జొరాస్ట్రియన్ మతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9: పంక్తి 9:
జొరాస్త్ర మతము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్తర్ (Zoroaster) అను ప్రవక్త. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .
జొరాస్త్ర మతము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్తర్ (Zoroaster) అను ప్రవక్త. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .


ఆర్యుల సమాజంలో బహు విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఉండేవి. యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు [[స్వప్నం]]<nowiki/>లో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా [[దేవుడు]] ఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన [[బోధన]]<nowiki/>లతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను [[పెళ్ళి|వివాహం]] చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, [[పర్షియా]] సామ్రాజ్యానికి జరిగిన [[యుద్ధం]]<nowiki/>లో ట్యురాన్ దేశపు [[రాజు]] చేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు [[రక్షకులు]] కన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు <ref>The Zoroastrian Origins of Judaism, Christianity, and Islam - by Darrick T. Evenson.</ref> .
యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు [[స్వప్నం]]<nowiki/>లో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా [[దేవుడు]] ఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన [[బోధన]]<nowiki/>లతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను [[పెళ్ళి|వివాహం]] చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, [[పర్షియా]] సామ్రాజ్యానికి జరిగిన [[యుద్ధం]]<nowiki/>లో ట్యురాన్ దేశపు [[రాజు]] చేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు [[రక్షకులు]] కన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు <ref>The Zoroastrian Origins of Judaism, Christianity, and Islam - by Darrick T. Evenson.</ref> .


==చీలికలు ==
==చీలికలు ==

10:26, 18 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

ఫరావహర్, జొరాస్ట్రియన్ మతస్థుల మతపరమైన చిహ్నం
దస్త్రం:An Image from Zarathustra.jpg
జొరాస్త్రమతం

జొరాస్ట్రియన్ మతము (ఆంగ్లం : Zoroastrianism) ఈ మతముము "మజ్దాఇజం" అనికూడా అంటారు. జొరాస్త్ర మతము (Zoroastrianism) అనేది ఇరాన్ (పూర్వపు పర్షియా) దేశానికి చెందిన ఒక మతము. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈమతములో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతము ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయిలో ఎక్కువగా నివసిస్తున్నారు.

జొరాస్త్ర మతమును అనుసరించే వారిని జొరాస్త్రీయన్లు అని అంటారు. ఈ మతము క్రైస్తవ మతములకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్త్రీయన్ల మత గ్రంథమైన అవెస్త (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).

చరిత్ర

జొరాస్త్ర మతము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్తర్ (Zoroaster) అను ప్రవక్త. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .

యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు స్వప్నంలో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా దేవుడు ఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, పర్షియా సామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజు చేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు రక్షకులు కన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు [1] .

చీలికలు

జొరాస్తర్ జీవించిన కాలంలో ఆకాశం, రాళ్ళు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, నదులు, సముద్రాల ఘోష, మరణం, అగ్ని, సమాధులు - ఇవన్నీ విగ్రహాల రూపాలు దాల్చాయి. కాలక్రమేణా ఇండో-ఆర్యన్ తెగల్లో చీలికలు వచ్చాయి. దానితో వారు ఒకే దేవుడిని ఆరాధించే వారిగా (Monotheists) మరియు అనేక దేవుళ్ళను ఆరాధించేవారిగా (Polytheists) చీలిపోయారు. ఫలితంగా ఒకే దేవుడిని ఆరాధించే శాఖ వారు మాత్రం అక్కడే స్థిరపడి ప్రవక్త జొరాష్టర్ చెప్పిన సిద్దాంతాలు ఆచరించారు.[2][3]

అవెస్త

జొరాస్త్రీయన్లు చదివే అవెస్త గ్రంథమునకు, భారతీయ వేదాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవెస్త గ్రంథము - యశ్న (worship), గాత (Psalms), వెందిదాద్ (law against demons), యస్త (worship hymns), కోర్ద అవెస్త (litanies and prayers) అను ఐదు భాగాలుగా విభజించబడింది. ఈ గ్రంథము గ్రీకు వీరుడైన అలగ్జాండర్, అరబ్బులు వంటి శత్రుదేశ రాజుల ఆక్రమణలవల్ల అవెస్త చాలా వరకూ నాశనమైయ్యింది . నేడు గ్రంథములో కొంత భాగం మాత్రమే మిగిలియున్నది.[4] కన్నడ భాష తెలుగు భాషకు దగ్గరగా ఉన్నట్టు అవెస్తలో ఉపయోగించిన భాష కూడా సంస్కృత భాషకు చాలా దగ్గరగా ఉంటుంది.

దేవాలయాలు

జొరాస్త్రీయన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రీయన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ (Herodotus) జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. అవే అగ్ని దేవాలయాలు (Fire Temples). నేడు అగ్ని దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారత దేశం లోను మిగిలియున్నాయి.

నమ్మకాలు

  • జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం సృష్టి కర్త అహుర మాజ్డా. ఇతడు సత్యము, వెలుగు, పరిశుద్ధత, క్రమము, న్యాయము, బలము, ఓర్పుకు గుర్తు.
  • ప్రపంచం మంచికి చెడుకి మధ్య యున్న యుద్ధ భూమి. అందువల్ల ప్రతి మనుష్యుడు దుష్టత్వం నుండి దూరంగా ఉండుట ద్వారా తన ఉనికిని కాపాడుకొని, మత ఆచారాల ద్వారా పరిశుద్ధపరచుకోవాలి.
  • జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం దేవుడు తన నుండి దృశ్యమైన ప్రపంచాన్ని మరియు అదృశ్యమైన ప్రపంచాన్ని సృష్టించాడు. కనుక సృష్టిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి మానవుడి బాధ్యత.
  • దేవుడు ఆత్మ స్వారూప్యాలను మొదటగా సృష్టించాడు. అగ్ని, నీరు, గాలి, మట్టి, మొక్కలు, జంతువులు, మనుష్యులు కలిగియున్న ప్రపంచము దేవుని శరీరమువలే యున్నది. అయితే ఆయన ఆత్మ ఎల్లప్పుడూ సృష్టిని సంరక్షించుకొనుచున్నది. ఆది మానవుడినుండి సంరక్షణా దూతలను, మష్యె (Mashye), మష్యానె ( Mashyane) అను మొదటి స్త్రీ పురుషులను సృష్టించాడు దేవుడు. ఈ స్త్రీ పురుషుల నుండియే సమస్త మానవ జాతి ఆవిర్భవించింది.
  • దేవుని సులక్షణాలను ప్రతిబంబించే మరియు భౌతిక ప్రపంచంలో దుష్టుడితో పోరాడటంలో దేవునికి సాయపడే దైవ స్వరూపాలు ఉంటాయి. వీటిలో గొప్పవైన ఆరు అమరమైన స్వరూపాలు లేక అమేష స్పెంతాస్. ఇంకా దేవ దూతలు వగైరా ఉంటాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అర్పణలతో కూడిన యజ్ఞాలు, ప్రార్థనలు చేస్తారు.
  • మనిషి సహజంగా దైవ స్వరూపం కలిగి దైవ లక్షణాలు కలిగియుంటాడు. మనుష్యులకు రెండు అవకాశాలుంటాయి - ఒకటి నీతిగా ఉండి దేవుడి బోధనలు పాటించడం, రెండవది దుష్టత్వాన్ని పాటించి నాశనమవ్వడం. మనిషి ఎంచుకొన్న మార్గాన్ని బట్టి దేవుడు ఆ మనుష్యుని ఖర్మను నిర్ణయిస్తాడు. పాప ప్రాయిశ్చిత్తం చేసుకొనే విధానం గురించి, సత్ప్రవర్తన గురించి దేవుడు విజ్ఞానాన్ని ఇస్తాడు. కాని తనను ఆరాధించేవారు చేసిన పాపాలను మోయడు.
  • దేవుడు భౌతిక ప్రపంచం సృష్టించక ముందే ఆత్మీయ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆత్మీయ ప్రపంచం దుష్టశక్తికి అతీతమైనది. భౌతిక ప్రపంచం ఎప్పుడూ దుష్టుడి ఆక్రమణకి గురవ్వుతూవుంటుంది ఎందుకనగా దుష్టుడు అక్కడ నివాసమేర్పరచుకొన్నాడు. కనుక మనుష్యులు తమకు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించాలి. వాటివైపు వెళ్ళకూడదు. అగ్ని, నీరు, భూమి, గాలి - వీటిని దుష్ట స్వరూపాలు లోపలికి వెళ్ళి కాలుష్యం చేయకుండా కాపాడాలి. మృత దేహాలను ఖననం చేయకూడదు, పాతిబెట్టకూడదు, నీటిలో పడవేయకూడదు. రాబందులకు, ఇతర పక్షులకు ఆహారంగా వేయాలి.
  • జొరాస్త్ర మతము ప్రవక్త అయిన జొరాస్తర్ బోధనలపై ఆధారపడియున్నది. ఒక కథ ప్రకారం దేవుడే స్వయంగా జరాతుస్త్రకు దర్శనమిచ్చి సృష్టి రహస్యాలను, సన్మార్గంలో పయనించడానికి మానవులు పాటించవలసిన నియమాలను తెలిపాడు. జొరాస్తర్ బోధనలు జెండ్ అవెస్తా (Zend Avesta) లో దొరకుతాయి. జొరాస్త్రీయన్లు జరతుస్త్ర పుట్టుక 3000 సంవత్సరాల పాటూ సాగే సృష్టి చక్రం ఆరంభాన్ని తెలియజెప్పిందని నమ్ముతారు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. జొరాస్తర్ కుమారుడైన షోశ్యాంత్ (మూడవ ప్రవక్త) తీర్పు దినాన్ని, భౌతిక ప్రపంచంలో దుష్ట శక్తుల సంహారం గురించి ప్రవచిస్తాడు.
  • జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం మరణము అనేది ఆత్మ శరీరంలోంచి బయటకు వెళిపోవడం వల్ల సంభవిస్తుంది, ఆపై శరీరం అపవిత్రమైపోతుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వెడలిన తరువాత 3 రోజులవరకూ ఆ శరీరం వద్ద తిరుగుతూ తరువాత దేనా అనే ఆత్మ సాయంతో ఆత్మీయ లోకానికి వెళ్ళిపోతుంది. అక్కడున్న దేవ దూత విచ్చేసిన ఆత్మ అంతిమతీర్పు దినానికి ముందు తాత్కాలికంగా స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయిస్తుంది. జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం అంతిమ తీర్పు దినములో దేవుడు మరణించిన ఆత్మలను లేపి రెండవసారి విచారణకు సిద్ధం చేస్తాడు. అన్ని మంచి ఆత్మలు స్వర్గంలో శాశ్వత స్థానాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నిత్య జీవం పొందేవరకూ తాత్కాలికంగా శిక్షలు పొందుతాయి. కొంతమంది జొరాస్త్రీయన్లు దైవ నిర్ణయం ప్రకారం ఆత్మలు పొరపాట్లను అధికమించి, సిద్దిత్వం పొందాలని భూమ్మీదే జన్మిస్తాయని, కనుక ఆత్మలు తమ వ్యక్తిత్వాన్ని శుద్ధీకరించుకోవడానికి, వెలుగుమయం చేసుకోవడానికి ఆత్మలకు భూమ్మీద జీవనం ఒక అవకాశమని నమ్ముతారు. జొరాస్త్రీయన్ పుస్తకాలు స్వర్గాన్ని సంపూర్ణ సంతోషకరమైన ప్రదేశమని, దేవుని వెలుగుతో అలంకరించబడినదని; నరకాన్ని పాపపు అత్మలు శిక్షలు పొందే శీతలమైన, చీకటియన ప్రదేశంగా చెబుతాయి.
  • దుష్ట శక్తి వల్ల భూమ్మీద జీవనం ప్రమాదంతో కూడియున్నదని జొరాస్త్రీయన్లు నమ్ముతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవడము వల్ల కాదు కాని, జొరాస్తర్ చెప్పిన మూడు ఆజ్ఞలు (మంచి ఆలోచన, మాటలు, మంచి కార్యాలు) పాటించకపోవడం వల్ల మనుష్యులు వ్యభిచారము, దొంగతనము, పంచభూతాలను మలినం చేయడం, ఇతర నమ్మకాలను ఆచరించడం, చనిపోయిన వాటిని తొలగించకపోవడం, చనిపోయినవాటిని ముట్టుకోవడం, దేవుడిని ప్రార్థనలు - యాగాలు చేయకపోవడం, దెయ్యాలను ఆరాధించడం, కుస్తీ ధరించకపోవడం, పై వస్త్రం ధరించకపోవడం, దురుద్దేశ్యంతో వ్యాపారం చేయడం, లేఖనాల్లో చెప్పినట్లు వివాహం చేసుకోకపోవడం వంటి అనేక పాపాలు చేస్తారు.
  • ప్రతీ 3000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు సమస్త దుష్ట శక్తులను అంతం చేసి తీర్పు దినాన్ని ప్రకటిస్తాడు, అన్ని ఆత్మలను లేపి రెండవసారి విచారణకు గురిచేస్తాడు. ఆ విచారణలో విధేయులైన ఆత్మలు స్వర్గంలో నిత్యజీవాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నరకంలో నిత్య శిక్షలకు గురవుతాయి.
  • జొరాష్ట్రియన్లు కూడా హిందువులవలే దేవునితో సంభాషించడానికి యజ్ఞాలు నిర్వహిస్తారు. వీటినే యస్నాలు అని అంటారు. మానవాళి కోసం నిర్వహించే ఈ యజ్ఞాలను అనుభవజ్ఞులైన పూజారులు తమ అగ్ని దేవాలయంలో అవెస్తాలో వాక్యములు / మంత్రాలు చదువుతూ చేస్తారు. జొరాస్త్రీయన్లు తమ దేవాలయాల్లో రోజుకి ఐదు సార్లు పూజలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా నాజోత్ అనే ఉపనయన తంతును బాలురకు, బాలికలకు నిర్వహిస్తారు. నాజొట్ ను ఎవరికైనా జోరాస్త్ర మార్గంలో ప్రయాణం సాగించే ముందు చేస్తారు.

సూక్తులు

  • అపకీర్తి, కుటిలత్వము రాకుండునట్లు, అబద్దమాడకుము [5]
  • అసూయ దెయ్యము నీ వైపు చూడకుండునట్లు, ప్రపంచపు నిధి ప్రీతికరముగా లేకుండునట్లు నీవు ఆశ కలిగియుండకుము.
  • ఆవేశపడకుము, ఎందుకనగా ఆవేశము వచ్చినప్పుడు బాధ్యతలు, మంచికార్యాలు మరుగున పడును, ప్రతి పాపము ఆలోచనలోకి వచ్చును.[6]
  • ఆందోళన పడకుము, ఎందుకనగా ఆందోళన ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అధికమించును.
  • హాని, పశ్చాతాపము నీ వద్దకు రాకుండునట్లు, మోహపడకుము.
  • చేవలసిన పని పూర్తి కాకుండా ఉండునట్లు సోమరితనమును చేరనీయకుము.
  • చక్కని గుణములు కలిగిన భార్యను ఎంచుకొనుము
  • కలిగియున్న సంపదను బట్టి గర్వించకుము, ఎందుకనగా ఆఖరిలో అన్నింటినీ వదిలేయాల్సిందే.

ప్రస్తుత స్థితి

2004 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రీయన్ల సంఖ్య 1,45,000 నుండి 2,10,000 వరకూ ఉంది. .[7][8] 2001 భారత్ జనగణన ప్రకారం 69,601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రీయన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము (ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉంది. భారత దేశంలో జోరాస్త్ర మతమునకు పార్శీ మతమనికూడా పేరు.

ప్రముఖ పార్శీలు

మూలాలు

  1. The Zoroastrian Origins of Judaism, Christianity, and Islam - by Darrick T. Evenson.
  2. The Teachings of Zoroaster, by S.A. Kapadia, [1905], at sacred-texts.com
  3. Zoroastrian Heritage - Author: K. E. Eduljee
  4. Zorostrian Scriptures - Presentation at North American Mobed Council - July 30, 2005 – New York
  5. Vedic Elements in the Ancient Iranian Religion of Zarathushtra by Subhash Kak
  6. Vedic Elements in the Ancient Iranian Religion of Zarathushtra by Subhash Kak
  7. Melton 1996, p. 837.
  8. cf. Elidae & Couliano 1991, p. 254.
మూలాలు

ఇంకా చదవండి

బయటి లింకులు