అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:

ఉడుతడిని పాలించే రాజు జైనుడు ఒకనాడు నగరంలో ఊరేగుతున్నాడు. బాల్య చాపల్యంతో రాజు కొరకు మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో అందాల సుందరి మహాదేవి అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహదేవి ఒక ఉపాయమాలోచించి, రాజు తాను విధించే మూడు కోర్కెలు చెల్లిస్తే తాను వివాహమాడగలనని, ఏ ఒక్కదానికి భంగం వాటిల్లినా తాను స్వతంత్రురాలనై వెడలిపోతానని తెలిపింది. రాజు అంగీకరించడంలో మహాదేవి రాజ మందిరం ప్రవేశించి నిత్యం లింగపూజ చేస్తూ, గురు జంగములకు తోడ్పడుతూ, అనుభవ మంటపములో పాల్గొంటూ కాలం గడపసాగింది.

కొన్ని కాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించాడు. ఒకనాటి రాత్రి ఆమె ఆరాధ్య గురువు పడకగదిలో నిద్రిస్తుండగా వచ్చడని తెలిసి ఆమె ఉన్నపాటున (దిగంబరిగా) గురు దర్శనం చేస్తుంది. వస్త్రాలు ధరించి రావలసిందిగా గురువు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ పరమభక్తురాలివి గదా నీకు వస్త్రం ఎందుకు అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటినుండి వస్త్రాలు ధరింపక ఆమె కేశాంబరిగానే జీవితాంతం ఉండిపోతుంది. రాజమందిరం నుండి బయటపదిన మహాదేవి ఎన్నో కష్టాలను ఎదుర్కొని కళ్యాణ పట్టణం చేరుతుంది.

అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. నాటినుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతిచెందినది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో కదళీ వనంలోగల జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మందిచది చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనతికాలంలోనె ఆమె శ్రీశైలం మల్లిఖార్జునిలో ఐక్యమయిపోతుంది.

అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో అక్కగళపితికే, కొరవంజి వచనార్ధ అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ఆమె వచనాలు గోదాదేవి తిరుప్పావైతో సాటిరాగలవి.

08:35, 15 మే 2008 నాటి కూర్పు

An idol of Akkamahadevi installed in a temple at her birth-place, Udathadi
A statue of Akkamahadevi installed at her birth-place, Udathadi

అక్క మహాదేవి (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. గోదాదేవి వలెనే ఈమె శ్రీశైల మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. వీరశైవ ఉద్యమానికి పట్టుకొమ్మయిన బసవేశ్వరుని కాలం (12 శతాబ్దం) లో ఈమె జీవించింది. ఈమె కర్ణాటకలోని శివమొగ సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకు జన్మించింది. పార్వతీదేవి అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మత్ర ఉపదేశం జరిగాయి.

ఉడుతడిని పాలించే రాజు జైనుడు ఒకనాడు నగరంలో ఊరేగుతున్నాడు. బాల్య చాపల్యంతో రాజు కొరకు మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో అందాల సుందరి మహాదేవి అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహదేవి ఒక ఉపాయమాలోచించి, రాజు తాను విధించే మూడు కోర్కెలు చెల్లిస్తే తాను వివాహమాడగలనని, ఏ ఒక్కదానికి భంగం వాటిల్లినా తాను స్వతంత్రురాలనై వెడలిపోతానని తెలిపింది. రాజు అంగీకరించడంలో మహాదేవి రాజ మందిరం ప్రవేశించి నిత్యం లింగపూజ చేస్తూ, గురు జంగములకు తోడ్పడుతూ, అనుభవ మంటపములో పాల్గొంటూ కాలం గడపసాగింది.

కొన్ని కాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించాడు. ఒకనాటి రాత్రి ఆమె ఆరాధ్య గురువు పడకగదిలో నిద్రిస్తుండగా వచ్చడని తెలిసి ఆమె ఉన్నపాటున (దిగంబరిగా) గురు దర్శనం చేస్తుంది. వస్త్రాలు ధరించి రావలసిందిగా గురువు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ పరమభక్తురాలివి గదా నీకు వస్త్రం ఎందుకు అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటినుండి వస్త్రాలు ధరింపక ఆమె కేశాంబరిగానే జీవితాంతం ఉండిపోతుంది. రాజమందిరం నుండి బయటపదిన మహాదేవి ఎన్నో కష్టాలను ఎదుర్కొని కళ్యాణ పట్టణం చేరుతుంది.

అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. నాటినుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతిచెందినది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో కదళీ వనంలోగల జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మందిచది చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనతికాలంలోనె ఆమె శ్రీశైలం మల్లిఖార్జునిలో ఐక్యమయిపోతుంది.

అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో అక్కగళపితికే, కొరవంజి వచనార్ధ అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ఆమె వచనాలు గోదాదేవి తిరుప్పావైతో సాటిరాగలవి.

మూలాలు

  • దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.