డి. కె. అరుణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 39: పంక్తి 39:


[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:గద్వాల]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:నారాయణపేట జిల్లా మహిళా రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
[[వర్గం:జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఎన్నికైన మహిళా శాసన సభ్యులు]]
[[వర్గం:జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ మహిళా శాసన సభ్యులు]]
[[వర్గం:జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రులు]]

04:46, 29 జూన్ 2019 నాటి కూర్పు

డి. కె. అరుణ
డి. కె. అరుణ

నియోజకవర్గం గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-04) 1960 మే 4 (వయసు 63)
ధన్వాడ
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం ముగ్గురు కుమారైలు
నివాసం గద్వాల
మతం హిందూ, రెడ్డి
వెబ్‌సైటు www.dkaruna.com

మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ రాజకీయనేతలలో ప్రముఖురాలైన డి.కె.అరుణ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల నంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి మరియు సోదరుడు ఇదివరకు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, మామ మరియు భర్త గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి, గద్వాల అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ 2004లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ 2009లో రెండో సారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా[1] నియమించబడింది.

బాల్యం, కుటుంబం

డి.కె.అరుణ 1960, మే 4న మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో జన్మించింది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు నారాయణపేటలో నక్సలైట్ల కాల్పులకు గురై మరణించాడు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించాడు. భర్త డి. కె. భరతసింహారెడ్డి, మామ డి. కె. సత్యారెడ్డిలు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.

రాజకీయ జీవితం

డి.కె.అరుణ 1996లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో 3700 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[2] 1998లో కాంగ్రెస్ తరఫున అదే స్థానంలో పోటీచేసి మళ్ళీ పరాజయం పొందింది. ఆ అనంతరం 1999లో గద్వాల శాసనసభ స్థానంలో పోటీచేసి టిడిపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓడిపోయింది. 2004లో కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించింది. 2004లో అరుణకు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం. సమాజ్‌వాదీ పార్టీ తరఫున గెలిచిననూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగింది. దీనితో ఫిబ్రవరి 2007లో సామాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది.[3] 2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినది.[4] గద్వాల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈమెకు వరుసకు అల్లుడు కావడం గమనార్హం. 2009 ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా తరఫున ఇద్దరికి స్థానం లభించగా డి.కె.అరుణకు చిన్నతరహా పరిశ్రమలు, చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలశాఖా మంత్రిపదవి లభించింది.

బయటి లింకులు

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
  2. http://www.dkaruna.com/personal.html
  3. http://www.hindu.com/2007/02/21/stories/2007022108240400.htm
  4. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009