ఒడియా భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 20: పంక్తి 20:
== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
* [http://www.odia.org ఒడియా.ఆర్గ్, ఒరియా వార్తలు]
* [http://www.odia.org ఒడియా.ఆర్గ్, ఒరియా వార్తలు]
* [http://www.iit.edu/~laksvij/language/oriya.html ‌రోమన్ లిపి నుండి ఒరియా యూనికోడ్ ట్రాన్స్‌లిటరేటర్]
* [https://web.archive.org/web/20071122143104/http://www.iit.edu/~laksvij/language/oriya.html ‌రోమన్ లిపి నుండి ఒరియా యూనికోడ్ ట్రాన్స్‌లిటరేటర్]
{{భారతీయ భాషలు}}
{{భారతీయ భాషలు}}



07:04, 7 జనవరి 2020 నాటి కూర్పు


ఒరియా (ଓଡ଼ିଆ)
మాట్లాడే ప్రదేశం: ఒడిషా
ప్రాంతం: ఒడిషా
మాట్లాడే వారి సంఖ్య: 3.1 కోట్లు (1996)
స్థానం: 32 (1996)
అనువంశిక వర్గీకరణ: ఇండో-యూరోపియన్
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   ఒరియా
అధికార స్థాయి
అధికార భాష: భారతదేశము
నియంత్రణ: భాషా అకాడమీ
భాష కోడ్‌లు
ISO 639-1 or
ISO 639-2 ori
SIL
చూడండి: భాషప్రపంచ భాషలు

ఒరియా (ଓଡ଼ିଆ oṛiā), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణముగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్ మరియు అరబిక్ భాషల ప్రభావము చాలా స్వల్పము.

ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము ఉంది. 14వ శతాబ్దములో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ మరియు 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, మరియు గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకముగా బౌద్ధ మరియు జైన మతాలచే ప్రభావితమైనది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఒడియా_భాష&oldid=2798657" నుండి వెలికితీశారు