"ముహూర్త బలం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
* బుగ్గ గిల్లగానే సరిపోయిందా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
==కథ==
వేణు చిన్ననాడే ఏదో తప్పు చేసినందుకు తాత చేతిలో తన్నులు తిని ఆవేశం, ఉద్రేకం పట్టలేక ఇంటి నుండి పారిపోతాడు. దేశాలు తిరిగి, డబ్బు సంపాదించి పద్నాలుగేళ్ళ తర్వాత స్వంత వూరికి వస్తాడు. ఈలోగా అతని తాత మరణిస్తాడు. చెల్లెలు కమల పెళ్ళీడుకొస్తుంది. చిన్ననాటి స్నేహితురాలు రాధ కూడా పెళ్ళీడుకు వచ్చి వేణు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. రాధపై కన్నుపడిన జమీందారు భుజంగరావు ఆ ఊళ్లో మకాం చేస్తాడు. ఎలాగైనా రాధను వశపరచుకోవాలని సెక్రెటరీ పర్వతాలు, వైద్యుడు పానకాలుతో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. దేశద్రిమ్మరియైన వేణుకు రాధను ససేమిరా ఇవ్వనని రాధ తండ్రి భీష్మించుకు కూర్చుని రాధకు వేరే సంబంధం తెస్తాడు. కానీ జమీందారు భుజంగరావు పానకాలు సహాయంతో రాధపై పెళ్ళివారికి లేనిపోనివి కల్పించి చెప్పించి ఆ సంబంధాన్ని వేణు చెల్లెలు కమలకు ఖాయం చేస్తారు. పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ జరుగుతుండగా తాము మొదట మాట ఇచ్చిన ప్రకారం రాధనే పెళ్ళి చేసుకుంటామని, కమల తమకు నచ్చలేదని పెళ్ళికొడుకు తన తండ్రి చేత వేణుకు ఉత్తరం వ్రాయిస్తాడు. ఈ సంగతి తెలిసిన రాధ తండ్రి ఎవరితో చెప్పకుండా ఆ వూరికి వెళ్ళి కమలనే పెళ్ళి చేసుకునేటట్టు పెళ్ళికొడుకునీ అతని తండ్రినీ ఒప్పిస్తాడు. రాధ తండ్రి ఊరిలో లేని సమయం చూసి భుజంగరావు రాధను ఎత్తుకుపోయి బలవంతంగా తాళి కట్టాలని ప్రయత్నిస్తాడు. ఇది తెలిసి వేణు పదిమందిని వెంటపెట్టుకు వెళ్ళి భుజంగరావును, అతని సలహాదారు పానకాలునూ చితకబాది రాధను రక్షిస్తాడు. ఇంతలో తిరిగివచ్చిన రాధ తండ్రి తన కూతురును వేణుకే ఇస్తానని, కమలకు అనుకున్న సంబంధాన్నే ఖాయం చేసి వచ్చానని శుభవార్త చెప్పడంతో కథ సుఖాంతమౌతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3015372" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ