నితిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 86: పంక్తి 86:
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:1983 జననాలు]]
[[వర్గం:1983 జననాలు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా వ్యక్తులు]]

07:23, 21 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

నితిన్
జననం
నితిన్ కుమార్ రెడ్డి

మార్చి 30, 1983
ఇతర పేర్లునితిన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ఇప్పటివరకూ

నితిన్ (జ: 1983 మార్చి 30) ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ప్రముఖ సినీ పంపిణీదారు.[1] అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాద్కి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

సినిమా కెరీర్

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే పెరిగాడు. నచ్చిన సినిమాను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ లను అతని అభిమాన నటులు. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన తొలిప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.

ఒక రోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. 2002 లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు.[1]

నటించిన చిత్రాలు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విశేషాలు
2002 జయం వెంకట్ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు
2003 దిల్ శీను
2003 సంబరం రవి
2004 శ్రీ ఆంజనేయం అంజి
2004 సై పృథ్వి
2005 అల్లరి బుల్లోడు రాజు,
మున్నా
ద్విపాత్రాభినయం
2005 ధైర్యం శీను
2006 రామ్ రామ్
2007 టక్కరి తిరుపతి
2008 ఆటాడిస్తా జగన్
2008 విక్టరీ విజయ్
2008 హీరో రాధాకృష్ణ
2009 ద్రోణ ద్రోణ
2009 అగ్యాత్ సుజల్ హిందీ సినిమా
2009 రెచ్చిపో శివ
2010 సీతారాముల కళ్యాణం లంకలో చంద్ర
2011 మారో సత్యనారాయణ మూర్తి
2012 ఇష్క్ రాహుల్
2013 గుండె జారి గల్లంతయ్యిందే కార్తిక్
2013 కొరియర్ బాయ్ కళ్యాణ్ కళ్యాణ్
2014 హార్ట్ అటాక్ వరుణ్
2014 చిన్నదాన నీ కోసం నితిన్
2016 "అ ఆ" ఆనంద్
2017 "లై"

2018 || "శ్రీనివాస కల్యాణం ||

మూలాలు

  1. 1.0 1.1 "ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 March 2017. Retrieved 30 March 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=నితిన్&oldid=2644193" నుండి వెలికితీశారు