బి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:2008 మరణాలు ను తీసివేసారు; వర్గం:2007 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17: పంక్తి 17:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
{{మూలాల జాబితా}}
[[వర్గం:2008 మరణాలు]]
[[వర్గం:2007 మరణాలు]]

16:01, 28 జూన్ 2020 నాటి కూర్పు

బి.రామకృష్ణ భారతీయ హేతువాది. అతను గుంటూరు జిల్లా మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలోని నిడమర్రులో "చార్వాక ఆశ్రమం" స్థాపించాడు.

జివిత విశేషాలు

అతను గుంటూరు జిల్లా తుళ్ళూరు లో జన్మించాడు. .తాడికొండ సంస్కృతకళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసాడు. ఆ రోజుల్లోని విద్యావిధానం అశాస్ర్తీయమని భావించి, ఆ వ్యవస్థలో ఉండలేక రాజీనామా చేశారు. 1974లో నిడమర్రులో ‘ప్రగతి విద్యావనం’ పేరిట చార్వాక విద్యాపీఠాన్ని స్థాపించాడు. మిగిలిన విద్యాలయాలకు భిన్నంగా సిలబ్‌సను రూపొందించాడు. విద్యార్థుల్లో ప్రశ్నించే నైజాన్ని ప్రోత్సహిస్తూ, సైంటిఫిక్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌గా దాన్ని తీర్చిదిద్దాడు. ఈ స్కూల్‌ సింబల్ "ప్రశ్న (?)". స్వతహాగా మంచి ఉపాధ్యాయుడైన రామకృష్ణ పిల్లలకు నేర్పించాల్సిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాడు. వారికి ప్రేమగా బోధించేవాడు. ఈ విద్యాపీఠమే కాలక్రమంలో ‘చార్వాక ఆశ్రమం’ గా మారింది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో నేడు మేధావులుగా, సాహితీవేత్తలుగా, అభ్యుదయ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాని ద్వారా అనేకమంది నాస్తికుల్ని తయారుచేశాడు. అతను చార్వాకం పత్రిక సంపాదకుడు. ‘చార్వాక’ పత్రిక ద్వారా కూడా తెలుగునాట నాస్తికోద్యమాన్ని రామకృష్ణ విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాడు. [1]

నాస్తిక మేళా

1992లో రామకృష్ణ "నాస్తిక మేళా" కు రూపకల్పన చేశాడు. నాటి నుంచి నేటి వరకూ ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని, ఆదివారాల్లో నిడమర్రులోని చార్వాక ఆశ్రమంలో భౌతికవాద కుటుంబాల సమ్మేళనంగా, ఒక జాతరలా  ఈ మేళా జరుగుతూనే ఉంది. ఈ మేళాకు అభ్యుదయవాదులు, హేతువాదులు, వామపక్ష భావజాలం కలవారు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హాజరవుతారు. మూఢనమ్మకాలు, కులమత సమస్యలు, స్ర్తీల అణచివేత, మానవ, సమాజ పరిణామ క్రమం, జీవ వైవిధ్యం, పర్యావరణం తదితర అంశాలపై చర్చలు, ఉపన్యాసాలుంటాయి.

అతను 2007లో మరణించాడు.

వ్యక్తిగత జీవితం

అతని భార్య గృహలక్ష్మీ, పిల్లలు సుధాకర్, స్నేహ, అరుణ. అతని పిల్లలు అతని ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే కర్తవ్యాన్ని స్వీకరించారు.

ఆమె కుమార్తె బి.అరుణ. అతని మరణానంతరం ఆమె చార్వాక ఆశ్రమం భాద్యతలను నిర్వర్తిస్తుంది. ‘‘శ్రమైక జీవన విధానమే మన సంస్కృతికి పునాది. దీనికి భిన్నంగా వినిమయ సంస్కృతి చొచ్చుకువస్తున్న నేటి కాలంలో సమాజాన్ని హేతుబద్ధమైన, శాస్త్రీయమైన ఆలోచనల దిశగా నడిపించి, మన నిజమైన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఇంకా పెరిగింది. ఆ దిశగా తన కార్యాచరణను చార్వాక ఆశ్రమం చేపడుతోంది’’అని ఆమె తెలిపింది. చార్వాక ఆశ్రమంలో ప్రవేశించగానే మహాత్మా రావణ మైదానం, దుస్తులు ధరించిన వేమన విగ్రహం కనిపిస్తాయి.

మూలాలు

  1. "ఈ ఆశ్రమం.. మానవతకు ఆశ్రయం!". www.andhrajyothy.com. Retrieved 2020-06-28.