జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,524 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
అనువాదాలు
చి (అనువాదాలు)
చింగిజ్ ఐత్‌మాతోవ్ 1928 లో [[కిర్గిజిస్తాన్]] లో ముస్లిం గిరిజన సంచార జాతుల కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఇరువురూ ఉపాధ్యాయులు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు. చింగిజ్ ఐత్‌మాతోవ్ కు తొమ్మిదేళ్ల ప్రాయంలో అతని తండ్రి తొరెకూల్ ఐత్‌మాతోవ్ ని స్టాలినిస్ట్ ప్రక్షాళనలో భాగంగా అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా చంపివేసారు. ఆ విషాద ఘటన ఒక పీడకలగా ఇతని జీవితమంతా వెంటాడి వేధించింది. ఆ విషాదంలో నుండి వెలువడిన రచయితగా సోవియట్ వాస్తవికతలోని చీకటి కోణాలను నిష్కర్షగానే అయినప్పటికీ ఆలోచనాత్మకంగా ప్రతిబింబించాడు. అయితే లోపాలు రాజకీయ వ్యవస్థకుఆపాదించకుండా వాటిని మానవ నైజంలో భాగంగానే చూసి వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత వ్యవస్థదే అని పేర్కొన్నాడు.
 
నిజానికి జమీల్యా అతని మొదటి కథా రచన కాదు. ఇతని మునుపటి కథలు స్థానిక కిర్గిజ్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అయితే సోవియట్ లో అతనికి అత్యంత గుర్తింపు తెచ్చిన తొలి రచన జమీల్యా. 1958 లో ప్రచురించబడిన జమీల్యా నవల, రచయితగా చింగిజ్ ఐత్‌మాతోవ్ కు ఎనలేని గుర్తింపునూకీర్తిని, అనేక పురస్కారాలను సాధించిపెట్టింది. దీని ఫ్రెంచ్ అనువాదంతో ఐత్‌మాతోవ్ ప్రతిభను యావత్ ప్రపంచం గుర్తించింది.
 
ది ఫస్ట్ టీచర్ (1962), టేల్స్ అఫ్ ది మౌంటైన్స్ అండ్ స్టెప్స్ (1963), ఫేర్ వెల్ (1966), గైలుసారే (1966) మొదలైనవి ఐత్‌మాతోవ్ ఇతర ముఖ్య రచనలు. 1963లో లెనిన్ ప్రైజ్, హీరో అఫ్ ది సోషలిస్ట్ లేబర్, యూరోపియన్ సాహిత్యానికి ఆస్ట్రియన్ స్టేట్ ప్రైజ్ వంటి అనేకానేక పురస్కారాలు అందుకొన్నాడు. రాజకీయంగా ఉన్నతశిఖరాలు అధిరోహించాడు. 1989లో కాంగ్రెస్ అఫ్ ది పీపుల్స్ డిప్యూటీస్ లో సభ్యుడిగా, శాశ్వత పార్లమెంటరీ కమిషన్ అధినేతగా, నాటి సోవియట్ అధ్యక్షుడు గోర్బచెవ్ కు సలహాదారునిగా మెలిగాడు. 1991లో కిర్గిజిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక యురోపియన్ దేశాలకు ([[ఫ్రాన్స్]], [[బెల్జియం]], [[నెదర్లాండ్స్]], [[లక్సెంబర్గ్]]) మాత్రమే కాక యురోపియన్ యూనియన్, యునెస్కో, నాటో వంటి సంస్థలకు సైతం కిర్గిజ్ రాయబారిగా వ్యవహరించాడు. 2008 లో జర్మనీలోని న్యూరెంబర్గ్ లో మరణించాడు.
 
==అనువాదాలు==
కిర్గిజ్‌లో "ఒబాన్" పేరుతో ప్రచురితమైన ఈ నవల 1958 లో రష్యన్‌ భాషలో న్యూ వరల్డ్ మాగజైన్‌లో "జమీల్యా" పేరుతో ప్రచురించబడింది. ఈ పేరుతోనే ప్రపంచ భాషలలో ప్రసిద్ది చెందింది. తొలుత సోవియట్ యూనియన్ లో విశిష్టమైన గుర్తింపు పొందిన దీనిని కవి లూయీ అర^గొవ్ ఫ్రెంచ్ భాషలో అనువదించడంతో, దీని గొప్పతనం ప్రపంచానికి వెల్లడైంది. నేటివరకు జమీల్యా నవల నూట యాభైకి పైగా భాషలలో ప్రచురించబడింది. భారతదేశంలోను దాదాపు అన్ని ప్రాంతీయ భాషలలో ఇది అనువదించబడింది. తెలుగులో ఉప్పల లక్ష్మణరావు చేసిన అనువాదాన్ని 1971 లో ప్రగతి ప్రచురణాలయం ప్రచురించింది. తరువాత 2008 లో హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించింది.
 
==చలన చిత్రీకరణలు==
1968 లో ఇరినా పోప్లావాస్కయా, సెర్గీ యుట్కెవిచ్ దర్శకత్వంలో ఈ నవల రష్యన్ భాషలో జమీల్యా (రష్యన్ Джамиля) సినిమాగా విడుదలైంది. కథానాయకి జమీల్యా పాత్రలో నటల్యా అరిన్‌బసరోవా, ధనియార్ పాత్రలో సుయ్మెన్కుల్ చోక్మరోవ్ నటించారు.<ref>{{cite web |title=Jamilya (1969) |url=https://www.imdb.com/title/tt0064269/?ref_=nm_flmg_wr_18 |website=IMOB |accessdate=2 September 2020}}</ref> ఈ క్లాసిక్ చిత్రానికి రచయిత 'చింగిజ్ ఐత్‌మాతోవ్' స్వయంగా కథ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
7,435

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3029335" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ