"వడ్లమాని విశ్వనాథం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''[[వడ్లమాని విశ్వనాథం]]''' నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి [[బళ్ళారి రాఘవ|బళ్లారి రాఘవ]] వంటి వారి మెప్పును పొందినవాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1912]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలం, [[నందంపూడి]] అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853182 నటరత్నాలు - [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - ఆంధ్రప్రభ వారపత్రిక - 15-03-1972]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి [[సంగీత పాఠశాల]]<nowiki/>లో [[ఆదిభట్ల నారాయణదాసు]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]]గారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు.
 
==నాటకరంగం==
1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా [[పెద్దాపురం మండలం|పెద్దాపురం]] విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ [[నాటకం]]<nowiki/>లో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు [[చంద్రమతి]]ని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో [[కాకినాడ]] లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను, ధ్రువ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్భుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు. 1926 నాటికి [[ప్రమీలార్జునీయము|ప్రమీలార్జునీయం]]<nowiki/>లో ప్రమీల, 'చింతామణి'లో [[చింతామణి (అయోమయ నివృత్తి)|చింతామణి]], జవ్హరీబాయి, సావిత్రి, [[మోహిని]] మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు. బాలకృష్ణుడు మొదలు భక్తరామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు సమస్త ముఖ్య స్త్రీ, పురుష పాత్రలను ఇతడు ధరించాడు.
 
ముఖ్యంగా ఇతడు నటించిన “ప్రమీల", "రోషనార", "చింతామణి" నాటక ప్రదర్శనాలతో వచ్చిన డబ్బుతో [[కాకినాడ]]లో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్ధమైన విషయం. ఆ గౌరవం ఇతడికే దక్కింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2988378" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ