Coordinates: 10°48′N 79°09′E / 10.8°N 79.15°E / 10.8; 79.15

తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో వర్గం మార్పు, replaced: Infobox Indian Jurisdiction → భారత స్థల సమాచారపెట్టె
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{భారత స్థల సమాచారపెట్టె |
{{Infobox Indian Jurisdiction |
native_name = తంజావూరు |
native_name = తంజావూరు |
type = city |
type = city |

09:19, 20 జూలై 2019 నాటి కూర్పు

  ?తంజావూరు
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 10°48′N 79°09′E / 10.8°N 79.15°E / 10.8; 79.15
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
36 కి.మీ² (14 చ.మై)
• 57 మీ (187 అడుగులు)
జిల్లా (లు) తంజావూరు జిల్లా
జనాభా
జనసాంద్రత
2,15,725 (2001 నాటికి)
• 7,700/కి.మీ² (19,943/చ.మై)
పురపాలక సంఘ ఛైర్మన్ థేన్‌మొయి జయబాలన్[1]
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 613 001 నుండి 009 వరకు
• +914362
• TN 49

తంజావూరు దక్షిణ భారత దేశము లోని తమిళనాడు రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ పట్టణము కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణము రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.

చూడవలసిన ప్రదేశాలు

బృహదీశ్వరాలయం

తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి బృహదీశ్వరాలయమునకు ప్రసిద్ధి. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశములలో ఈ దేవాలయము కూడా ఉంది. ఈ దేవాలయములో సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవుడు.

ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత సరస్వతీ మహల్‌ గ్రంథాలయము ఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.

సంస్కృతి

భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా కర్నాటక సంగీతానికి చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, తంజావూరు బొమ్మలు, తవిల్‌ ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో తమిళ సంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.

చరిత్ర

చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రము. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజు నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.

భౌతిక వివరణలు

ఈ నగరము తమిళనాడు లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో తమిళులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.

ఉద్యోగాలు

ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ ఉన్న నలభైకిపైబడిన మెడికల్‌ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను కూడా చూడ వచ్చు.

భౌగోళికంగా

నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రము, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రము. ఈ జిల్లా సరిహద్దులుగా 'వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ ఉన్నాయి.

విద్యా కేంద్రముగా

తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రముగా వెలుగొందుతున్నది. తంజావూరులో రెండు యూనివర్సిటీలు ఉన్నాయి.

ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి.

మూలాలు

మూలాలు

వెలుపలి లింకులు

మూస:తమిళనాడులోని జిల్లాలు

"https://te.wikipedia.org/w/index.php?title=తంజావూరు&oldid=2693720" నుండి వెలికితీశారు