మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23: పంక్తి 23:


==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామంలో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
===బ్యాంకులు===
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
ఆంధ్ర బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ బరోడా
ఐసీఐసీఐ బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్
రాయలసీమ బ్యాంక్
కరుర్ వైశ్య బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్

మార్కాపురం లో అందుబాటులో హోటల్స్ ఉన్నాయి

===బందెలదొడ్డి===
===బందెలదొడ్డి===
పూర్వం [[బందెలదొడ్డి]]గా ఉన్న స్థలంలో శ్రీశైలం యాత్రికులకు సత్రం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. బందెల దొడ్డి స్థలాన్ని రెవెన్యూ శాఖ వారు మునిసిపాలిటీకి బద లాయించారని మునిసిపల్ ఛైర్మన్‌ చెబుతున్నారు
పూర్వం [[బందెలదొడ్డి]]గా ఉన్న స్థలంలో శ్రీశైలం యాత్రికులకు సత్రం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. బందెల దొడ్డి స్థలాన్ని రెవెన్యూ శాఖ వారు మునిసిపాలిటీకి బద లాయించారని మునిసిపల్ ఛైర్మన్‌ చెబుతున్నారు

==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
సాగునీటి చెరువు:- ఈ చారిత్రాత్మక చెరువు, 1000 ఎకరాల అధికారిక ఆయకట్టు కలిగియున్నది. ఈ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ నుండి నిధులు కోరగా, ఆ బ్యాంక్ ప్రతినిధి బృందం, ఈ చెరువును, 2017,జులై-10న సమగ్రంగా పరిశీలించినది. [9]
సాగునీటి చెరువు:- ఈ చారిత్రాత్మక చెరువు, 1000 ఎకరాల అధికారిక ఆయకట్టు కలిగియున్నది. ఈ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ నుండి నిధులు కోరగా, ఆ బ్యాంక్ ప్రతినిధి బృందం, ఈ చెరువును, 2017,జులై-10న సమగ్రంగా పరిశీలించినది. [9]

17:53, 1 జూన్ 2019 నాటి కూర్పు

మార్కాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు రెవిన్యూ డివిజన్ కేంద్రము.[1]. పిన్ కోడ్ నం. 523 316 ., ఎస్.టి.డి.కోడ్ = 08596.

గ్రామ చరిత్ర

శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలనలో ఉండినది.

పేరువెనుక చరిత్ర

"కృతయుగే గజారణ్యే, త్రేతాయాం మాధవీపురీ ద్వాపరే స్వర్గసోపానం, కలౌ మారికాపురీ" అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు, కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలుచేవారని అర్థం. మార్కాపురం చెన్నకేశవస్వామివారు అవతరించిన పుణ్యస్థలం. స్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షి రచించిన 'గజారణ్య సంహిత' ద్వారా మనకు తెలుస్తోంది.

కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మారికాపురం' అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే 'మార్కాపురంగా' మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న 'చెన్నరాయుడుపల్లె'కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.[2]

గ్రామ భౌగోళికం

darimadugu rayavaram kocharlakota gobburu kondepalli =సమీప గ్రామాలు=

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

1. అందుబాటులో ప్రయాణికుల కొరకు బస్ స్టాండ్ ఉన్నది జిల్లాలో,రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా బస్ లు ఉన్నాయి 2.మార్కాపురం లో 5 కిలోమీటర్ల పరిధిలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్కాపురం లో ప్రభుత్వ జిల్లా పరిషత్తు పాఠశాల బాలురకు బాలికలకు వేరు వేరుగా అందుబాటులో ఉన్నాయి ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి ప్రైవేటు పాఠశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి. స్థానిక పూల సుబ్బయ్య వీధిలో, 2014,మే-18న, 'చైతన్య కళా స్రవంతీ వారి ఆధ్వర్యంలో "సద్గురు త్యాగరాజ సంగీత కళాశాల" ప్రారంభించెదరు.[3]

గ్రామంలో మౌలిక వసతులు

బ్యాంకులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఐసీఐసీఐ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ రాయలసీమ బ్యాంక్ కరుర్ వైశ్య బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్

మార్కాపురం లో అందుబాటులో హోటల్స్ ఉన్నాయి

బందెలదొడ్డి

పూర్వం బందెలదొడ్డిగా ఉన్న స్థలంలో శ్రీశైలం యాత్రికులకు సత్రం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. బందెల దొడ్డి స్థలాన్ని రెవెన్యూ శాఖ వారు మునిసిపాలిటీకి బద లాయించారని మునిసిపల్ ఛైర్మన్‌ చెబుతున్నారు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

సాగునీటి చెరువు:- ఈ చారిత్రాత్మక చెరువు, 1000 ఎకరాల అధికారిక ఆయకట్టు కలిగియున్నది. ఈ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ నుండి నిధులు కోరగా, ఆ బ్యాంక్ ప్రతినిధి బృందం, ఈ చెరువును, 2017,జులై-10న సమగ్రంగా పరిశీలించినది. [9]

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం

మార్కాపురం లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ముఖద్వారం
  • మార్కాపురములో చెన్నకేశవ స్వామి వారి ఆలయము నకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక పుణ్యక్షేత్రము.

శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది.లక్ష్మీచెన్నకేశవస్వామివారికి ఎడమచేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు.గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుకలోకొచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని 'విజయసూచిక'గా ఆయనే నిలిపారు. పలనాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలున్నాయి. మధ్యరంగం చుట్టు నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం చుంచు, దిగువపాలెం రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్తుతోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన తొమ్మిది అంతస్తులను పూర్తిచేసుకుంది.

చెన్నకేశవస్వామి ఆలయం యొక్క స్థలపురాణం ప్రకారం, గుండికానది (ప్రస్తుతపు గుండ్లకమ్మ నది) తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, విష్ణువుకై తపస్సు చేయగా కేశిని సంహరించడానికి ఆదిశేషున్ని పంపి, అతని విషజ్వాలలతో కేశిని అంతం చేసాడు. ప్రసన్నుడైన విష్ణువు, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి, విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలశారని ప్రతీతి.

శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి. [1] మార్కాపురంలో తర్లుపాడు రహదారిలో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2015,ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారం నాడు, ఆదివారోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైనవి. ఉగాది పర్వదినానికి ముందు నెల (ఫాల్గుణ మాసం) లో వచ్చే ఆదివారాలలో అమ్మవారికి ప్రత్యేక మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని, రజత ఆభరణాలు, పట్టుచీరతో శోభాయమానంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు, వేకువఝామున ఐదు గంటల నుండియే, అమ్మవారి దర్శనానికి బారులుదీరినారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పొయ్యిలలో, మహిళలు పొగళ్ళు వండి, తరువాత, తమను చల్లంగ చూడమని కోరుకుంటూ వీటిని అమ్మవారికి సమర్పించారు. నాగమయ్య దేవతలు, నాగపుట్టల వద్ద భక్తులు పాలు పోసి పూజలు చేసారు. [3]

శ్రీ రామనామ క్షేత్రం

ఈ క్షేత్రం స్థానిక జవహర్^నగర్ లో ఉంది.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

స్థానిక రజకపేటలోని ఈ ఆలయంలో, నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015,మార్చి-4వ తేదీ బుధవారం నాడు, అధివాసహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినరు. వేదపండితులు ఉదయం నుండి వేదపారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన, పంచామృత స్నపనం, నివేదన, శాత్తుమురై, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పరాయణం నిర్వహించారు. [4]

శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

స్థానిక గుండికానదీతీరాన వెలసిన ఈ ఆలయంలో, 2015,మే నెల-10వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి జన్మ నక్ష్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [5]

శ్రీ ఆమలిక లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో 54వ హరే రామనామ వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవాలు, 2017,మార్చి-8వతేదీ బుధవారంతో ముగిసినవి. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసారు. [8]

శ్రీ మార్కండేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ అల్లూరు పోలేరమ్మ ఆలయం

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

స్థానిక కంభం రహదారిలోని నాగులపాటి వీరాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [6]

శ్రీ కుమారాంజనేయస్వామివారి ఆలయం

మార్కాపురం పట్టణంలోని కోనేటివీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, నూతన ధ్వజస్తంభ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ శిలా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం, 2016,ఫిబ్రవరి-25వ తెదీ మాఘ బహుళ తదియ, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం కుంభోద్వాసన, మాహాకుంభ సంప్రోక్షణ, విశ్వరూప దర్శనం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్కాపురం పలకలకు ప్రసిద్ధి. మార్కాపురం వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది.

మూలాలు