"జూనియర్ ఎన్.టి.ఆర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==చిత్ర రంగంలో==
ఇతని తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత [[బాల రామాయణము]] చిత్రములో రాముడిగా నటించాడు. ఆ సమయంలో నట శిక్షకుడు [[ఎన్.జె. భిక్షు]] దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.<ref>ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21</ref> 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత [[ఎస్.ఎస్.రాజమౌళి]] దర్శకత్వంలో వచ్చిన [[స్టూడెంట్ నెం.1]] చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తర్వాత వచ్చిన [[సుబ్బు]] పరాజయం పొందింది . ఆ తర్వాత [[వి.వి.వినాయక్]] దర్శకత్వంలో వచ్చిన [[ఆది]] చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు . ఆ తరువాతి [[సింహాద్రి]] చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు.
అల్లరి రాముడు బాగా ఆడలేదు . ఆ తరువాతి [[సింహాద్రి]] చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు.
ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగా ఆడలేదు . బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా [[ఆంధ్రావాలా]], సాంబ, నా అల్లుడు, నరసింహుడు, [[అశోక్]] చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి . [[రాఖీ]] చిత్రం ఒకమాదిరిగా ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది.
ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగా ఆడలేదు . బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా [[ఆంధ్రావాలా]], సాంబ, నా అల్లుడు, నరసింహుడు, [[అశోక్]] చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి . [[రాఖీ]] చిత్రం ఒకమాదిరిగా ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది.
2007 లో గత చిత్రాలు "స్టూడెంట్ నెం.1", "సింహాద్రి"ల దర్శకుడు [[ఎస్. ఎస్. రాజమౌళి|ఎస్.ఎస్.రాజమౌళి]] దర్శకత్వంలో వచ్చిన [[యమదొంగ]] చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి, లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు.
 
2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో [[వైజయంతి మూవీస్]] పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో "[[శక్తి]]" చిత్రం కూడా పాటల చిత్రీకరణ బాగున్నా, సినిమా ఘోరపరాజయం పాలయింది.
2011, అక్టోబరు 6న "సురేందర్ రెడ్డి" దర్శకత్వంలో విడుదలైన "ఊసరవెల్లి" మొదటిరోజు 18 కోట్లకు పైగా వసూలు చేసింది. తదుపరి "బోయపాటి శీను" దర్శకత్వంలో వచ్చిన "దమ్ము" చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచినా, ప్రేక్షకుల మరియు అభిమానులను మెప్పించలేకపోయింది . శ్రీనువైట్ల దర్శకత్వంలో "బాద్ షా" చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసుళ్ళు సాధించింది.తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా మరియు రభస అనే చిత్రాలు అభిమానుల మన్ననలు కూడా పొందలేకపోయాయి .
 
2015 తన పాత చిత్రం [[ఆంధ్రావాలా]] దర్శకుడు పురి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన [[టెంపర్]] నటించి ఎన్నో ఏళ్ళుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో అధ్బుత నటన కనబరచినందుకుగాను పలువురు ప్రముఖులపలువురి నుండి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాక జెమిని ఛానెల్లో ఈ చిత్రం ప్రసారమై 26.5 టి.ఆర్.పితో అన్ని రికార్డులను చెరిపివేసింది. 2015 ఐఐటీ మద్రాస్‌ టాక్‌ సెషన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూ.ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు, తారక రాముని తర్వాత మళ్లీ అంతటి దివ్యరూపం భాష యాస తనకే ఉన్నాయని కితాబిచ్చారు రాజమౌళి, తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు. [[సుకుమార్]] దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం [[నాన్నకు ప్రేమతో]] దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక వ్యూస్ మరియు లైక్ లు (60,000) సాధించి రికార్డు సృస్టించింది . ఈ చిత్రంలో గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు, ఫోర్బ్స్ మోస్ట్ డిసైరబుల్ మెన్-2015లో రెండవ స్థానాన్ని సంపాదించాడు. 2016 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధిం చి,50 కోట్ల క్లబ్ లో చేరింది . కొరటాల శివ దర్శకత్వంలో [[జనతా గ్యారేజ్]] చిత్రంలో నటించాడు .2017 దసరాకి [[జై లవ కుశ]] చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ మధ్య బుల్లితెరలో కూడా "బిగ్ బాస్"షో ద్వారా తను ఏంటో నిరూపించుకుంటున్నాడు.అదే మాదిరి గా 2010 లో వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు...
 
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్ర్రం దసరా కు రిలీజ్ కావడానికిి సిద్ధం అవుతోంది. దీని తరువాత ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం నకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2651008" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ