తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి +{{Authority control}}
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 48: పంక్తి 48:
[[వర్గం:తెలంగాణ ప్రజలు]]
[[వర్గం:తెలంగాణ ప్రజలు]]
[[వర్గం:తెలంగాణ ప్రముఖులు]]
[[వర్గం:తెలంగాణ ప్రముఖులు]]
[[వర్గం:తెలంగాణ వ్యక్తులు]]

09:06, 21 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

తూము రామదాసు
జననంఆగష్టు 18, 1856
మరణంనవంబరు 29, 1904
జాతీయతభారతీయుడు
వృత్తితెలంగాణ తొలి నాటక (కాళిదాసు) రచయిత, కవి
తల్లిదండ్రులుతూము సర్వేశం
బంధువులువరదరాజులు (కుమారుడు)

తూము రామదాసు (ఆగష్టు 18, 1856 - నవంబరు 29, 1904) తెలంగాణ తొలి నాటక (కాళిదాసు) రచయిత.[1] 1897లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.[2] [3]

జననం

రామదాసు 1856, ఆగష్టు 18 న (నల నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం) తూము సర్వేశం దంపతులకు వరంగల్‌ లోని బాలనగరంలో జన్మించాడు.

రచనా ప్రస్థానం

పేదరికంలో ఉన్న రామదాసు కందాళ సింగరాచార్యులు చేరదీసి విద్యాబుద్దులు నేర్పించాడు. సంస్కృతాంధ్ర పండితులు ప్రతాపపురం రంగాచార్యులు వద్ద ఉభయభాషలను చదువుకున్న రామదాసు, తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలుపెట్టి రుక్మిణీ కళ్యాణం గేయకావ్యాన్ని రాశాడు.

రచనలు

  1. రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
  2. గోపికావిలాసము (ప్రబంధము)
  3. మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
  4. కాళిదాసు (నాటకం): సురభి నాటక సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు బృందం 1897లో వరంగల్‌ లో నాటకాలు ప్రదర్శిస్తున్న క్రమంలో తూము రామదాసు వారికి ఈ నాటకాన్ని రాసిచ్చాడు. ఈ నాటకాన్ని వనారస గోవిందరావు దర్శకత్వంలో సురభి సంస్థ ప్రదర్శించింది. 1899లో తూము రామదాసు మద్రాసు కు వెళ్ళి ఈ నాటకాన్ని పుస్తకంగా తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ నాటక ప్రతి అలభ్యం.
  5. ఆంధ్రపదనిధానము: 1901లో ‘ఆంధ్ర పదనిదానము’ నిఘంటువు రచించాడు. ఈ గ్రంథాన్ని 1930లో రామదాసు కుమారుడు వరదరాజులు ప్రచురించాడు.[4]

మరణం

నిజాం ప్రభుత్వం లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు 1904, నవంబరు 29 (క్రోధినామ సంవత్సరం కార్తీక బహుళ సప్తమి) న మరణించాడు.[5] రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి తెలుగులోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.[6]

మూలాలు

  1. నమస్తే తెలంగాణ. "తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం". Retrieved 18 August 2017.
  2. ఆంధ్రజ్యోతి. "తొలి నాటక కర్త తూము రామదాసు". Retrieved 18 August 2017.
  3. గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385
  4. International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17
  5. [1]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166
  6. PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146