"క్రోనస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
==క్రోనస్ (Cronus): గ్రీసు దేశపు పురాణ గాథలు==
 
గ్రీసు దేశపు పురాణం గాథలలో మూడు తరాల “శాల్తీలు” కనిపిస్తారు: మొదటి తరం సృష్ట్యాదిలో ఉండే అస్తవ్యస్తత (chaos) నుండి పుట్టినవారు. వీరిని “దేవుడు,” “దేవత” అని అభివర్ణించడానికి బదులు వీటిని మూర్తిత్వం లేని అభిజ్ఞానాలు (amorphous symbols) గా కానీ, అపరావతారాలు (personified concepts) గా భావించవచ్చు. రెండవ తరం వారు టైటనులు. సాంప్రదాయికంగా వీరిని దేవగణాలలో ఉంచుతారు కానీ, ఒక విధంగా చూస్తే వీరిలో కొందరు హిందూ పురాణాలలోని రాక్షసులని పోలిన శాల్తీలులా అనిపిస్తారు. మూడవ తరం వారు ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న [[ఒలింపియనులుఒలింపయనులు]]. ఈ మూడవ తరం వారు మనకి పరిచయమైన దేవగణాల (అనగా, “దేవుళ్ళు,” “దేవతలు”) కోవ లోకి వస్తారు.
 
ఇక్కడ gods అనే ఇంగ్లీషు మాటని “దేవుళ్ళు,” “దేవతలు” అని అనువదించడం జరిగింది కానీ, నిదానం మీద ఆలోచిస్తే “gods” అన్న మాటని సురులు, అసురులు అని తెలిగించి సురులని “దేవతలు” గా పరిగణించి, అసురులులో మంచి వాళ్ళని “దేవతల” కోవలో పడేసి, చెడ్డ వాళ్ళని రాక్షసులుగా లెక్కలోకి తీసుకోవచ్చు. కానీ ఈ సూక్ష్మ భేదాలని విస్మరించి అందరినీ “దేవుళ్ళు” అనే - లింగ భేదం లేకుండా - అనడం జరిగింది.
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2924552" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ