ఊయల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18: పంక్తి 18:


==బయటి లింకులు==
==బయటి లింకులు==
[http://lumiere.sopheava.com/2005/07/lonely_tireswing_on_the_greenw.php] Picture of a tire swing.
[https://web.archive.org/web/20090310164022/http://lumiere.sopheava.com/2005/07/lonely_tireswing_on_the_greenw.php] Picture of a tire swing.





05:45, 7 జనవరి 2020 నాటి కూర్పు

ఊయల ఊగుతున్న చిన్నపిల్ల.
తోటలో ఊయల.

ఊయల లేదా ఉయ్యాల ఊగడం ఒక సరదాయైన పని. పిల్లలు ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక లోలకం లాగా ఊగుతూ ఉంటుంది.

ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.

కర్ర బల్లను బలమైన తాళ్ళతో పెద్ద చెట్టుకొమ్మకు కట్టి పెద్ద్ పిల్లలు, పెద్దవాళ్లు కూడ ఊగుతారు. మామూలు ఊయ్యాలలో 1-2 మీటర్లు ఎత్తుకు పోతే, ఈ రకమైన పెద్ద ఉయ్యాలలో 5-6 మీటర్ల ఎత్తుకు పోవచ్చు.

ఒక త్రాడుకు పాడైపోయిన రబ్బరు టైరుని చెట్టుకు కట్టి దాంట్లో కూర్చుని ఊగడం కూడా ఒకరకమైన ఊయల.

ప్రకృతిలో పొడుగ్గా బలమైన ప్రాకే మొక్కల కాండం క్రిందకి ఊగుతుంటే వాటిమీద కూర్చొని ఊగడం అడవులలోని చిన్నచిన్న గ్రామాలలో చూడవచ్చును.

సంస్కృతి

  • తెలుగువారు బిడ్డపుట్టిన తర్వాత జరిపే బాలసారె పండుగలో మొట్టమొదటగా పట్టుచీరతో కట్టిన ఉయ్యాలలో వేస్తారు.
  • అట్లతద్ది పండుగనాడు యువతులు, ముత్తైదువలు ఉయ్యాల లూగడం ఒక సంప్రదాయం.

బయటి లింకులు

[1] Picture of a tire swing.

"https://te.wikipedia.org/w/index.php?title=ఊయల&oldid=2798179" నుండి వెలికితీశారు