పాసీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వృత్తి - సామాజిక జీవనం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1: పంక్తి 1:
'''పాసీ''' భారతదేశంలోని ఒక దళిత కులం.<ref>http://www.expressindia.com/latest-news/pasi-samaj-a-dalit-subcaste-demands-more-representation/386591/{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> భారతదేశంలోని [[ఉత్తరప్రదేశ్]], [[బీహార్]], [[మహారాష్ట్ర]] వంటి అనేక రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డు కులంగా గుర్తింపబడ్డారు.<ref>http://socialjustice.nic.in/scorderbihar.pdf</ref> <ref>http://openlibrary.org/b/OL17103652M</ref>కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన కులాలలోని డి వర్గంలో వర్గీకరింపబడ్డారు.<ref>http://www.suryaa.com/showsports.asp?ContentId=8594{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> సాధారణంగా పాసీలు హిందూమతాన్ని అవలంబిస్తారు. కానీ కొంతమంది ముస్లిం పాసీలు కూడా ఉన్నారు. [[ముస్లిం]] పాసీలను ఓబీసిలు (ఇతర వెనుకబడిన కులాలు) గా వర్గీకరించారు<ref>http://www.milligazette.com/Archives/01012001/Art21.htm</ref> దేశంలోని కొన్ని ప్రాంతాలలో పాసీలను తర్మాలీ లేదా త్రిశూలియా అని కూడా వ్యవహరిస్తారు. పాసీలలో తెగలపై భారతీయ సామాజిక శాస్త్రజ్ఞులలో ఏకాభిప్రాయం లేదు. అయితే ఆరు ఉప కులాలు అందరూ అంగీకరిస్తారు. అవి రాజ్ పాసీ, కైథ్వాస్ పాసీ, బౌరాసీ పాసీ, గుజ్జర్ పాసీ, అరఖ్ పాసీ మరియు మంగ్తా పాసీ లేదా పాసీ మంగ్తా. దేశవ్యాప్తంగా 1971 జనాభా లెక్కల ప్రకారం 29.52 లక్షల మంది పాసీలు ఉన్నారు.
'''పాసీ''' భారతదేశంలోని ఒక దళిత కులం.<ref>http://www.expressindia.com/latest-news/pasi-samaj-a-dalit-subcaste-demands-more-representation/386591/{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> భారతదేశంలోని [[ఉత్తరప్రదేశ్]], [[బీహార్]], [[మహారాష్ట్ర]] వంటి అనేక రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డు కులంగా గుర్తింపబడ్డారు.<ref>{{Cite web |url=http://socialjustice.nic.in/scorderbihar.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-02-05 |archive-url=https://web.archive.org/web/20090410004513/http://socialjustice.nic.in/scorderbihar.pdf |archive-date=2009-04-10 |url-status=dead }}</ref> <ref>http://openlibrary.org/b/OL17103652M</ref>కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన కులాలలోని డి వర్గంలో వర్గీకరింపబడ్డారు.<ref>http://www.suryaa.com/showsports.asp?ContentId=8594{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> సాధారణంగా పాసీలు హిందూమతాన్ని అవలంబిస్తారు. కానీ కొంతమంది ముస్లిం పాసీలు కూడా ఉన్నారు. [[ముస్లిం]] పాసీలను ఓబీసిలు (ఇతర వెనుకబడిన కులాలు) గా వర్గీకరించారు<ref>http://www.milligazette.com/Archives/01012001/Art21.htm</ref> దేశంలోని కొన్ని ప్రాంతాలలో పాసీలను తర్మాలీ లేదా త్రిశూలియా అని కూడా వ్యవహరిస్తారు. పాసీలలో తెగలపై భారతీయ సామాజిక శాస్త్రజ్ఞులలో ఏకాభిప్రాయం లేదు. అయితే ఆరు ఉప కులాలు అందరూ అంగీకరిస్తారు. అవి రాజ్ పాసీ, కైథ్వాస్ పాసీ, బౌరాసీ పాసీ, గుజ్జర్ పాసీ, అరఖ్ పాసీ మరియు మంగ్తా పాసీ లేదా పాసీ మంగ్తా. దేశవ్యాప్తంగా 1971 జనాభా లెక్కల ప్రకారం 29.52 లక్షల మంది పాసీలు ఉన్నారు.


==చరిత్ర==
==చరిత్ర==

08:40, 15 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

పాసీ భారతదేశంలోని ఒక దళిత కులం.[1] భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాలలో వీరు షెడ్యూల్డు కులంగా గుర్తింపబడ్డారు.[2] [3]కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన కులాలలోని డి వర్గంలో వర్గీకరింపబడ్డారు.[4] సాధారణంగా పాసీలు హిందూమతాన్ని అవలంబిస్తారు. కానీ కొంతమంది ముస్లిం పాసీలు కూడా ఉన్నారు. ముస్లిం పాసీలను ఓబీసిలు (ఇతర వెనుకబడిన కులాలు) గా వర్గీకరించారు[5] దేశంలోని కొన్ని ప్రాంతాలలో పాసీలను తర్మాలీ లేదా త్రిశూలియా అని కూడా వ్యవహరిస్తారు. పాసీలలో తెగలపై భారతీయ సామాజిక శాస్త్రజ్ఞులలో ఏకాభిప్రాయం లేదు. అయితే ఆరు ఉప కులాలు అందరూ అంగీకరిస్తారు. అవి రాజ్ పాసీ, కైథ్వాస్ పాసీ, బౌరాసీ పాసీ, గుజ్జర్ పాసీ, అరఖ్ పాసీ మరియు మంగ్తా పాసీ లేదా పాసీ మంగ్తా. దేశవ్యాప్తంగా 1971 జనాభా లెక్కల ప్రకారం 29.52 లక్షల మంది పాసీలు ఉన్నారు.

చరిత్ర

పాసీ అన్న పదం సంస్కృతంలోని పశిక అన్న పదము నుండి వచ్చిందని భావిస్తారు. తాటి చెట్లు ఎక్కడానికి పెద్ద పాశాన్ని (తాడు) ఉపయోగిస్తారు కాబట్టి పశిక అన్న పేరు వచ్చింది. సాంప్రదాయకంగా కల్లు సేకరణ వీరి వృత్తి[6] ఆంధ్ర ప్రదేశ్లో నివసిస్తున్న `పాసి' కులస్థులు ఒకప్పుడు ఉత్తరాది నుంచి వచ్చారు. ఉత్తర భారతదేశంలో వీరి జనాభా ఎక్కువ. అక్కడ వీరి కులవృత్తి పందుల పెంపకం. ఎంతో కాలం కిందటే ఆంధ్ర ప్రదేశ్ వచ్చిన పాసీ కులంవారు బొగ్గు గనులున్న ప్రాంతంలో స్థిరపడ్డారు. బొగ్గు గనుల్లో పనిచేయించేందుకు ఉత్తర భారతదేశం నుంచి ఆంగ్లేయులు పాసి కులస్థులను ఆంధ్రప్రదేశ్‌లోని కోల్‌ బెల్ట్ కు తీసుకొచ్చారు. అప్పట్లో పాసీలు ఎడ్లబండ్లపై 45 రోజులు ప్రయాణంచేసి ఇల్లందు ప్రాంతానికి చేరుకున్నారు. 1889లో వారు ఈ ప్రాంతానికి చేరుకున్నట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. కనుకనే ఇప్పటికీ కోల్‌ బెల్టు ప్రాంతంలో పాసీలు ఎక్కువగా కనిపిస్తారు. ఉత్తరాది నుంచి వచ్చారు కనుక పరదేశీ అని అప్పట్లో పిలిచేవారు. పాసీ అంటే ఇప్పటికీ పరదేశీ అనే అంటారు. వీరు మాతృభాష అవధి ని మర్చిపోలేదు.

వృత్తి - సామాజిక జీవనం

కులవృత్తి పందుల పెంపకంగా ఉన్న పెరికముగ్గుల వారిని కూడా కోస్తా ప్రాంతంలో పరదేశీ లంటారు. తరతరాలుగా గనుల్లో బొగ్గును తవ్వి, తట్టలకెత్తే పని చేయడంతో ఈ కులస్థులు చదువుపై శ్రద్ధ చూపలేదు. అందుకే వీరిలో నిరక్షరాసులు ఎక్కువ. గనుల్లో అందరికీ ఉద్యోగాలు రాకపోవటంతో కొందరు వ్యవసాయదారులుగా మారారు. కౌలుకు తీసుకుని పంటలు పండించారు. మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ స్తోమత కూడా లేనివారు కులవృత్తి పందుల పెంపకం చేపట్టారు. బొగ్గుగనుల్లో పనిచేసి పదవీ విరమణ చేసినవారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవటంతో పాసీ యువతలో చాలామంది నిరుద్యోగులుగా మారారు. వీరు ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిలాల్లో ఎక్కువ. విశాఖ, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్‌ పట్టణాల్లో కూడా ఉన్నారు. తక్కువమంది ఉన్నందువల్ల కనీసం గుర్తింపు లేదు. రాష్ట్రంలో పాసీల జనాభా 8 వేలు మాత్రమే.

కులధృవీకరణ పత్రాల సమస్య

పాసీలను కేంద్ర ప్రభుత్వం ఎస్సీలుగా గుర్తించింది. 16 రాష్ట్రాలలో వీరు ఎస్సీలు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వీరు బీసీ-డి వర్గంలో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వీరి బంధువులు, వారి పిల్లలూ ఎస్సీ రిజర్వేషన్‌ సౌకర్యం పొంది పై చదువులు చదివి ఉన్నతాధికారులయ్యారు. ఇక్కడివారికి పిల్లల్ని చదివించుకునే స్తోమత లేకపోవడంతో వారు కూలీలుగా మారారు. తమని ఎస్సీ జాబితాలో చేర్చాలని వీరు కోరుతున్నారు. పాసీ కుల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్మించి విద్యాపరంగా అభివృద్ధి చేయాలని, తమ కులంలో వితంతువులు ఎక్కువని, వారి పెన్షన్లు ఇవ్వాలని‌ పాసీ సంక్షేమ సమాజం ప్రభుత్వాన్ని కోరుతోంది.

మూలాలు

  1. http://www.expressindia.com/latest-news/pasi-samaj-a-dalit-subcaste-demands-more-representation/386591/[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2009-04-10. Retrieved 2009-02-05.
  3. http://openlibrary.org/b/OL17103652M
  4. http://www.suryaa.com/showsports.asp?ContentId=8594[permanent dead link]
  5. http://www.milligazette.com/Archives/01012001/Art21.htm
  6. Maharashtra By K. S. Singh, B. V. Bhanu, B. R. Bhatnagar, Anthropological Survey of India, D. K. Bose, V. S. Kulkarni, J. Sreenath పేజీ.1683 [1]
"https://te.wikipedia.org/w/index.php?title=పాసీ&oldid=2852837" నుండి వెలికితీశారు