"గంధం నాగరాజు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: కధారచయితగా, నవలాకారుడిగా, నాటక రచయితగా గంధం నాగరాజు తెలుగు సాహ...)
 
కధారచయితగా, నవలాకారుడిగా, నాటక రచయితగా గంధం నాగరాజు తెలుగు సాహిత్యానికి సుపరిచితుడు. పసిడిలంక, స్థితప్రజ్ఞ వంటి నవలలు, అపరాజిత, ప్రియాంక, తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క వంటి కథలు, ఆలోచించండి, సత్యాగ్రహి, పాదుకాస్వామ్యం, చదువు, శేషార్ధ్హం, నోట్ దిస్ పాయింట్ వంటి నాటికలు వలస, రంగులరాట్నం వంటి నాటకాలు రాశాడు. ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కధలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.
రాగం చిత్రానికి అనువాదకునిగాసహ రచయితగా తెలుగు సినీ రంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు గమ్యం చిత్రం మలి అడుగు.
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నాగరాజు సుప్రసిద్ధ కథారచయిత గంధం యాజ్ఞవల్క్య శర్మ కుమారుడు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/274729" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ