సెయింట్ పాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 106.200.190.52 (చర్చ) చేసిన మార్పులను Rajeshnittala చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 21: పంక్తి 21:
{{Reflist|24em}}
{{Reflist|24em}}


[[వర్గం:క్రైస్తవ మత
[[వర్గం:క్రైస్తవ మతము]]
ము]]

01:27, 15 అక్టోబరు 2019 నాటి కూర్పు

అపోస్తలుడైన పౌలు (Latin: Paulus; Greek: Παῦλος, romanized: Paulos; Coptic: ⲡⲁⲩⲗⲟⲥ; c. 5 – c. 64 or 67), పరిశుద్ధుడైన పౌలుగా కూడా ప్రసిద్ధి చెందిన మరియు యూదు పేరైన తార్సు వాడైన సౌలుగా (Hebrew: שאול התרסי‎, romanized: Sha'ūl ha-Tarsī; Greek: Σαῦλος Ταρσεύς, romanized: Saũlos Tarseús) [1][2][3] కూడా పిలువబడిన ఒక అపోస్తలుడు (12 మంది క్రీస్తు శిష్యులలో ఒకడు కాకపోయినప్పటికిని).  

అపోస్తలుల యుగములో ప్రముఖుడుగా .[4] పరిగణించబడిన ఈయన క్రీస్తు సువార్తను మొదటి శతాబ్ధములో విరివిగా ప్రకటించి, క్రీ.శ.(AD) 30 - 50[5][6] మధ్యలో చిన్న ఆసియా ఐరోపాలలో అనేక క్రైస్తవ సంఘములను స్థాపించాడు. యూదునిగా మరియు రోమా పౌరసత్వము కలిగి ఉండుట అను విశిస్ఠ అర్హతలను ఆధారము చేసుకొని యూదులు మరియు రోమా పౌరుల మధ్యలో విస్తృతమైన పరిచర్య చేసాడు.


బైబిల్ లోని  నూతన నిబంధనలోని అపోస్తలుల కార్యములు(8,9 అధ్యాయములు) అను పుస్తకములో ప్రస్తావించబడిన రీతిగా,  పౌలుకు క్రీస్తు దర్షనము కలుగక ముందు (తన హ్రుదయ మార్పునకు ముందు) యెరుషలేములో  ఇంటింట జొచ్చి, క్రీస్తు శిష్యులైన పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను. దమస్కు లోని క్రీస్తు శిష్యులను బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు యెరూషలేము నుండి దమస్కుకు [7] వెళ్ళుచున్న మార్గములో క్రీస్తు ఒక గొప్ప వెలుగులో అతనికి ప్రత్యక్షమయ్యెను. పౌలు తన చూపు కోల్పోయి, తిరిగి 3 రొజుల తర్వాత అననీయ అను క్రీస్తు శిష్యుడు ప్రార్ధింపగా దృష్టి పొందెను. అటు తర్వాత పౌలు నజరేయుడైన యేసే యూదులు ఎదురుచూస్తున్న మెస్సీయా అనియు ఆయన దేవుని కుమారుడనియు ప్రకటించుట మొదలు పెట్టెను.[8] అపోస్తలుల కార్యములు పుస్తకములో ఇంచుమించు అర్ధభాగము పౌలు యొక్క జీవితమును మరియు ఆయన పరిచర్యను గూర్చి వ్రాయబడెను.


బైబిల్ లోని  నూతన నిబంధనలోని 27 పుస్తకములలో 13 పుస్తకములు పౌలు గారిచే వ్రాయబడినవిగా క్రైస్తవ పండితులు గుర్తించారు. అందులో 7 పత్రికలు పౌలు రచనలుగా అందరు క్రైస్తవ పండితులు అంగీకరించగా, మిగిలిన 6 పత్రికలను గూర్చి క్రైస్తవ పండితులలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికిని  అధికులు మాత్రము పౌలు రచనలుగానే గుర్తించారు. కొంతమంది క్రైస్తవ పండితులు ఈ 6 పత్రికలు పౌలు గారి పేరు మీద ఆయన యొక్క పూర్వ ప్రతులను ఉపయోగించి ఆయన అనుచరులు వ్రాసినవిగా విశ్వసిస్తారు.[4][5] [9] మరి కొంతమంది పండితులు అవి పూర్తిగా వేరే తెలియని రచయిత రాసినవి అని అంటారు, కానీ ఆ వాదనలు చాల సమస్యలు  సృష్టించినవి[10]. పౌలు యొక్క రచనగా హెబ్రీయులకు[11]  వ్రాసిన పత్రికలో ఎక్కడా ప్రస్థావించబడకపోవుట వలన మరియు స్పష్టమైన సమాచారము లేకపోవుట వలన 2వ మరియు 3వ శతాబ్ధములలో[12] ఇది పౌలు పత్రికగా గుర్తించబడనప్పటికిని, 5 నుండి 16 వ శతాబ్ధము వరకు ఈ పత్రిక పౌలు 14వ రచనగానే అధికులు విశ్వసించారు.  కానీ అప్పటి నుండి ఇప్పటివరకు క్రైస్తవ పండితులు మాత్రము ఇది గుర్తు తెలియని రచయితచే వ్రాయబడిన పత్రికగానే పరిగణించుచున్నారు .[13]


ఈ రోజుల్లో, పశ్చిమ ప్రొటెస్టెంట్ & లాటిన్ సంప్రదాయాల మరియు తూర్పు ఆర్థొడాక్ష్ & ఈస్ట్రన్ కాథొలిక్ సంప్రదాయాల వేదాంత విధ్య, ఆరాధన మరియు కాపరి యొక్క జీవితములలో పౌలు గారి యొక్క పత్రికలు కీలక భూమిక పోషిస్తున్నాయి.   క్రైస్తవ విశ్వాసమును వ్యాప్తి చేయుచున్నటువంటి అపోస్తలులు మరియు మిషనరీల మధ్యలో పరివ్యాప్తి చెందినటువంటి క్రైస్తవ అలోచనా ధోరణి మరియు ఆచరణాత్మకమైన వ్యక్తిత్వము పౌలు గారి బోధనల ప్రభావమే.  మార్టిన్ లూధర్ యొక్క పౌలు రచనల వ్యాఖ్యానము, లూధర్ సిద్ధాంతము అయిన sola fide ను ప్రభావితము చేసింది.  

References

Citations

  1. "Saint Paul, the Apostle, original name Saul of Tarsus from Encyclopædia Britannica Online Academic Edition". global.britannica.com. Retrieved 12 August 2016.
  2. "Why did God change Saul's name to Paul?". Catholic Answers. Retrieved 31 August 2014.
  3. Acts 9:11 This is the place where the expression "Saul of Tarsus" comes from.
  4. 4.0 4.1 Powell, Mark A. Introducing the New Testament.
  5. 5.0 5.1 Sanders, E. P. "Saint Paul, the Apostle".
  6. "The Canon Debate", McDonald & Sanders editors, 2002, chapter 32, page 577, by James D. G. Dunn: "James, the brother of Jesus, and Paul, the two other most prominent leading figures (besides Peter) in first-century Christianity"
  7. Acts 8:1 "at Jerusalem"; Acts 9:13 "at Jerusalem"; Acts 9:21 "in Jerusalem"; Acts 26:10 "in Jerusalem".
  8. Acts 9:20 And straightway he preached Christ in the synagogues, that he is the Son of God.
  9. Paul's undisputed epistles are 1st Thessalonians, Galatians, 1st and 2nd Corinthians, Romans, Philippians, and Philemon.
  10. Carson, D.A.;Moo, D.G. An Introduction to the New Testment.
  11. The New Jerome Biblical Commentary, publ.
  12. Tertullian knew the Letter to the Hebrews as being "under the name of Barnabas" (De Pudicitia, chapter 20 where T. quotes Heb. 6:4-8); Origen, in his now lost Commentary on the Epistle to the Hebrews, is reported by Eusebius (Hist.
  13. Chapman, Geoffrey (1989). The New Jerome Biblical Commentary. pp. 920 column 2 (Chapter 60). That Paul is neither directly nor indirectly the author is now the view of scholars almost without exception. For details, see Kümmel, I[ntroduction to the] N[ew] T[estament, Nashville, 1975] 392-94, 401-3