92,270
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో వర్గం మార్పు) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
}}
'''
===బాల్యం===
[[పశ్చిమ గోదావరి జిల్లా]] [[గుండుకొలను]] గ్రామంలో [[1880]], [[నవంబర్ 24]] న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ఇతని తండ్రి భోగరాజు వెంకట సుబ్రహ్మణ్యం పంతులు గుండుగొల్లు గ్రామ కరణంగా పనిచేసేవాడు. సీతారామయ్యకు ఒక అన్న ఆరుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఇతని నాలుగవయేటనే తండ్రి మరణించడంతో కుటుంబభారం తల్లి గంగమ్మ మీద పడింది. పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆమె తన కుటుంబాన్ని [[ఏలూరు]]కు తరలించింది. ఇతడు తన ప్రాథమిక విద్యను [[ఏలూరు]] లోని మిషన్ హైస్కూలులో చదివాడు. అక్కడ మెట్రిక్యులేషను పూర్తి అయిన తరువాత [[బందరు]]లోని నోబుల్ కాలేజీలో ఎఫ్.ఎ. పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అక్కడ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] కు ఇతడు ప్రియశిష్యుడు. ఉన్నత విద్యకై [[మద్రాసు]] (నేటి [[చెన్నై]]) వెళ్ళి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ 1900లో పొందాడు. ఆ తరువాత ఇతడు మద్రాసులోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎం.బి.సి.ఎం. డిగ్రీ 1905లో సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు<ref name="సాధన">{{cite journal|last1=అడవి|first1=లక్ష్మీ నరసింహారావు|title=డాక్టరు పట్టాభి సీతారామయ్య పంతులు గారి జీవిత సంగ్రహము|journal=శ్రీ సాధన పత్రిక|date=1 February 2017|volume=8|issue=22|pages=2, 10-11|url=http://sreesadhanapatrika.blogspot.in/2017/07/8-22-01-02-1936.html|accessdate=20 July 2017}}</ref>.
[[దస్త్రం:DSC01349.JPG|thumb|right|హైదరాబాద్, కోటిలో.... ఆంధ్రాబాంకు ముందున్న విగ్రహము]]
===గ్రంథకర్తగా===
పట్టాభి రచించిన గ్రంథాలలో '''కాంగ్రెసు చరిత్ర''' (''History of Indian National Congress'') అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెసు చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు. గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటుగా పంజాబు వధలు, ఖద్దరు, స్వరాజ్యము, భారత జాతీయ విద్య<ref name="సాధన" />, మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలను కూడా రచించాడు.<ref>{{cite book|last1=పట్టాభి సీతారామయ్య|first1=భోగరాజు|title=మన నేత పరిశ్రమ|url=https://archive.org/details/in.ernet.dli.2015.394416|accessdate=13 January 2015}}</ref> విలియం టారెన్స్ వ్రాసిన Empire in Asia అనే గ్రంథాన్ని తెలుగు భాషాంతరీకరణ చేశాడు<ref name="సాధన" />.
===పాత్రికేయునిగా===
ఇతడు 1919లో మచిలీపట్నం నుండి జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. ఆ కాలంలో ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలలో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు. ఆ కొరతను తీర్చడానికి ఇతడు జన్మభూమిని ప్రారంభించాడు. ఈ పత్రిక ఇతని సంపాదకత్వంలో 1930 వరకు వెలువడింది. ఈ పత్రికలోని సంపాదకీయ వ్యాసాలు ఇతని ఆంగ్లభాషా నైపుణ్యాన్ని దేశానికి చాటింది<ref name="సాధన" />.
===స్వాతంత్ర్యానంతరము===
[[వర్గం:1880 జననాలు]]
[[వర్గం:1959 మరణాలు]]
[[వర్గం:
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]]
|