"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా చరిత్ర]]''')
 
1921లో మచిలీపట్నానికి చెందిన [[రఘుపతి వెంకయ్య]], తనకుమారుడు [[ఆర్.ఎస్.ప్రకాష్]] [[దర్శకత్వం]], నటనలో [[భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా)|భీష్మ ప్రతిజ్ఞ]] అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో [[హిందీ]] (అలం అరా), [[తెలుగు]] (భక్త ప్రహ్లాద), [[తమిళ]] (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథి[[హెచ్.ఎమ్.రెడ్డి]]. [[సురభి నాటక సమాజం]] వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన [[భక్త ప్రహ్లాద]] తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సినిమా [[1932]] [[జనవరి 22]]న సెన్సార్ జరుపుకొని, [[1932]] [[ఫిబ్రవరి 6]]న బొబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ లో విడుదలైంది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదలైంది.
1931నుండి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటూ పురోగమిస్తున్నది.
 
1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా [[భక్త ప్రహ్లాద]]తో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2704717" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ