అత్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3: పంక్తి 3:
----
----
----
----
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] లేక [[భర్త]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. [[తల్లి]] సోదరుడి [[భార్య]]<nowiki/>ను మరియు [[నాన్న]] సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి [[మేనత్త]] అవుతుంది, మేనత్త సంతానంతో [[పెళ్ళి|వివాహము]]<nowiki/>ను [[మేనరికము]] అంటారు.
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] లేక [[భర్త]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. [[తల్లి]] సోదరుడి [[భార్య]]<nowiki/>ను, [[నాన్న]] సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి [[మేనత్త]] అవుతుంది, మేనత్త సంతానంతో [[పెళ్ళి|వివాహము]]<nowiki/>ను [[మేనరికము]] అంటారు.
==సంబంధాలు==
==సంబంధాలు==
;మేనత్త :
;మేనత్త :

05:39, 21 మార్చి 2020 నాటి కూర్పు




అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. తల్లి సోదరుడి భార్యను, నాన్న సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.

సంబంధాలు

మేనత్త

తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.

మేనమామ

తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు. ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్తలు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు

గొడవలకు కారణాలు

  • కోడలికి చాకిరీ చేయటం అత్తకు, అత్తకు చాకిరీ చేయటం కోడలికి ఇష్టం లేక.
  • ఒంటరిగా ఉండాలనే కోరికతో కావాలనే గొడవపెట్టుకోవటం, వెళ్ళగొట్టటం
  • కట్నం డబ్బుల సమస్య
  • అహంకారం (ఇగో) సమస్య. ఎవరిమాట ఎవరువినాలనే పట్టుదలకు పోవటం
  • కొడుకు తనకి దూరమై మరొక స్త్రీ (కోడలు) ని ఇష్టపడుతున్నాడు అనే అభధ్రతా భావం.
  • తన భర్త తనే లోకంగా ఉండాలి అమ్మని మర్చిపోవాలి అనే ధోరణి.

అత్తల హక్కుల సంక్షేమ సంఘం

498 (ఎ) సెక్షన్ కోడళ్ల చేతిలో వజ్రాయుధంగా మారిన నేపథ్యంలో అత్తలకు బాసటగా నిలబడేందుకు, అత్తలకు కూడా గృహహింస నుంచి రక్షణ కల్పించటం కోసం, అత్తలు సామాజిక వివక్ష, గృహహింసలకు బలవకుండా, అత్తలకు తగిన రక్షణ, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ మదర్స్-ఇన్-లా ప్రొటక్షన్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) ఆవిర్భావించింది.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేప్రకారం 1.7 శాతం మహిళలు అత్తల చేతిలో హింసని అనుభవిస్తుంటే, 13.7 శాతం మహిళలు తమ సొంత తల్లుల చేతిలోనే హింసకు గురవుతున్నారు.కోడళ్లతో నరకాన్ని అనుభవిస్తున్న అత్తలు 9704683163, 9573605415 నెంబర్లలో సంప్రదించ వచ్చు.[1]

ఇవి కూడా చూడండి

అత్తపై సినిమాలు

అత్తపై పాటలు

  • అత్త ఒడీ పువ్వు వలే మెత్తనమ్మా

అత్తపై సామెతలు

మూలాలు

  1. ఈనాడు పత్రికలో 18.10.2009 న ఆర్టికల్

యితర లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=అత్త&oldid=2879967" నుండి వెలికితీశారు