"హిందూ సామ్రాజ్య దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{మూలాలు లేవు}}
'''హిందూ సామ్రాజ్య దినోత్సవం,''' ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.[[ఛత్రపతి శివాజీ]][[హిందూ]] ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.[[1674]] [[జూన్]] 6న ([[జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి]]) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు.<ref>{{Cite web|url=https://www.yuvnews.com/telugu/1516/flash-news-1516|title=హిందూ సామ్రాజ్య దినోత్సవం|website=www.yuvnews.com|access-date=2020-08-01}}</ref>శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు [[పూణే]] జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ, జిజాభాయి దంపతులకు జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.megamindsindia.in/2019/06/hindu-samrajya-diwas-speech.html|title=శివాజీ పట్టాభిషేకం - హిందూ సామ్రాజ్య దినోత్సవం - hindu samrajya diwas speech|access-date=2020-08-01}}</ref>
 
== చరిత్ర ==
ఛత్రపతి శివాజీ [[పట్టాభిషేకం|పట్టాభిషేక]] వార్షికోత్సవం సందర్భంగా తెలుగు సంవత్సరం,హిందూ నెల ప్రకారం [[జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి]] నాడు హిందూ సమ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.<ref>{{Cite web|url=http://vsktelangana.org/hindu-samrajya-diwas|title=వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ - హిందూ సామ్రాజ్య దినోత్సవం|last=vskteam|date=2019-06-15|website=VSK Telangana|language=en-US|access-date=2020-08-01}}</ref> శివాజీ పట్టాభిషేకంతో హిందూ రాజ్యం ఉనికిలోకి వచ్చిందని నమ్ముతారు. చత్రపతి శివాజీ మరాఠా రాజ్యాన్ని స్థాపించిన 17 వ శతాబ్దపు పాలకుడు.ఈ రోజును [[మహారాష్ట్ర|మహారాష్ట్రలో]] "శివ స్టేట్‌హుడ్ ఫెస్టివల్" జరుపుకుంటారు.ప్రతి భారతీయుడి హృదయంలో ఇప్పటికీ శివాజీ మహారాజ్ శౌర్యప్రతాపం మిళితమై ఉంది. అతని కథలు పిల్లలకు సాహసం, వక్తృత్వానికి ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్న [[మహారాష్ట్ర]] రాయ్‌ఘడ్ కోటలో జరిగిన ఒక గొప్ప కార్యక్రమంలో మరాఠా రాజు పట్టాభిషేకం చేశారు. రాయ్‌ఘడ్‌లోని ప్రజలు ప్రతి సంవత్సరం [[హిందూ మతం|హిందూ]] నెల జ్యేష్ఠ శుక్ల త్రయోదశి (13 వ రోజు) రోజున దీనిని జరుపుకుంటారు.<ref name=":0">{{Cite web|url=https://national.janamtv.com/june-4-hindu-samrajya-diwas-or-hindu-empire-day-24182/|title=June 4- Hindu Samrajya Diwas or Hindu Empire Day|date=2020-06-04|website=Janam TV National|language=en-US|access-date=2020-08-01}}</ref>
 
చరిత్ర ప్రకారం, హైందావహైందవ స్వరాజ్ స్థాపించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ యుక్తవయసులోనే [[ప్రమాణం]] చేశాడు.మొఘలులపై పోరాటచేసి, కోటలను జయించడం గురించిన కథలు ప్రతి భారతీయుడుకు గర్వించదగిన ఆడ్రినలిన్ గ్రంధిలా ప్రహహించే ఉత్తేజం కలిగిస్తాయి.[[యమునా నది|యమున]], [[సింధూ నది|సింధు]], [[గంగా నది|గంగా]], [[గోదావరి]], [[నర్మదా నది|నర్మదా]], [[కృష్ణా నది|కృష్ణ]], [[కావేరి నది|కావేరితో]] సహా ఏడు నదుల పవిత్ర జలాలతో పట్టాభిషేకం చేశారు.రాయ్‌ఘడ్‌‌లో ఆ రోజుల్లోనే దాదాపు యాభై వేల మంది పాల్గొన్న గొప్ప కార్యక్రమం ఇది. శివాజీకి షకకర్త (ఒక శకం స్థాపకుడు), ఛత్రపతి (పరమావ సార్వభౌమాధికారి) అనే పేర్లు పెట్టారు.అతను హిందూ విశ్వాసం రక్షకుడు, అంటే హైందవ ధర్మోధారక్ అనే బిరుదును పొందాడు.<ref name=":0" />
 
అతను తన జీవిత కాలంలో, [[మొఘల్ సామ్రాజ్యం]], [[గోల్కొండ]] సుల్తానేట్, [[బీజాపూర్|బీజాపూర్ సుల్తానేట్]], అలాగే [[ఐరోపా సమాఖ్య|యూరోపియన్]] వలస శక్తులతో పొత్తులు,శత్రుత్వాలలో విజయం పొందాడు.అతని సైనిక దళాలు [[మరాఠీ భాష|మరాఠా]] గోళాన్ని విస్తరించి, కోటలను అన్నిటినీ వారి స్వాధీనం చేసుకున్నాయి.మరాఠా నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు.చక్కటి నిర్మాణాత్మక పరిపాలనా సంస్థలతో సమర్థ, ప్రగతిశీల పౌర పాలనను సాగించాడు.అతను ప్రాచీన హిందూ రాజకీయ సంప్రదాయాలను, న్యాయస్థాన సమావేశాలను పునరుద్ధరించాడు. కోర్టు నిర్వహణలలో [[పార్సీ భాష|పెర్షియన్]] భాష కాకుండా మరాఠీ, [[సంస్కృతము|సంస్కృతం]] వాడకాన్ని ప్రోత్సహించాడు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కు ఈ దినోత్సవం రోజు చాలా ముఖ్యమైంది, సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి.ఇతర ఐదు పండుగలు [[దసరా|విజయదశిమి]], [[మకర సంక్రాంతి]], [[ఉగాది]], [[గురుపౌర్ణమి|గురుపూర్ణిమ]], రక్షాబంధన్ మహోత్సవ్.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3004634" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ