తాంబూలము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5,322 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
విస్తరణ
చి (AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(విస్తరణ)
 
తాంబూలం (కిళ్ళీ) [[తమలపాకు]], [[సున్నం]], [[వక్క]], [[కాచు]], [[ఏలకులు]] మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు. భోజనానంతరము దీనిని సేవించటం భారత సంస్కృతిలో ఒక భాగం. దీన్ని విడెము అని కూడా అంటారు. తాంబూలాన్ని కిళ్ళీ అని, పాన్ అని, బీడా అనీ కూడా వివిధ ప్రాంతాల్లో అంటారు.
<!--బొమ్మ కామన్స్ కి మార్చాలి
 
[[దస్త్రం:Tambulamu.jpg|thumb|left|తాంబూలము ]] -->
== తంబూలంలో వాడే వస్తువులు ==
తాంబూలం (కిళ్ళీ) [[తమలపాకు]], [[సున్నం]], [[వక్క]], [[కాచు]], [[ఏలకులు]] మొదలైన సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారుచేస్తారు. భోజనానంతరము దీనిని సేవించటం భారత సంస్కృతిలో ఒక భాగం.
తాంబూలంలో ప్రధానంగా [[తమలపాకు|తమలపాకులు]], [[వక్క]] [[సున్నం]] ఉంటాయి. ఇవి అనివార్యంగా ఉండే పదార్థాలు కాగా, తమతమ అభిరుచుల మేరకు అనేక ఇతర అధరువులను కూడా వాడుతూంటారు. వీటిలో జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము వగైరా వస్తువులున్నాయి.<ref>{{Cite web|url=https://www.eenadu.net/makarandham/more/5/22593|title=ఆకులు, వక్కలు... ఆనవాయితీలు|last=|first=|date=|website=www.eenadu.net|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200829085941/https://www.eenadu.net/makarandham/more/5/22593|archive-date=2020-08-29|access-date=2020-08-29}}</ref>
==నేపధ్యము==
 
== ఆరోగ్యానికి ==
శరీరానికి తాంబూల సేవనం ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. <ref>{{Cite web|url=https://www.v6velugu.com/తాంబూలంలోనే-కాదు-వైద్యర/|title=తాంబూలంలోనే కాదు… వైద్యరంగంలో కూడా తమలపాకుకు అగ్రస్థానమే {{!}} {{!}} V6 Velugu|last=|first=|date=2018-11-08|website=సమయం|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20200829090831/https://www.v6velugu.com/%25E0%25B0%25A4%25E0%25B0%25BE%25E0%25B0%2582%25E0%25B0%25AC%25E0%25B1%2582%25E0%25B0%25B2%25E0%25B0%2582%25E0%25B0%25B2%25E0%25B1%258B%25E0%25B0%25A8%25E0%25B1%2587-%25E0%25B0%2595%25E0%25B0%25BE%25E0%25B0%25A6%25E0%25B1%2581-%25E0%25B0%25B5%25E0%25B1%2588%25E0%25B0%25A6%25E0%25B1%258D%25E0%25B0%25AF%25E0%25B0%25B0/|archive-date=2020-08-29|access-date=2020-08-29}}</ref>
 
== సారస్వతంలో, సంస్కృతిలో ==
 
* దేవుడికి ఇచ్చే తాంబూల నైవేద్యంలో మూడు తమలపాకులు, రెండు వక్కలు, సున్నం ఉంచి సమర్పిస్తారు
* ఆంజనేయస్వామికి ఆకుపూజ పరమ ప్రీతి అని ప్రజల నమ్మకం.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/religion/hinduism/imortance-of-tambulam-offering-in-hinduism/articleshow/65237367.cms|title=తాంబూలం వ‌ల్ల ఉప‌యోగం.. ప్రాధాన్య‌త ఏమిటి?|last=|first=|date=|website=Samayam Telugu|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200829090627/https://telugu.samayam.com/religion/hinduism/imortance-of-tambulam-offering-in-hinduism/articleshow/65237367.cms|archive-date=2020-08-29|access-date=2020-08-29}}</ref>
* పూర్వం యుద్ధాలకు వెళ్ళే సమయంలో తాంబూలాలు ఇచ్చి పంపేవారు.
* శుభ సందర్భాలలో అతిథులకు రెండు తమలపాకులు, వక్క (ముక్కలు గానీ మొత్తంగా గానీ) కొబ్బరికాయ ఇవ్వడం ఒక సంప్రదాయం.
* సంబంధ బాంధవ్యాలను కలుపుకునే సందర్భాల్లో తాంబూలాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ.
* చిలకలు చుట్టి భార్య భర్తకు అందివ్వడం తెలుగువారి సంస్కృతిలో సంప్రదాయంలో భాగం. తమలపాకులను భార్య తన చేతివేళ్ళకు కిరీటాల్లాగా తొడిగి, భర్తకు అందిస్తే భర్త ఒక్కోదాన్నీ నోటితో అందుకోవడం ఈ సంప్రదాయం
* పెద్దనామాత్యుడు "''నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక అందించు కప్పుర విడెము''" అనే పద్యంలో, కవిత్వం రాయాలంటే ఉండాల్సిన అంశాల్లో కర్పూర తాంబూలం (కప్పుర విడెము) కూడా ఒకటని పేర్కొన్నాడు.
* కిళ్ళీ విశిష్టతను తెలియజేస్తూ [[యుగంధర్]] అనే సినిమాలో "''ఓరబ్బా ఏసుకున్నా కిళ్ళీ"'' అనే పాట ఉంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
 
{{మొలక-జీవన విధానం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3023322" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ