తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
 
పంక్తి 35: పంక్తి 35:


== మరణం ==
== మరణం ==
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]], [[నవంబరు 29]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు.<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006] భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref> రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]], [[నవంబరు 29]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు.<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006] {{Webarchive|url=https://web.archive.org/web/20160305010114/http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006 |date=2016-03-05 }} భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref> రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>


==మూలాలు==
==మూలాలు==

14:05, 2 జూన్ 2020 నాటి చిట్టచివరి కూర్పు

తూము రామదాసు
జననంఆగష్టు 18, 1856
మరణంనవంబరు 29, 1904
జాతీయతభారతీయుడు
వృత్తితెలంగాణ తొలి నాటక (కాళిదాసు) రచయిత, కవి
తల్లిదండ్రులుతూము సర్వేశం
బంధువులువరదరాజులు (కుమారుడు)

తూము రామదాసు (ఆగష్టు 18, 1856 - నవంబరు 29, 1904) తెలంగాణ తొలి నాటక (కాళిదాసు) రచయిత.[1] 1897లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.[2][3]

జననం[మార్చు]

రామదాసు 1856, ఆగష్టు 18 న (నల నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం) తూము సర్వేశం దంపతులకు వరంగల్‌ లోని బాలనగరంలో జన్మించాడు.

రచనా ప్రస్థానం[మార్చు]

పేదరికంలో ఉన్న రామదాసు కందాళ సింగరాచార్యులు చేరదీసి విద్యాబుద్దులు నేర్పించాడు. సంస్కృతాంధ్ర పండితులు ప్రతాపపురం రంగాచార్యులు వద్ద ఉభయభాషలను చదువుకున్న రామదాసు, తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలుపెట్టి రుక్మిణీ కళ్యాణం గేయకావ్యాన్ని రాశాడు.

రచనలు[మార్చు]

  1. రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
  2. గోపికావిలాసము (ప్రబంధము)
  3. మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
  4. కాళిదాసు (నాటకం): సురభి నాటక సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు బృందం 1897లో వరంగల్‌ లో నాటకాలు ప్రదర్శిస్తున్న క్రమంలో తూము రామదాసు వారికి ఈ నాటకాన్ని రాసిచ్చాడు. ఈ నాటకాన్ని వనారస గోవిందరావు దర్శకత్వంలో సురభి సంస్థ ప్రదర్శించింది. 1899లో తూము రామదాసు మద్రాసు కు వెళ్ళి ఈ నాటకాన్ని పుస్తకంగా తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ నాటక ప్రతి అలభ్యం.
  5. ఆంధ్రపదనిధానము: 1901లో ‘ఆంధ్ర పదనిదానము’ నిఘంటువు రచించాడు. ఈ గ్రంథాన్ని 1930లో రామదాసు కుమారుడు వరదరాజులు ప్రచురించాడు.[4]

మరణం[మార్చు]

నిజాం ప్రభుత్వం లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు 1904, నవంబరు 29 (క్రోధినామ సంవత్సరం కార్తీక బహుళ సప్తమి) న మరణించాడు.[5] రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి తెలుగులోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం". Retrieved 18 August 2017.[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి. "తొలి నాటక కర్త తూము రామదాసు". Archived from the original on 19 ఆగస్టు 2017. Retrieved 18 August 2017.
  3. గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385
  4. International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17
  5. [1] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166
  6. PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146