ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 13: పంక్తి 13:
[[వర్గం:తెలుగు సినిమా సాంకేతిక నిపుణులు]]
[[వర్గం:తెలుగు సినిమా సాంకేతిక నిపుణులు]]
[[వర్గం:2011 మరణాలు]]
[[వర్గం:2011 మరణాలు]]

{{మొలక-వ్యక్తులు}}

13:36, 21 జూన్ 2020 నాటి కూర్పు

పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ఆహార్య నిపుణుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, తమిళం సినిమాలలో ఎం.జి.రామచంద్రన్ , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.

జీవిత విశేషాలు

అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించాడు. అలాగే పంభూతాలు చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది.

వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు

వ్యక్తిగత జీవితం

అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, వాసు , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.

మూలాలు