అలమేలుమంగా వేంకటేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 3: పంక్తి 3:
కవి ఇందులో మల్లెలవంటి [[ఉత్పలమాల]], [[చంపకమాల]] పద్యాలతో [[తల్లి]]<nowiki/>వంటి అలర్ మేల్ మంగ మీద 100 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా [[భక్తి]] మరియు శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.
కవి ఇందులో మల్లెలవంటి [[ఉత్పలమాల]], [[చంపకమాల]] పద్యాలతో [[తల్లి]]<nowiki/>వంటి అలర్ మేల్ మంగ మీద 100 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా [[భక్తి]] మరియు శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.


ఈ శతకాన్ని మొదటగా [[వావిళ్ళ]]వారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.
ఈ శతకాన్ని మొదటగా వావిళ్ళవారి ముద్రణాలయంలో [[వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి]] గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ [[నిడదవోలు వెంకటరావు]] రచించారు.


==ప్రారంభం==
==ప్రారంభం==

01:48, 15 జనవరి 2020 నాటి కూర్పు

అలమేలుమంగా వేంకటేశ్వర శతకము తాళ్ళపాక అన్నమయ్య రచించిన శతకము. ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి అలమేలు మంగ ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పేర్కొన్నారు.

కవి ఇందులో మల్లెలవంటి ఉత్పలమాల, చంపకమాల పద్యాలతో తల్లివంటి అలర్ మేల్ మంగ మీద 100 పద్యాలను కూర్చి అందించాడు. ఇవి ముఖ్యంగా భక్తి మరియు శృంగారాల మిళితంగా పేర్కొనవచ్చును.

ఈ శతకాన్ని మొదటగా వావిళ్ళవారి ముద్రణాలయంలో వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి గారు ప్రచురించారు. దీనికి పీఠిక శ్రీ నిడదవోలు వెంకటరావు రచించారు.

ప్రారంభం

ఉ. శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా

త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱున్

జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ

మూసినముత్యమై యురము ముంగిట జెంగట వేంకటేశ్వరా !

ఉదాహరణలు

చ. కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ

పలుకులతేనెలన్ విభుని బట్టము గట్టితి నీదుకౌగిటన్

వలదని చెప్పినన్ వినవు వద్దు సుమీ యలమేలుమంగ నీ

కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !


ఉ. చక్కనితల్లికిన్ నవరసంబుల వెల్లికి బుష్పవల్లికిం

జక్కనిమోవిముత్తియపుజల్లికి శ్రీయలమేలుమంగకున్

జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుదీగ లా

క్రిక్కిరిగుబ్బలే పసిడికిన్న రకాయలు వేంకటేశ్వరా !


ఉ. మానవతీశిరోమణికి మంజులవాణికి మోవితేనియల్

కానిక లిచ్చినాడ వట కౌగిట నాయలమేలుమంగకున్

మీనచకోరనేత్రి నిను మెచ్చి మదంబున గౌగిలించి నీ

పానుపుమీది చేత లివి పచ్చితలంపులు వేంకటేశ్వరా !

ముగింపు

ఉ. అమ్మకు దాళ్ళపాకఘను డన్నడు పద్యశతంబు జెప్పెగో

కొమ్మని వాక్ప్రసూనముల గూరిమితో నలమేలుమంగకున్

నెమ్మది నీవు చేకొని యనేకయగంబుల్ బ్రహ్మకల్పముల్

సమ్మది మంది వర్థిలను జవ్వన లీలల వేంకటేశ్వరా !

మూలాలు