తిరుమలై తిరుపతి యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి replacing dead dlilinks to archive.org links
చి వర్గం:యాత్రా చరిత్ర చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 176: పంక్తి 176:
[[వర్గం:1923 పుస్తకాలు]]
[[వర్గం:1923 పుస్తకాలు]]
[[వర్గం:తిరుమల తిరుపతి]]
[[వర్గం:తిరుమల తిరుపతి]]
[[వర్గం:యాత్రా చరిత్ర]]

13:38, 8 మే 2019 నాటి కూర్పు

తెలుగునాట యాత్రా సాహిత్యం కొంత తక్కువగానే వచ్చిందని చెప్పుకోవాలి. 19వ శతాబ్ది తొలినాళ్లలోనే యేనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర రచించినా అది వెలుగులోకి రావడానికి చాలా కాలమే పట్టింది. ఆపైన కూడా కొంతవరకూ ఆ లోటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 1920దశకంలో తిరుమల యాత్ర చేసి ఆ యాత్రను తిరుమలై తిరుపతి యాత్ర గ్రంథంగా మలచిన ఎస్.వి.లక్ష్మీనారాయణరావు సాహిత్యకృషి అపురూపమైనదే. ఆనాటి తిరుమల యాత్ర ఎలా ఉండేదో, నాటి సాంఘిక జీవనమెలా సాగేదో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది

రచన నేపథ్యం

1920 దశకంలో తిరుమల తిరుపతి యాత్ర సాగించిన ఎస్.వి.లక్ష్మీనారాయణ ఆ అనుభవాలను ఈ గ్రంథ రూపంలోకి మలిచారు. తిరుమల ఆలయాన్ని సంప్రదాయ మహంతులు పాక్షికంగా పరిపాలిస్తున్న రోజులవి. ఆ నేపథ్యంలో తిరుమల మహంతులకు సంబంధించిన హథీరాంజీ మఠం వారు ఈ గ్రంథముద్రణకు సహకరించారు.

విషయాలు

తిరుపతి చేరుకున్న దగ్గరనుంచి మొదలుకొని తిరుపతిలో యాత్రికుల సదుపాయాలు, కింద నుంచి ఆ రోజుల్లో కొండపైకి తీసుకువెళ్ళే డోలీల వారు, అలిపిరి వద్ద పోలీసు ఠాణాలు, యాత్రికులకు ఉపకరించే చలివేంద్రాలు, బావులు, దేవాలయాల వివరాలు, చూడాల్సిన ప్రాంతాలను మొదలుకొని ఎన్నెన్నో వివరాలు అందించారు. ఆ రోజుల్లో తిరుమల యాత్ర చేయదలచిన వారికి దిక్సూచిలా, ఇతరులకు యాత్రానుభవం కలిగించేదిగా ఉపయోగించే పుస్తకమిది.

విషయసూచిక

1. అధ్యాయము

  • తిరుపతి
  • యాత్రికుల నాదరించువారు
  • సత్రములు
  • శ్రీ కపిలతీర్థము
  • డోలి, మూటలవాండ్రు
  • కొండమార్గము
  • అలిపిరి, ఠాణాలు
  • చలివెంద్రలు, బావులు
  • శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి గుడి
  • శ్రీ భాష్యకార్లవారి గుడి
  • అలిపిరి గోపురం
  • గాలిగోపురం
  • సారెపెట్టెలు
  • పంచములు మొదలగువారు

2. అధ్యాయము

  • తిరుమల
  • వృషభాచలము
  • అంజనాచలము
  • శేషాచలము
  • వెంకటాచలము
  • శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం
  • వెయ్యికాళ్ల మంటపం
  • శ్రీహత్తీరాంజి మఠం
  • శ్రీచిన్నజియ్యంగార్లవారి మఠం
  • అధికారివారితోట
  • మైసూరు గవర్నెంటివారి సత్రము
  • దేవస్థానపు సత్రము
  • శృంగగిరి స్వాములవారి మఠము
  • గోసాయిమంటపము
  • హిందుస్తాన్ రామాంజకూటము
  • వ్యాసరాయ స్వాములవారి మఠము
  • అర్చకుల యిండ్లు
  • రాతి తేరు
  • శ్రీవుత్తరాది స్వాములవారి మఠము
  • శ్రీపరకాళ స్వాములవారి మఠము
  • రధము
  • దివాణము
  • వాహన మంటపము
  • బజారు
  • తీర్థగట్టసందు
  • శ్రీవరాహస్వామివారి దేవస్తానము
  • ఘంటా మంటపము
  • పోలీసు స్టేషను
  • శ్రీపెద్దజియ్యంగార్లవారి మఠము
  • ఆచార్యపురుషులు
  • మంగలకట్ట
  • డిస్పెన్సరి
  • భోజనము
  • హోటల్

3. అధ్యాయము

  • శ్రీవారి దర్శనము
  • శుద్ధి
  • తోమాల సేవ
  • కొలువు
  • అర్చన
  • ధర్మదర్శనము
  • అర్చన
  • రాత్రి దర్శనము
  • యేకాంతసేవ
  • గురువారము
  • శుక్రవారము

4. అధ్యాయము

  • ప్రసాదము
  • పరఖామణి
  • పక్షదిట్టం
  • శ్రవణనక్షత్రదిట్టము
  • రోహిణి
  • ఆరుద్ర
  • పునర్వసునక్షత్రం
  • చిత్తానక్షత్రం
  • ద్వాదశివుత్సవము
  • వసంతోత్సవము
  • శ్రీవారి బ్రహ్మోత్సవము
  • నవరాత్రి వుత్సవము
  • ధనుర్మాసము
  • అధ్యయనోత్సవము
  • రథసప్తమి

6. అధ్యాయము

  • ఆర్జితము :- ఉత్సవములు
  • బ్రహ్మోత్సవము
  • వసంతోత్సవము
  • కల్యాణోత్సవము
  • ఇతర వాహనములు
  • శేవలు :
  • అమంత్రణోత్సవము
  • పూలంగిశేవ
  • పులికాపుసేవ
  • పూరాతిరుప్పావడ
  • అరతిరుప్పావడ
  • కోవిలాళ్వారు తిరుమంజనం
  • సహస్రకలశాభిషేకము

7. అధ్యాయము

  • ఆర్జితనివేదన
    • చెరుపులు
    • పళ్లు
  • నిత్య హారతి
  • నిత్య అర్చన
  • శ్రీపాదచందనము
  • శ్రీపాదరేణువు
  • షరాబు
  • ముడుపు
  • చంద్రగిరి రస్తా
  • తిరుమల అంగడివాండ్రు
  • కోతులు
  • శాసనములు
  • భావులు తులసిపుష్పం
  • ఉగ్రాణము
  • జ్వరగాలి
  • నీటివసతి
  • బంగళా
  • తరిగొండ వెంగమ్మ
  • శానిటేసన్
  • శ్రీగోవిందరాజస్వామివారి దేవస్థానం
  • శ్రీరామస్వామివారి దేవస్థానం
  • శ్రీపద్మావతిఅమ్మవారి దేవస్థానం
  • తిరుమల అడవి
  • వాహనములు
  • శివలింగం
  • దేవతలు
  • ముద్రమండపము

8. అధ్యాయము

  • తీర్ధములు
  • శ్రీస్వామిపుష్కరిణి
  • శ్రీవైకుంఠతీర్థము
  • పాండవతీర్థము
  • జాబాలితీర్థము
  • వరాహతీర్థము
  • కుమారధారతీర్థము
  • చక్రతీర్థము
  • ఆకాశగంగ
  • పాపవినాశనము
  • ఘోణతీర్థము
  • రామకృష్ణతీర్థము

9. అధ్యాయము

  • చరిత్ర

ప్రాధాన్యత

తిరుమలై తిరుపతి యాత్ర 1920ల కాలంలోని తిరుమల యాత్రాచరిత్ర కావడంతో దీనికి చాలా చారిత్రిక ప్రాధాన్యత ఉంది. దీనివల్ల ఆ రోజుల్లో సాంఘిక జీవనం, తిరుమల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి. కొండపైన ఆ కాలంలో సాగిన సేవలు, నిబంధనలు వంటివీ, ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న సత్రాలు, అప్పట్లో తిరుమలలో ప్రముఖులు వంటివెన్నో ఈ గ్రంథం తెలియపరుస్తుంది.

బయటి లింకులు

మూలాలు