాడు, పద్మనాభశాస్త్రి అయనకు సహాయకునిగా పనిచేశాడు. మన తెలుగు సినిమా సంగీతానికి పునాది రాయి వేసిన వ్యక్తి హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి. ఈయన పూర్వీకులు పదహారణాల తెలుగువారు. అయితే తాత ముత్తాత లంతా హోస్పేటలో స్థిరపడిపోయారు. [[తమిళ]] చిత్రం ''కంకణమ్'' (1947) తో గాయని [[పి.లీల]]ను చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. [[శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా)|శ్రీకృష్ణ తులాభారం]] (1955) చిత్రంలో సత్యభామ వేషం ధరించిన నటగాయని [[ఎస్.వరలక్ష్మి]] ఈయన సంగీతదర్శకత్వంలో [[స్థానం నరసింహరావు]] రచించిన సుప్రసిద్ధమైన ''మీరజాలగలడా నాయానతి'' పాట ఆలపించింది. 1970 వ సంవత్సరం వరకు కూడా ఈయన సంగీత విభాగంలోనే పనిచేసారు. [[కె.వి.మహదేవన్]] కొన్నాళ్లపాటు పద్మనాభ శాస్త్రిని తన దగ్గరే పెట్టుకున్నారు. ఎంతో మంది సంగీత దర్శకులకు, సంగీత కళాకారులకు శిక్షణ ఇచ్చిన తొలితరం సంగీత దర్శకుడీయన. ఈయన [[సెప్టెంబర్ 14]], [[1970]] వ సంవత్సరంలో కన్నుమూశారు.
* [http://www.imdb.com/name/nm0766063/ ఐ.ఎం.డి.బి లో ఆయన వివరాలు]
* [http://ishtapadi.blogspot.in/2014_09_01_archive.html ఆయన జీవిత విశేషాలు]
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:హార్మోనియం విద్వాంసులు]]
[[వర్గం:రంగస్థల కళాకారులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
1,82,236

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2643372" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ