పి.లీల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36: పంక్తి 36:
}}
}}


'''పొరయత్తు లీల''' ([[మే 19]], [[1934]] - [[అక్టోబరు 31]], [[2005]]) ప్రముఖ దక్షిణ భారత నేపథ్యగాయని. [[మలయాళ భాష|మలయాళ]] చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[తెలుగు]] భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. [[తెలుగు]]లో [[లవకుశ]], [[మాయాబజారు]], [[పాండవవనవాసం]], [[రాజమకుటం]], [[గుండమ్మకథ]], [[చిరంజీవులు]] తదితర [[సినిమా]]ల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.<ref>{{Cite web |url=http://www.tlca.com/adults/p_leela.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-04-04 |archive-url=https://web.archive.org/web/20070130180357/http://www.tlca.com/adults/p_leela.html |archive-date=2007-01-30 |url-status=dead }}</ref>
'''పొరయత్తు లీల''' ([[మే 19]], [[1934]] - [[అక్టోబరు 31]], [[2005]]) దక్షిణ భారత నేపథ్యగాయని. [[మలయాళ భాష|మలయాళ]] చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[తెలుగు]] భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. [[తెలుగు]]లో [[లవకుశ]], [[మాయాబజారు]], [[పాండవవనవాసం]], [[రాజమకుటం]], [[గుండమ్మకథ]], [[చిరంజీవులు]] తదితర [[సినిమా]]ల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.<ref>{{Cite web |url=http://www.tlca.com/adults/p_leela.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-04-04 |archive-url=https://web.archive.org/web/20070130180357/http://www.tlca.com/adults/p_leela.html |archive-date=2007-01-30 |url-status=dead }}</ref>


== జననం ==
== జననం ==

01:43, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

పొరయత్తు లీల
పి.లీల
జననంపి.లీల
(1934-05-19)1934 మే 19
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూర్
మరణం2005 అక్టోబరు 31(2005-10-31) (వయసు 71)
చెన్నై, ఇండియా
వృత్తిగాయని
ప్రసిద్ధిసోలో సింగర్
తండ్రివి.కె.కన్‌జన్‌మీనన్
తల్లిపొరయాత్ మీనాక్షీ అమ్మ

పొరయత్తు లీల (మే 19, 1934 - అక్టోబరు 31, 2005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1]

జననం

లీల మే 19, 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణంతో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మలయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మన దేశం.


తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీల 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

తెలుగు సినిమారంగం

ఈమె 1949 నుండి 1984 వరకు అనేక తెలుగు సినిమాలో పాటలు పాడింది. చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీతాన్ని సమకూర్చింది[2].

పి.లీల తెలుగు చిత్రాలలో పాడిన సినిమ పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహ గాయకుడు/ గాయని సంగీత దర్శకుడు గేయ రచయిత సినిమా విడుదలైన సంవత్సరం
1 మనదేశం బాలత్రిపురసుందరీ ఘంటసాల 1949
2 కీలుగుర్రం దిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మి ఘంటసాల తాపీ ధర్మారావు నాయుడు 1949
3 కీలుగుర్రం నిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబో ఘంటసాల తాపీ ధర్మారావు నాయుడు 1949
4 గుణసుందరి కథ ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి ఓగిరాల రామచంద్రరావు పింగళి 1949
5 గుణసుందరి కథ ఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి ఓగిరాల రామచంద్రరావు పింగళి 1949
6 గుణసుందరి కథ కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని ఓగిరాల రామచంద్రరావు పింగళి 1949
7 గుణసుందరి కథ చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే కస్తూరి శివరావు ఓగిరాల రామచంద్రరావు పింగళి 1949
8 గుణసుందరి కథ శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవే ఓగిరాల రామచంద్రరావు పింగళి 1949
9 లైలా మజ్ను అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపు కె.జమునారాణి సి.ఆర్.సుబ్బరామన్ సముద్రాల సీనియర్ 1949
10 శ్రీ లక్ష్మమ్మ కథ ఇది నా విధికృతమా గతిమాలిన జన్మ యిల బాధలకేనా సి.ఆర్.సుబ్బరామన్ 1950
11 శ్రీ లక్ష్మమ్మ కథ చిన్నారి బంగారు చిలకవే నా తల్లి చిగురుమావులలోన బృందం సి.ఆర్.సుబ్బరామన్ 1950
12 శ్రీ లక్ష్మమ్మ కథ జీవితమే వృధాయౌనో సుఖించే ఆశలు మాసెనో బృందం సి.ఆర్.సుబ్బరామన్ 1950
13 అగ్నిపరీక్ష వసంత రుతువే హాయి మురిపించి మించెనోయి గాలిపెంచల కె.జి. శర్మ 1951
14 పాతాళ భైరవి ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటు ఘంటసాల ఘంటసాల పింగళి 1951
15 పాతాళ భైరవి కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఘంటసాల ఘంటసాల పింగళి 1951
16 పాతాళ భైరవి తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంత బృందం ఘంటసాల పింగళి 1951
17 పాతాళ భైరవి హయిగా మనకింక స్వేచ్ఛగా ఘంటసాల ఘంటసాల పింగళి 1951
18 సర్వాధికారి అందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలు సుసర్ల దక్షిణామూర్తి 1951
19 చిన్నమ్మ కథ కనుపించినావు రావో రాకున్న విడువనోయీ వేలూరు కృష్ణమూర్తి 1952
20 పెళ్ళి చేసి చూడు ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరా ఘంటసాల ఘంటసాల పింగళి 1952
21 పెళ్ళి చేసి చూడు ఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవు ఘంటసాల పింగళి 1952
22 పెళ్ళి చేసి చూడు ప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా యుగ పిఠాపురం,
రామకృష్ణ
ఘంటసాల పింగళి 1952
23 పెళ్ళి చేసి చూడు మనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసా ఘంటసాల పింగళి 1952
24 మిస్సమ్మ ఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఎస్.రాజేశ్వరరావు పింగళి 1955
25 మిస్సమ్మ కరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాత ఎస్.రాజేశ్వరరావు పింగళి 1955
26 మిస్సమ్మ తెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగా ఎస్.రాజేశ్వరరావు పింగళి 1955
27 మిస్సమ్మ రాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా సి.కృష్ణవేణి ఎస్.రాజేశ్వరరావు పింగళి 1955
28 మిస్సమ్మ రావోయి చందమామ మా వింత గాథ వినుమా ఎ.ఎం.రాజా ఎస్.రాజేశ్వరరావు పింగళి 1955
29 చరణదాసి ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరము ఎస్.రాజేశ్వరరావు 1956
30 చింతామణి తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా అద్దేపల్లి రామారావు,
టి.వి.రాజు
1956
31 చిరంజీవులు అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి ఘంటసాల బృందం ఘంటసాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1956
32 చిరంజీవులు ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక ఘంటసాల ఘంటసాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1956
33 చిరంజీవులు ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే ఘంటసాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1956
34 చిరంజీవులు కనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైన ఘంటసాల ఘంటసాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1956
35 చిరంజీవులు చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు ఘంటసాల ఘంటసాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1956
36 చిరంజీవులు తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరా ఘంటసాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1956
37 భలే రాముడు ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేల ఎస్. రాజేశ్వరరావు సదాశివబ్రహ్మం 1956
38 హరిశ్చంద్ర ఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మ సుసర్ల దక్షిణామూర్తి జంపన 1956
39 దొంగల్లో దొర విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాల ఘంటసాల ఎం.ఎస్.రాజు నారపరెడ్డి 1957
40 మాయాబజార్ చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము ఘంటసాల ఎస్.రాజేశ్వరరావు పింగళి 1957
41 మాయాబజార్ దయచేయండి దయచేయండి ఘంటసాల,
పి.సుశీల
ఘంటసాల పింగళి 1957
42 మాయాబజార్ నీకోసమె నే జీవించునది ఘంటసాల ఎస్.రాజేశ్వరరావు పింగళి 1957
43 మాయాబజార్ నీవేనా నను తలచినది ఘంటసాల ఎస్.రాజేశ్వరరావు పింగళి 1957
44 మాయాబజార్ లాహిరి లాహిరి లాహిరిలో ఘంటసాల ఎస్.రాజేశ్వరరావు పింగళి 1957
45 మాయాబజార్ విన్నావటమ్మా ఓ యశోదమ్మా పి.సుశీల,
స్వర్ణలత
ఘంటసాల పింగళి 1957
46 వినాయక చవితి ఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరా ఘంటసాల సముద్రాల సీనియర్ 1957
47 వినాయక చవితి తనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతో ఘంటసాల సముద్రాల సీనియర్ 1957
48 వినాయక చవితి రాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరా ఎం.ఎస్.రామారావు బృందం ఘంటసాల సముద్రాల సీనియర్ 1957
49 సతీ అనసూయ ఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతా ఘంటసాల సముద్రాల జూనియర్ 1957
50 సారంగధర జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి ఘంటసాల సముద్రాల సీనియర్ 1957
51 అప్పుచేసి పప్పుకూడు ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పై ఘంటసాల ఎస్.రాజేశ్వరరావు పింగళి 1959
52 పెళ్ళి సందడి అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా ఘంటసాల సముద్రాల జూనియర్ 1959
53 సతీ సుకన్య అందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనే ఘంటసాల శ్రీరామచంద్ 1959
54 భక్త రఘునాథ్ హేశివశంకరా నమ్మినవారి కావగలేవా మమ్మిటుచేయుట న్యాయమా ఘంటసాల సముద్రాల సీనియర్ 1960
55 మహాకవి కాళిదాసు రసికరాజమణిరాజిత సభలో యశము గాంచెదవే సోదరి రత్నం పెండ్యాల పింగళి 1960
56 శాంతి నివాసం కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే ఘంటసాల సముద్రాల జూనియర్ 1960
57 శాంతి నివాసం సెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోన ఎ.పి.కోమల బృందం ఘంటసాల సముద్రాల జూనియర్ 1960
58 జగదేకవీరుని కథ జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా పసుశీల బృందం పెండ్యాల పింగళి 1960
59 ఋష్యశృంగ ఆనందమీనాడే పరమానంద మీనాడే టి.వి.రాజు సముద్రాల జూనియర్ 1961
60 సీతారామ కళ్యాణం ఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేర ఘంటసాల గాలిపెంచల సముద్రాల సీనియర్ 1961
61 శ్రీకృష్ణ కుచేల నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైన ఘంటసాల ఘంటసాల పాలగుమ్మి పద్మరాజు 1961
62 గుండమ్మ కథ వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను ఘంటసాల ఘంటసాల పింగళి 1962
63 మహామంత్రి తిమ్మరుసు జయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగా ఘంటసాల పెండ్యాల పింగళి 1962
64 ఆప్తమిత్రులు పవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగ ఎ.పి.కోమల ఘంటసాల సముద్రాల జూనియర్ 1963
65 రాణీ సంయుక్త ఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలా ఘంటసాల ఎం.రంగారావు ఆరుద్ర 1963
66 లవకుశ జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే ఘంటసాల, పి.సుశీల, వైదేహి, పద్మామల్లిక్ ఘంటసాల సముద్రాల సీనియర్ 1963
67 లవకుశ రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా పి.సుశీల ఘంటసాల సముద్రాల సీనియర్ 1963
68 లవకుశ రామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమ పి.సుశీల ఘంటసాల సముద్రాల సీనియర్ 1963
69 లవకుశ లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో పి.సుశీల ఘంటసాల సముద్రాల సీనియర్ 1963
70 లవకుశ వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా పి.సుశీల ఘంటసాల సముద్రాల సీనియర్ 1963
71 లవకుశ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మా పి.సుశీల ఘంటసాల సముద్రాల సీనియర్ 1963
72 సోమవార వ్రత మహాత్మ్యం అడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడి మాస్టర్ వేణు నార్ల చిరంజీవి 1963
73 పతివ్రత రావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణా ఎం.రంగారావు అనిసెట్టి 1964
74 పతివ్రత నీ చెలికనవో నీ చెలి గనవా చలించవా మాధవపెద్ది ఎం.రంగారావు అనిసెట్టి 1964
75 పతివ్రత లేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తి బృందం ఎం.రంగారావు అనిసెట్టి 1964
76 పతివ్రత సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో పి.బి.శ్రీనివాస్ ఎం.రంగారావు అనిసెట్టి 1964
77 బభ్రువాహన ఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరా పామర్తి సముద్రాల సీనియర్ 1964
78 రహస్యం శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళా ఘంటసాల మల్లాది 1967
79 శ్రీకృష్ణ మహిమ కృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనా ఎ.పి.కోమల ఘంటసాల అనిసెట్టి 1967
80 శ్రీకృష్ణావతారం విన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలు బృందం టి.వి.రాజు సి.నా.రె. 1967
81 తారాశశాంకము నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస పి.సుశీల టి.వి.రాజు సముద్రాల సీనియర్ 1969
82 మా ఇలవేల్పు గౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరి జిక్కి జి.కె.వెంకటేష్ సి.నా.రె. 1971

మరణం

లీల అక్టోబర్ 31 2005చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వల్ల పరిస్థితి విషమించింది.[3]

ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింది.

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-30. Retrieved 2007-04-04.
  2. కంపల్లె, రవిచంద్రన్ (2013). జ్ఞాపకాలు (తృతీయ ed.). చెన్నై: కళాతపస్వి క్రియేషన్స్. pp. 131–136. {{cite book}}: |access-date= requires |url= (help)
  3. P. Leela's death mourned - ది హిందూ, నవంబర్ 1, 2005

బయటి వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=పి.లీల&oldid=3036254" నుండి వెలికితీశారు