వికీపీడియా:సాక్ పపెట్రీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: తెలుగు వికీపీడియాలో తోలుబొమ్మ (ఆంగ్లవికీలో వీటిని సాక్-పప్పె...
(తేడా లేదు)

12:45, 9 మే 2008 నాటి కూర్పు

తెలుగు వికీపీడియాలో తోలుబొమ్మ (ఆంగ్లవికీలో వీటిని సాక్-పప్పెట్లని పిలుస్తారు), అనేది అప్పటికే సభ్యత్వమున్న ఒక సభ్యుని నకిలీ సభ్యత్వం. ఇలా రెండు మూడు సభ్యత్వాలు కలిగుండటం కొన్ని నిర్వహణాపరమైన కార్యక్రమాలను సులభతరం చేస్తుంది. ఇందుకు ఉదాహరణగా బాట్లకోసం సృష్టించే ఖాతాలను పేర్కొనవచ్చు, ఈ ఖాతాలను బాట్లద్వారా చేస్తున్న పనులను వాటి యజమానులు చేస్తున్న పనుల నుండి వేరుపరచటానికి ఉపయోగపడతాయి. కానీ కొన్ని సందర్భాలలో తమ అసలు ఖాతాను వాదోపవాదాలలో ఇరికించకుండా వాదనలు చేయడానికి అప్పటికే ఒక ఖాతా ఉన్న సభ్యులు ఇంకో కొత్త ఖాతాను సృష్టిస్తారు. ఇలా తోలుబొమ్మ ఖాతాలను సృష్టించడం వలన వాదోపవాదాలు తప్పుదోవపడుతుందని కొంతమంది సభ్యులు భావిస్తూ ఉంటారు.