"నోము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,242 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.
 
ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట..
 
==కొన్ని నోములు==
* పోలి స్వర్గమునకు వెళ్ళు నోము
* సావిత్రీ వ్రతం
* [[గౌరీ వ్రతం]]
* బొమ్మల నోము
* పువ్వు తాంబూలము నోము
* దంపతుల తాంబూలము నోము
* శ్రావణ మంగళవారము నోము
* రేగుల గౌరీ నోము
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/299301" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ