"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
| religion = [[హిందూ మతం|హిందూ]]
}}
'''రాజాజీ'''గా పేరొందిన '''చక్రవర్తి రాజగోపాలాచారి''' ([[డిసెంబరు 10]], [[1878]] - [[డిసెంబరు 25]], [[1972]]) (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. అతను సంయుక్త మద్రాసు రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన [[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో) . రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, తోరపల్లి గ్రామంలో [[1878]], [[డిసెంబరు 10]] న జన్మించాడు.
 
==బాల్యం==
రాజాజీ 1878 డిసెంబరు 10 న సాంప్రదాయ వైష్ణవ [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబీకులైన చక్రవర్తి అయ్యంగార్, సింగారమ్మ దంపతులకు జన్మించాడు. అతను స్వస్థలం [[తమిళనాడు]], [[సేలం]] జిల్లాలోని దొరపల్లి అగ్రహారం అనే గ్రామం. ఇది పారిశ్రామిక పట్టణమైన [[హోసూరు]]కు దగ్గర్లో ఉంటుంది. అతను తండ్రి చక్రవర్తి అయ్యంగార్ తోరపల్లి గ్రామానికి [[మునసబు]]. అతను పాఠశాల విద్య [[హోసూరు]] లోనూ, కళాశాల విద్య [[చెన్నై]], [[బెంగళూరు]] లోనూ జరిగింది. 1897 లో [[బెంగళూరు]] లోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1899 లో [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. 1900 లో [[న్యాయవాది]]గా ప్రాక్టీసు ప్రారంభించాడు.సేలంలో ఉండగానే అతను సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు.
 
==భారత స్వాతంత్ర్యోదమం==
1919 లో [[మహాత్మా గాంధీ]] స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ కూడా అతను్ను అనుసరించాడు. [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నాడు. న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశాడు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు.<ref name="pillarsp88" />
 
1923 లో కాంగ్రెస్ విడిపోయినపుడు రాజాజీ సివిల్ డిసొబీడియెన్స్ కమిటీలో సభ్యుడు. గాంధీజీ అంటరానితనాన్ని రూపుమాపడానికి చేపట్టిన వైకోం [[సత్యాగ్రహం]]లో అతనుకు కుడిభుజంగా ఉన్నాడు. ఆ సమయంలో పెరియార్ ఈవీ రామస్వామి రాజాజీ నాయకత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. వీరిద్దరూ తరువాతి కాలంలో రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందినా మంచి [[స్నేహితులు]]<nowiki/>గా ఉన్నారు.
 
1930 లో [[తమిళనాడు]] కాంగ్రెస్ లో రాజాజీ నాయకుడయ్యాడు. అదే సమయంలో మహాత్మా గాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో [[ఉప్పు]] పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్ళాడు. తరువాత రాజాజీ [[తమిళనాడు]] కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1935 లో భారత ప్రభుత్వం అమల్లోకి వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెస్ ను సాధారణ ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985056" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ