ఉదయకిరణ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా లంకె, మూలాల చేర్చాను
పంక్తి 41: పంక్తి 41:
| 28వ మార్చి 2015 || '' [[చిత్రం చెప్పిన కథ ]]'' || తెలుగు || || మోహన్ ||
| 28వ మార్చి 2015 || '' [[చిత్రం చెప్పిన కథ ]]'' || తెలుగు || || మోహన్ ||
|-
|-
| 11వ ఏప్రిల్ 2013 || ''[[జై శ్రీరామ్ (2013 సినిమా)|జై శ్రీరామ్]]'' || తెలుగు || శ్రీరాం శ్రీనివాస్ || బాలజీ యన్ సాయి ||
| 11వ ఏప్రిల్ 2013 || ''[[జై శ్రీరామ్ (2013 సినిమా)|జై శ్రీరామ్]]''<ref name="Jai Sriram: A clichéd story">{{cite news |last1=The Hindu |first1=Movie Review |title=Jai Sriram: A clichéd story |url=https://www.thehindu.com/features/cinema/cinema-reviews/jai-sriram-a-clichd-story/article4614074.ece |accessdate=11 July 2019 |publisher=Y. Sunita Chowdhary |date=13 April 2013 |archiveurl=https://web.archive.org/web/20130416010542/https://www.thehindu.com/features/cinema/cinema-reviews/jai-sriram-a-clichd-story/article4614074.ece |archivedate=16 April 2013}}</ref> || తెలుగు || శ్రీరాం శ్రీనివాస్ || బాలజీ యన్ సాయి ||
|-
|-
| 2012 || ''[[ఈ పెద్దోళ్ళున్నారే]]'' || తెలుగు || || వీఎన్ఆదిత్య || నిర్మాణంలో
| 2012 || ''[[ఈ పెద్దోళ్ళున్నారే]]'' || తెలుగు || || వీఎన్ఆదిత్య || నిర్మాణంలో

17:29, 11 జూలై 2019 నాటి కూర్పు

ఉదయ్ కిరణ్
2009 నాటి ఉదయ్ కిరణ్
జననం
వాజపేయాజుల ఉదయ్ కిరణ్

(1980-06-26) 1980 జూన్ 26 (వయసు 43)
మరణంజనవరి 6, 2014
వృత్తినటుడు
ఎత్తు5'10

ఉదయ్ కిరణ్ వాజపేయాజుల (జూన్ 26, 1980 - జనవరి 6, 2014) తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.[1]

జీవితం

ఉదయ్ కిరణ్ జూన్ 26 1980హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా [2] కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు[3][4]. ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.[5]

సినీ జీవితం

తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను [6] ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.

ఆత్మహత్య

ఉదయ్ కిరణ్ శ్రీనగర్‌కాలనీలో భార్య విషితతో కలిసి మూడు బెడ్ రూమ్ ఇంటిలో అద్దెకుంటున్నారు. మూడు పడక గదులు కలిగిన ఈ ఇంటిలోని ఓ గదిని వ్యాయామశాలగా మార్చుకున్నారు. 2014 నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఉదయ్ కిరణ్, విషిత 2014 జనవరి 2 న నగరానికి చేరుకున్నారు. ఫేస్‌బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత.. తన సహోద్యోగి, స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి 5 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు. కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా... ఉదయ్ నిరాకరించాడు. దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్‌లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు. తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల, గోవిందరాజన్ వెళ్లిపోయారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయే సరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత... తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు.

ఒంటి గంట ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలోని ప్లాట్‌కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.[7]

శవ పంచనామా

సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించారని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మద్యం సేవించారని నివేదికలో వెల్లడైంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడంతో చార్జిషీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.[8]

సినిమాలు

రిలీజ్ తేదీ చిత్రం పేరు భాష పాత్ర దర్శకుడు వ్యాఖ్యలు
28వ మార్చి 2015 చిత్రం చెప్పిన కథ తెలుగు మోహన్
11వ ఏప్రిల్ 2013 జై శ్రీరామ్[9] తెలుగు శ్రీరాం శ్రీనివాస్ బాలజీ యన్ సాయి
2012 ఈ పెద్దోళ్ళున్నారే తెలుగు వీఎన్ఆదిత్య నిర్మాణంలో
2012 దిల్ కబాడీ తెలుగు శ్రీ
20వ ఏప్రిల్ 2012 నువ్వెక్కడుంటే నేనక్కడుంటా తెలుగు హరి శుభసెల్వం
3వ జూన్ 2010 పెన్ సింగం తమిళం సూర్య బలి శ్రీరంగం తెలుగులో అల్లడిస్తాగా డబ్ అయింది
7వ నవంబరు 2008 ఏకలవ్యుడు తెలుగు కార్తీక్ కే రామకృష్ణ
12వ సెప్టెంబరు 2008 గుండె ఝల్లుమంది తెలుగు బాల్రాజు (రాజేశ్) మదన్
29వ ఫిబ్రవరి 2008 వంబు సందయి తమిళం ప్రభాకర్ రాజ్ కపూర్ లక్ష్మీ పుత్రుడుగా తెలుగులో డబ్ అయింది
1వ నవంబరు 2007 వియ్యాలవారి కయ్యాలు తెలుగు వంశీ ఈ. సత్తిబాబు
23వ డిసెంబరు 2006 పోయి తమిళం కంబన్/వేమన కే.బాలచందర్ అబద్ధంగా తెలుగులోకి డబ్ అయింది
6వ ఏప్రిల్ 2005 ఔనన్నా కాదన్నా తెలుగు రాం మోహన్ తేజ
5వ ఫిబ్రవరీ 2004 లవ్ టుడే తెలుగు శివ అర్పుధన్
15వ ఆగస్టు 2003 నీకు నేను నాకు నువ్వు తెలుగు ఆనంద్ రాజశేఖర్
17వ మార్చి 2003 జోడీ నం.1 తెలుగు గౌతం ప్రతాని రామకృష్ణ గౌడ్ కొన్ని సన్నివేశాలలో స్త్రీ వేషం వేస్తాడు
1వ నవంబరు 2002 నీ స్నేహం తెలుగు వేణు మాధవ్ పరుచూరి మురళి
30వ ఆగస్టు 2002 హోళీ తెలుగు కిరణ్ ఎస్వీఎన్ వరప్రసాద్
21వ జూన్ 2002 శ్రీరామ్ తెలుగు శ్రీరాం వీఎన్ ఆదిత్య
8వ ఫిబ్రవరీ 2002 కలుసుకోవాలని తెలుగు రవి రఘు రాజ్
19వ అక్టోబరు 2001 మనసంతా నువ్వే తెలుగు చంటి/వేణు వీఎన్ ఆదిత్య
10వ ఆగస్టు 2001 నువ్వు నేను తెలుగు రవి తేజ
17వ జూన్ 2000 చిత్రం (సినిమా) తెలుగు రమణ తేజ

బిరుదులు

  • ఫిలింఫేర్ ఉత్తమ కథానాయకుడు (తెలుగు) - నువ్వు నేను (2001) కు గానూ

మూలాలు

  1. నేను నటుడిగా ప్రతిచోటకి చేరాలి.. ఉదయ్ కిరణ్, 25 జూన్ 2008న టోటల్ టాలీవుడ్ ఇంటర్వ్యూ తెలుగు రూపం
  2. "Uday Kiran gets engaged to Chiru's daughter today". timesofindia.com. 2013-04-18.
  3. "Incompatibility hits star wedding". timesofindia.com. 2013-07-01.
  4. "Marriage is not a priority now: Uday Kiran". sify.com.
  5. http://www.thehindu.com/news/cities/Hyderabad/uday-kiran-suicide-enter-woman-financier/article5554587.ece
  6. నువ్వు నేను సినీ సమీక్ష (ఆంగ్లం)
  7. "Actor Uday Kiran commits suicide". TimesOfIndia. 2014-01-07. Retrieved 2014-01-13.
  8. http://www.thehindu.com/news/cities/Hyderabad/uday-kirans-death-evidence-points-to-suicide/article5550132.ece
  9. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.

బయటి లంకెలు