శివాలయం: కూర్పుల మధ్య తేడాలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
|||
పంక్తి 36: | పంక్తి 36: | ||
==కొన్ని ప్రముఖ శివాలయాలు== |
==కొన్ని ప్రముఖ శివాలయాలు== |
||
{{Div col| |
{{Div col|colwidth=15em|content= |
||
*[[ద్వాదశ జ్యోతిర్లింగాలు]] |
*[[ద్వాదశ జ్యోతిర్లింగాలు]] |
||
*[[పంచారామాలు]] |
*[[పంచారామాలు]] |
||
పంక్తి 76: | పంక్తి 76: | ||
*[[శివపురి దేవాలయం, నాగోలు]] |
*[[శివపురి దేవాలయం, నాగోలు]] |
||
*[[ఐరావతేశ్వర దేవాలయం]], కుంభకోణం |
*[[ఐరావతేశ్వర దేవాలయం]], కుంభకోణం |
||
}} |
|||
{{Div end}} |
|||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
08:43, 3 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు
పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం - శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నిర్మాణ సంప్రదాయాలు
సాధారణంగా హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురం లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగంబ్రహ్మ స్థానంలో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.
ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణ ద్వారా ముఖంగా ఉంటుంది.
శివలింగం
పరివార దేవతలు
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్ఠింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం (శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.
చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్ఠిస్తారు. వివిధ శైవ గాథలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.
అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు
అన్ని శివాలయాలలో బ్రహ్మ ముహూర్తంలో రుద్రాభిషేకం మరియు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం రోజు ఇది విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది.
ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది. ప్రతి శివాలయంలో ఈ శివరాత్రి అతి ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
విశేషాలు
కొన్ని ప్రముఖ శివాలయాలు
- ద్వాదశ జ్యోతిర్లింగాలు
- పంచారామాలు
- పంచభూత క్షేత్రాలు
- ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి
- వారణాసి
- శ్రీశైలం
- శ్రీకాళహస్తి
- సోమనాథ్
- రామేశ్వరం
- ద్రాక్షారామం
- పశుపతినాథ్ దేవాలయం, నేపాల్
- యమేశ్వరాలయం, భుబనేశ్వర్
- బ్రహ్మేశ్వర దేవాలయం, భువనేశ్వర్
- ముక్తీశ్వర లింగం మరియు కాళేశ్వర లింగం, కాళేశ్వరం
- అగస్త్యేశ్వరాలయాలు, కొలకలూరు, నందివెలుగు, ఈమని
- ముఖలింగేశ్వరాలయం, ముఖలింగం
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ
- నటరాజ దేవాలయం, చిదంబరం
- పరశురామేశ్వరాలయం, గుడిమల్లం
- రామలింగేశ్వర స్వామి దేవాలయం, కీసర
- సిద్దేశ్వరాలయం, హేమావతి
- పుణ్యగిరి
- పంచముఖేశ్వరాలయం, సాలూరు
- చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం, చేబ్రోలు
- నాగలాపురం
- కపోతేశ్వరాలయం, చేజెర్ల
- కపోతేశ్వరాలయం, కడలి
- వ్యాఘ్రేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం
- నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, నారాయణపురం
- గోకర్ణేశ్వర ఆలయం, గోకర్ణమఠం
- ఐదు దేముళ్ళగుడి, మున్నంగి
- వాసీశ్వరస్వామి ఆలయం, తిరుప్పొచ్చూరు
- ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం, గుడి వీధి, శ్రీకాకుళం
- సంగమేశ్వరస్వామి దేవాలయం, సంగం
- బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం, పెద ఉప్పలం
- చొప్పదండి
- బాలకోటేశ్వరస్వామి దేవస్థానం, గోవాడ
- శివపురి దేవాలయం, నాగోలు
- ఐరావతేశ్వర దేవాలయం, కుంభకోణం