ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారతదేశంలోని కోటలు ను తీసివేసారు; వర్గం:భారతదేశ కోటలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
Fixed mistakes
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 35: పంక్తి 35:


దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్‌ మహల్‌ మ్యూజియం, మోతీమజీద్‌, రంగ్‌మహల్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. 'బ్లడ్‌ పెయింటింగ్స్‌' మ్యూజియం, పురావస్తు [[మ్యూజియం]], యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి.
దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్‌ మహల్‌ మ్యూజియం, మోతీమజీద్‌, రంగ్‌మహల్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. 'బ్లడ్‌ పెయింటింగ్స్‌' మ్యూజియం, పురావస్తు [[మ్యూజియం]], యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి.

I dont know


== చిత్రమాలిక ==
== చిత్రమాలిక ==

18:31, 16 డిసెంబరు 2019 నాటి కూర్పు

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఎఱ్ఱ కోట
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
ఢిల్లీ కోటనే ఎర్ర కోట అని కూడా పిలుస్తారు.
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంii, iii, iv
మూలం231
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్
శిలాశాసన చరిత్ర
శాసనాలు2007 (31వది సమావేశం)

'ఎర్ర కోట (ఆంగ్లం : Red Fort లేదా Lal Qil'ah, లేదా Lal Qila) (హిందీ: लाल क़िला, ఉర్దూ: لال قلعہ ) ఢిల్లీలో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనముగా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన ఉంది.

ప్రధాన చిత్రము

ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;

  • దీవాన్ ఎ ఆమ్
  • దీవాన్ ఎ ఖాస్
  • నూరే బెహిష్త్
  • జనానా
  • మోతీ మస్జిద్
  • హయాత్ బక్ష్ బాగ్

భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటి... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు... మన ఏడు వింతల్లో ఒకటి... స్వాతంత్య్ర సంబరాలకు చిహ్నం... అదే ఢిల్లీలోని ఎర్రకోట!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారని తెలుసుగా? టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేసే ఆ సంబరాలు జరిగేదెక్కడో తెలుసా? ఎర్రకోటలో. అక్కడి నుంచే ప్రధాని మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఎర్రకోట వివరాలేంటో తెలుసుకుందామా?

'ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే... ఇదే...' అనే అర్థాన్నిచ్చే వాక్యాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్‌ ఖుస్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌. ఎర్రకోట నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే. ఎర్ర చలువరాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 360 ఏళ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమునా నది ఒడ్డున, మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు.

కోటలో చక్రవర్తి సభలు జరిపే మండపాన్ని దివాన్‌-ఇ-ఆమ్‌ అంటారు. యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు, గోడలను వెండి బంగారాలతో తాపడం చేశారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన నెమలి సింహాసనం ఉండేది. ఫ్రెంచి స్వర్ణకారుడు మణులు, వజ్రాలను పొదిగి చేసిన దీనిపైనే చక్రవర్తి ఆసీనుడై సభను నడిపేవాడు. కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు అద్భుతంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ కోట మౌన సాక్షి. 1657లో షాజహాన్‌ నలుగురు కుమారుల వారసత్వ పోరును ఇది చూసింది. సోదరులను చంపించి షాజహాన్‌ను ఖైదు చేసి జౌరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం దీనికి తెలుసు. తర్వాత 50 ఏళ్లలో 9 మంది రాజుల పాలనకు ఇదే కేంద్రం. పర్షియా రాజు నాదిర్‌షా 1739లో దండెత్తి వచ్చి అప్పటి రాజు మహ్మద్‌షాను ఓడించి అనేక సంపదలతో పాటు నెమలి సింహాసనాన్ని తరలించుకు పోవడాన్ని ఇది గమనించింది. బ్రిటిష్‌ సైనికులు 1857లో ఎర్రకోటను వశపరుచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇక్కడ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది.

దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్‌ మహల్‌ మ్యూజియం, మోతీమజీద్‌, రంగ్‌మహల్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. 'బ్లడ్‌ పెయింటింగ్స్‌' మ్యూజియం, పురావస్తు మ్యూజియం, యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి.

చిత్రమాలిక

మూలాలు

ఎర్రకోట మూలాలు

సంస్కృతి, సాంప్రదాయలకు పుట్టినిల్లు అయినా భారతదేశంలో ఎన్నో సంప్రదాయ, చారిత్రాత్మక అద్భుత కట్టడాలు భారత వంశీయ రాజుల చేత నిర్మించబడ్డాయి. వాటిలో ప్రపంచ వారసత్వ పుణ్యం గల నిపుణులను తన అధికారుల చేత రప్పించి కోట నిర్మాణం చేయించారు. యమున నది ఒడ్డున దాదాపు 120 ఏకరాల విస్తీర్ణంలో దీన్ని అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ మహాసౌధానికి సంబంధించిన నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించిన ఘనత షాజహన్‌కే దక్కుతుంది. కాగా, దీని శిల్పి మాత్రం హమీద్. 2.41కి.మీల విస్తీర్ణంలో రెండు ప్రధాన ద్వారాల(గేట్స్)తో నిర్మించారు. అవి, లాహోర్ గేట్, ఢిల్లీ గేట్. ఇక ఎర్రకోట ప్రహరీగోడ కూడా భారీగానే నిర్మితమైంది. 2కి.మీల పొడవు, 90 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించడం జరిగింది. కోటలో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో ముంతాజ్ మహల్, రంగ్ మహల్, మోతీ మజీద్, దివానీ ఖాస్, దివాన్-ఇ-ఆమ్ ముఖ్యమైనవి. దివాన్-ఇ-ఆమ్‌లో రాజు ప్రజల వినతులు వినేవారట. ఇక్కడ పర్షియన్ నిపుణుల చేత వజ్రాలు, బంగారం పొదిగిన నెమలి సింహాసనంపై కూర్చుని రాజు ప్రజల సమస్యలు పరిష్కరించేవారు. దీని లోపలి గోడలపై బంగారం, వెండితో అద్భుతమైన పెయింటింగ్స్‌తో పాటు కొన్ని శ్లోకాలు రాశారు. వీటిలో ‘ఇళలో స్వర్గమంటూ ఉంటే అది ఇదే ఇదే’ అనే శ్లోకం కూడా ఉంది. ఇది పర్షియన్ కవి అమీర్ ఖుష్రో రచించిన పద్యంలోని ఒక లైన్. చక్రవర్తి షాజహన్ ఎర్రకోటను షాజనాబాద్‌కు కొత్త రాజధానిగా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం అధీనంలో ఉన్న ఎర్రకోటపై జాతీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో మొదట జాతీయ జెండాను ప్రధానమంత్రి ఇక్కడే ఆవిష్కరిస్తారు.

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎఱ్ఱకోట&oldid=2787627" నుండి వెలికితీశారు