కైవారం బాలాంబ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన అన్నదాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11: పంక్తి 11:
[[వర్గం:1944 మరణాలు]]
[[వర్గం:1944 మరణాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన అన్నదాతలు]]

11:53, 26 మే 2019 నాటి కూర్పు

కైవారం బాలాంబ (1849 - 1944) ప్రముఖ అన్నదాత.[1]

ఈమె 1849లో గుంటూరు జిల్లా, అంగలకుదురు గ్రామంలో జన్మించింది. సుబ్బన్నసూరి మరియు వెంకమాంబ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పుడే రామాయణం, భాగవతం వంటి పురాణ గ్రంథాల సారాన్ని గ్రహించారు. కైవారం సుబ్బన్న గారితో వివాహం జరిగి భర్తతో మంగళగిరి అత్తవారింటికి వచ్చారు. అనతికాలంలోనే భర్త మరణించారు. మంగళగిరి నరసింహస్వామిని ఉపాసించి దేవుని సేవలోనే శేషజీవితాన్ని గడిపారు. కొంతకాలం తపస్సు చేసి గ్రామంలో అన్నదానం ప్రారంభించారు. నిరాడంబరత, స్వపరభేదం లేని సమదృష్టి, ప్రశాంత చిత్తం వీరి వ్యక్తిత్వ లక్షణాలు. ఈమె మొదలుపెట్టిన అన్నదానం ప్రజల, దాతల ఆదరణకు నోచుకొని క్రమంగా విస్తృతమై వందలాది మంది భక్తులకు బాటసారులకు అన్నదానం చేసే స్థాయికి ఎదిగింది. మంగళగిరి తిరునాళ్ల సమయంలో వేలాది మంది యాత్రికులు వీరి సత్రంలో భోజనాలు చేసేవారు. 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు.

ఈమె 95 సంవత్సరాల వయసులో 1944 ఆగష్టు 12 తేదీన పరమపదించారు.

మూలాలు

  1. కైవారం బాలాంబ (1849-1944), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 385-6.