"జొరాస్ట్రియన్ మతము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==చరిత్ర==
జొరాస్త్ర మతము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్తర్ (Zoroaster) అను ప్రవక్త. ఆర్యుల తెగలకు చెందిన ఈ [[ప్రవక్త]] జీవించిన కాలము తెలియరాకున్నది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .
 
ఆర్యుల సమాజంలో బహు విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఉండేవి. యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు [[స్వప్నం]]<nowiki/>లో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా [[దేవుడు]] ఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన [[బోధన]]<nowiki/>లతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను [[పెళ్ళి|వివాహం]] చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, [[పర్షియా]] సామ్రాజ్యానికి జరిగిన [[యుద్ధం]]<nowiki/>లో ట్యురాన్ దేశపు [[రాజు]] చేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు [[రక్షకులు]] కన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు <ref>The Zoroastrian Origins of Judaism, Christianity, and Islam - by Darrick T. Evenson.</ref> .
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2732568" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ