ఉపవాసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంను → సాన్ని , స్థంభ → స్తంభ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి|date=10 సెప్టెంబరు 2020}}
'''ఉపవాసం''' అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
'''ఉపవాసం''' అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
==జాగ్రత్తలు==
==జాగ్రత్తలు==

17:13, 10 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.

జాగ్రత్తలు

భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.

హిందూమతంలో ఉపవాసదీక్ష

ఇస్లాంలో ఉపవాసవ్రతం

సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్తంభాలలో మూడవది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=ఉపవాసం&oldid=3031357" నుండి వెలికితీశారు